కేరళ దేశం పోదామా / Kerala Desham Podama - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

“కేరళ దేశం పోదామా” 
రామ రామ స్వామి  అయ్యప్ప 
రామ రామ స్వామి  అయ్యప్ప 

తూరుపు దేశం పోదామా తుమ్మిపూలు తెస్తామా 
తెచ్చి అయ్యప్పకిస్తామా అయ్యప్ప భజనలు చేస్తామా  (రామ)

పడమట దేశం పోదామా పండ్లు మల్లెలు తెస్తామా 
తెచ్చి అయ్యప్పకిస్తామా అయ్యప్ప భజనలు చేస్తామా   (రామ)

ఉత్తరదేశం పోదామా ఉమ్మిపూలు తెస్తామా 
తెచ్చి అయ్యప్పకిస్తామా అయ్యప్ప భజనలు చేస్తామా  (రామ)

దక్షిణదేశం పోదామా తామరపూలు తెస్తామా 
 తెచ్చి అయ్యప్పకిస్తామా అయ్యప్ప భజనలు చేస్తామా (రామ)

కేరళదేశం పోదామా అయ్యప్ప స్వామిని చూద్దామా 
చూచి శరణాలు చెపుదామా నెయ్యభిషేకము చేద్దామా (రామ)

అయ్యప్ప నామము దొరికినది మన పాపాలన్ని తొలగినవి 
అయ్యప్ప నామము దొరికినది మన కష్టాలన్నీ తీరినవి 
అయ్యప్ప నామం మధురమయా అయ్యప్పనామం చెప్పవయా 

రామ రామ రామ అయ్యప్ప - రామ రామ రామ అయ్యప్ప