గల గల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి - అయ్యప్ప భజన పాటల లిరిక్స్



గల గల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి     ||2||

ఆడుకుందాము రావా నా అయ్యప్ప స్వామి

పాడుకుందాము రావా నా అయ్యప్ప స్వామి

హరిహర తనయుడా అందాల బాలుడా

గలగల గలగల గలగల

గలగల గజ్జలు కట్టినా అయ్యప్ప స్వామి         ||2||




విల్లాలి వీరుడవయ్యా నా అయ్యప్ప స్వామి

వీరమణికంఠుడవయ్యా నా అయ్యప్ప స్వామి

మోహన రూపుడవయ్యా నా అయ్యప్ప స్వామి

మోహినీ బాలుడవయ్యా నా అయ్యప్ప స్వామి

హరిహర తనయుడా అందాల బాలుడా

గలగల గలగల గలగల             ||గలగల||       ||2||



పంపా బాలుడవయ్యా నా అయ్యప్ప స్వామి

పందల రాజునువయ్యా నా అయ్యప్ప స్వామి

నీలిమల వాసుడవయ్యా నా అయ్యప్ప స్వామి  

నిత్య బ్రహ్మచారుడవయ్యా నా అయ్యప్ప స్వామి

హరిహర తనయుడా అందాల బాలుడా

గలగల గలగల గలగల

గలగలగల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి     ||2||



ఈ పూజలు నీకేనయ్య నా అయ్యప్ప స్వామి

ఈ భజనలు నీకేనయ్యా నా అయ్యప్ప స్వామి

పడిపూజలు నీకే నయ్యా నా అయ్యప్ప స్వామి

జ్యోతి స్వరూపుడవయ్యా నా అయ్యప్ప స్వామి

హరి హర తనయుడా అందాల బాలుడా

గలగల గలగల గలగల

గలగలగల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి    ||2||



ఆడుకుందామురావా నా అయ్యప్ప స్వామి

పాడుకుందాము రావా నా అయ్యప్ప స్వామి

హరిహర తనయుడా అందాల బాలుడా

గలగల గలగల గలగల

గలగలగల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి    ||2||


 Gallu Gallu Gajjelu Katti Ayyappa Songs lyrics