ఎరిమేలి కొండొచ్చింది-కొట్టాయం బండొచ్చింది l అయ్యప్ప భజన పాటల లిరిక్స్


ఎరిమేలి కొండొచ్చింది-కొట్టాయం బండొచ్చింది 

పద గురుస్వామి - నీయెనకాల మేమొస్తాం

ఎరిమేలిని చూపించు - రంగులనే పూయించు 

వేటతుల్లి ఆడించు - ధర్మశాస్తను చూపించు 

పద గురుస్వామి నీవెనకాలే మేమొస్తాం.     ॥ఎరిమేలిl





చ2॥ మొదటి కొండొచ్చిందని గబ గబనే నడిచొస్తా 

అలుదాలో స్నానమాడి ఆడుకుండు నేనొస్తా 

పద గురుస్వామి నీవెనకాలే మేమొస్తాం  ॥ఎరిమేలి॥


 3. పంబలోన స్నానమాడి - పాపాలే కడిగేసి 

గణపతి చూపించు గబ గబనే నడిపించు 

పద గురుస్వామి నీవెనకాలే మేమొస్తాం    ॥ఎరిమేలి॥


4 సన్నిధానం చూపించి - దర్శనమే చేయించు 

ఇరుముడులను ఇప్పించి - అభిషేకము చేయించు 

పద గురుస్వామి నీవెనకాలే మేమొస్తాం    ॥ఎరిమేలి॥


5 మకర సంక్రాంతినాడు-స్వామి జ్యోతి చూపించి 

మాజన్మలు సార్థకమనే - ఈ దీక్షను చేయించు 

పద గురుస్వామి నీవెనకాలే మేమొస్తాం