నీవే గతిదేవా ననుబ్రోవగ ఇకరావా / Nerve Gathi Deva - అయ్యప్ప భజన పాటల లిరిక్స్


స్వామి అయ్యప్పా స్వామీ అయ్యప్పా
నీవే గతిదేవా ననుబ్రోవగ ఇకరావా

అందకారమందే అలమటించి నేనూ
కన్నులుండి కూడా కాననైతి నిన్ను | ||2||
దేవ దేవ నాపై కరుణ కురియవేల ||2||
వెలుగు వైపు నాకూ వేగమే చూపించుము తోవ 
                                   ||స్వామి అయ్యప్పా

 సిరుల నెన్నడైనా అడుగుటెరుగనయ్యా
స్వర్గ సుఖముకోరీ వరము వేడనయ్యా ||2||
ముక్తి పొంద నెంచి చేయి చాచానయ్యా ||2||
శాంతి కోరి నిన్నే నేను పాడుచుందునయ్యా
                                    ||స్వామి అయ్యప్పా



కనులలోను నీవే వెలుగు నింపుమయ్యా
మనసులోన నీవే కొలువు దీరవయ్యా
మధుర సుస్వరాల సుధలు కురుయుమయ్య
జీవులెల్ల నిన్ను కోరే శాంతి నొసగుమయ్య ||2||
                                  || స్వామి అయ్యప్పా!!


నీవే గతి దేవా / Nerve Gathi Deva - అయ్యప్ప భజన పాటల లిరిక్స్