అయిదుకొండల్లో కొలువున్నవాడు l అయ్యప్ప భజన పాటల లిరిక్స్
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా 8. అయిదుకొండల్లో ....
ప) అయిదుకొండల్లో కొలువున్నవాడు
స్వామి అయ్యప్ప ...
భక్తుల గుండెల్లో దాగున్నవాడు
శరణమయ్యప్ప ...
స్వామి అయ్యప్ప ... శరణమయ్యప్ప
చ) నియమాల మాలలు వేయిస్తాడు
నిష్ఠతో దీక్షలు చేయిస్తాడు
ఎదఎదలో భక్తిపూలు పూయిస్తాడు
ప్రతి మదిని మందిరంగా మార్చేస్తాడు
స్వామి అయ్యప్ప ... శరణమయ్యప్ప
చ) నమ్ముకున్నోళ్లను వెంటుండి నడిపిస్తాడు
తానున్నానని భరోసా అందిస్తాడు
కరిమలవాసుడు కృపను కురిపిస్తాడు
మామలైవాసుడు మనలను మురిపిస్తాడు
స్వామి అయ్యప్ప ... శరణమయ్యప్ప
చ) ఇడుములు తీర్చేందుకు
ఇరుముడులు కట్టిస్తాడు
శరణుఘోషలతో శిరసుపై పెట్టిస్తాడు
పడు లెక్కించి సన్నిధికి రప్పిస్తాడు
దివ్యదర్శన భాగ్యాన్ని దక్కిస్తాడు
స్వామి అయ్యప్ప ... శరణమయ్యప్ప
No comments
Post a Comment