హద్దిర హద్దిర / Haddira Haddira Banna - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
హద్దిర హద్దిర భన్న నిక్కమైన దేవుడు
శరణంటే కాపాడు అయ్యప్ప దేవుడు ||2||
హరి పుత్రుడంటరా - హరతనయుడంటరా ||హద్దిర॥
సకలాభిషేకాన పరమాత్మ మెచ్చెరా
పరమాత్మ మెచ్చెరా పాపాలు తుంచెరా ||హద్దిర||
నెయ్యాభిషేకాన అయ్యప్ప మెచ్చరా
అయ్యప్ప మెచ్చెరా ఆనందమిచ్చెరా ||హద్దిర||
తేనాభిషేకాన దీనబంధు మెచ్చెరా
దీనబందు మెచ్చెరా దీవెనలు ఇచ్చెరా ||హద్దిర||
చందనాభిషేకాన శభరిషుడు మెచ్చెరా
శభరీషుడు మెచ్చెరా అభయంబు ఇచ్చెరా ||హద్దిర||
No comments
Post a Comment