అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా / Ayya Ani Pilichina - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా
అభయమిచ్చి బ్రోచేది అయ్యప్పయే అండగా నిలిచేది ఆ తండ్రియే || అయ్యా॥
శివకేశవ రూపమైన మోహిని పుత్రుని
పంబానది తీరాన వెలసిన బాలుని || అయ్యా॥
పులిపాలను తెచ్చిన పొన్నంబల వాసుని
తల్లి మనసు మార్చిన శబరిగిరి నాధుని || అయ్యా॥
మంజుమాత వలచిన మోహనరూపున
కాంతమల జ్యోతిగా వెలుగొందు స్వామిని || అయ్యా॥
అజ్ఞానపు పొరలను తొలిగించే దేవుని
అందరినీ ప్రేమ మీర కరుణించే మూర్తివి || అయ్యా॥
No comments
Post a Comment