ఏమి జేతు నీకు పూజ / emi jetu neku puja - అయ్యప్ప భజన పాటల లిరిక్స్ 

ఏమీ జేతు నీకు పూజ ఎట్ల జేతు నీకు సేవ
మాల వేసుకుందా మంటే పూజ విధము తెలియ దాయే

నీ పూజ విధము వింటుంటే స్వామి ఓ... అయ్యప్ప,
నిదురంతా కరువాయే స్వామి ఓ... అయ్యప్ప



మాలైతే వేసుకుంటి దీక్ష నేను పూనుకుంటి
నల్లాని బట్టలేసి నుదుట గంధం బొట్టు పెట్టి

శరణం అంటే సిగ్గాయే స్వామి ఓ... అయ్యప్ప,
శరణు ఘోష రాకపాయే స్వామి ఓ... అయ్యప్ప.


ఇరుమూడి నెత్తుకోని ఎరుమేలి దరికి చేరి
పెదపాదం పొదమంటే ఆలి, పిల్ల యాదికొచ్చే

కరిమల గుట్టంటే స్వామి ఓ.. అయ్యప్ప,
కాళ్లు చేతు వనక వట్టే స్వామి ఓ... అయ్యప్ప
కరిమల పేరు వింటే స్వామి ఓ.. అయ్యప్ప,
కాళ్లు చేతు వనక వట్టే స్వామి ఓ... అయ్యప్ప



కింద మీద పడుకుంటూ కరిమాల గుట్టనెక్కి
పాపాలు పోతయని పంబ నది చేరుకుంటి

పాపాలు పారిపోయే స్వామి ఓ... అయ్యప్ప,