ఎక్కడున్నావయ్యా, నీవెక్కడున్నావో - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
ఎక్కడున్నావయ్యా, నీవెక్కడున్నావో - ఎక్కలేని శిఖరానా, ఎక్కడో దూరాన ||2||
చుక్కలలో చంద్రుడిలా ఒక్కడివే ఒంటరిగా
హరిహరపుత్రా దివ్య చరిత్రా
1. పంచశైల శిఖరమట - పంపానది పారునట
శ్రీరామపాదమట - శబరికోరె మోక్షమట
శరణంటూ పలికితే- మహిమలు చూపింతువటా
ఎక్కడున్నావయ్యా!॥
2. ఏ కాంత లేనిచోట ఏకాంత వాసమట
అజ్ఞానుల పాలిట - జ్ఞానజ్యోతి నీవట
కష్టాలను కడతేర్చి కారుణ్యమూర్తినట
ఎక్కడున్నావయ్యా
No comments
Post a Comment