పల్లికట్టు శబరిమలైకి / Pallikattu Shabarimalaiki - అయ్యప్ప భజన పాటల లిరిక్స్


ఇరుముడితోటి నిను మదినింపి - కదిలేము స్వామి అండగనుండి నీడగనిలిచి - దీక్షను కావవయ్యా 


పల్లికట్టు శబరిమలైకి - కల్లుమ్ ముల్లుం కాలికి మెత్తెయి 

స్వామియే అయ్యప్పో - అయ్యప్పో స్వామియే

పల్లికట్టు శబరిమలైకి - కల్లుమ్ ముల్లుం కాలికి మెత్తెయి 

స్వామియే అయ్యప్పో - అయ్యప్పో స్వామియే 




నెయ్యాభిషేకం చెయ్యండి - హారతులిచ్చి కొలవండి 

ఇరుముడి స్వామికి భక్తిగ ఇచ్చి - వేదన తీరగ వేడండి అయ్యప్పను కని పిలవండి 

స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

వేకువ జామున నిద్రనులేచి - శీతల స్నానము శ్రద్దగా చేసి 

మాలను దాల్చి శీఘ్రముగా - దీక్షారంబము చేసితిని

*గణపతి షణ్ముక అయ్యప్ప స్వాముల - ప్రాతఃకాలపు వేళల తలచి 



స్వామి అయ్యప్ప శరణు ఘోషతో - మండల దీక్షచేసితిని*

స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే

ముప్పూటలు శ్రీ అయ్యప్ప స్వామిని - ముదమున కొలిచి సేవించి 

నల్లని దుస్తులు ధరించి - శ్రీ శని భగవానుని కొలిచెదము 

కాలికి చెప్పులు లేకయే తిరుగుచు - అయ్యప్పలనే శృతియించితి 


సంధ్యా సేవలు చేయుచు స్వామిని - ఆనందముగా కొలిచెదను 

స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

భజనలు చేసే స్వాములగృహములు - వెతికే వెళ్ళితిమి 

పడి పూజలతో మణిధరుని - జ్యోతిగ చూచి మురిసితిని




స్వామి ప్రసాదము సేవించి - నేలను నిద్దుర పోయితిని మండలమంతా ఇటులే - అయ్యప్పను నే కొలిచితిని 


దేహబలందా - పాద బలందా

స్వామి ఇచ్చిన ధైర్యముతోటి - దీక్షను ముగియించి 

గురు స్వామిని గని - భక్తితో కొలచి ఇరుముడి దాల్చితిని - నే ఇరుముడి దాల్చితిని 

స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

సత్య వాక్కులను పలుకుచూనే - స్వామి నామము తలచితినీ 

దృష్టింతలను మదిలో మాని - అయ్యప్పను యద దాల్చితిని మానస మందున మురిసితిని 




పదినెనిమిది మెట్లెక్క తలచితిని అయ్యప్ప స్వామినే కాంచేదనూ - మకర జ్యోతిని చూసెదను. స్వామి సన్నిధిలో - నన్ను నే మరచెదను 


పల్లికట్టు శబరిమలైకి కల్లుమ్ ముల్లుమ్ కాలికిమెతై స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే