సంతసంబు సంతసంబు సంతసంబహో / Santhasambu Santhasambu - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 సంతసంబు సంతసంబు సంతసంబహో

శబరిమలై యాత్రచేయ సంతసంబహో


కార్తికీయ మాసమందు కఠిన నిష్టతో

కంఠమాల వేసుకొనగ కలుగు సంతసం ||సంత॥


శరణుఘోషవేడుగొనుచు శబరిమలై కేగగా

ఇరుముడి దాల్చివేగ ఎరిమేలి చేరగా |॥సంత॥


ఆటవిక వేషమంది ఆడిపాడగా

దివ్యమైన పంబనదిని తీర్ధమాడగా |॥సంత|




శబరిపీఠమందు చేరి శరము గ్రుచ్చగా

పదెనెట్టాంబడి నెక్కుచు పరవశించగా |॥సంత||