సుప్రభాతం స్వామి సుప్రభాతం
సుప్రభాతం స్వామి సుప్రభాతం //2//
మేలుకోవయ్య తూర్పు తెల్లవారే మేలుకో //2//
పూజకు వేళాయే స్వామి మేలుకో. ||మేలుకో||
మా మొరలాలించి మమ్మేలుకో సుప్రభాతం స్వామి సుప్రభాతం
అష్టదిక్పాలురు నీ ఆజ్ఞకోసమే
ఎదురుచూస్తున్నారు నీవు మేలుకో
||అష్టదిక్పాలురు||
నా గొంతు పాడింది భూపాలం
నిద్రలేవరా స్వామి నా కోసం స్వామి
పంపానది నీ పాదాలు కడుగంగ
ఆరాటపడుతోంది లేవయ్యా
మా తొలి సంధ్య పూజలు గొనవయ్య
||సుప్రభాతం||
కస్తూరి గంధాలు నీ కోసమేనయ్యా
కావిళ్ళలలో నెయ్యి నీ కోసమే
||కస్తూరి||
మా కళ్ళు వేచేను నీ కోసం
జగమంత వేచేను నీ కోసం స్వామి
కనులార నీ రూపు దర్శించకుండిన ఈ కనులు మాకుండి ఫలమేమి
నీ పేరు తలచిన భయమేమి మేలుకోవయ్యా
స్వాగతం అయ్యప్పా..
స్వాగతం అయ్యప్పా... సుస్వాగతం అయ్యప్పా (2 )
రతనాల పందిళ్ళలో ముత్యాల ముగ్గులు వేసి
నిను పూజించే వేళాయె రా స్వామి నీకు ఇదే మా ఆహ్వానము.
(స్వాగతం )
పూలెన్నో తెచ్చాము నీ పూజకై
నీకెంతో మనసాయే ఈ వేళలో (2 )
నీవున్నా ప్రతి ఇల్లు ఓ కోవెల (2 )
పంపించు సిరులన్ని మా ఇంటికి..........
(స్వాగతం )
నా పిలుపులే నీకు ఆహ్వానము
నా హృదయమే నీకు సింహాసనం (2 )
నా కనులనే జ్యోతులుగా చేసి (2 )
హారతులు ఇచేము ఈ వేళలో.......
(స్వాగతం)
ఏనాడూ ఏ జన్మ ఏ పుణ్యమో
ఈనాడే నీ నోము నే నోచితి (2 )
ఈ జగములో కలకాలము (2 )
ఉంటాము ఎప్పుడు నీ సేవలో
(స్వాగతం)
-------------
స్వాగతం సుస్వాగతం మన అయ్యప్ప స్వామికి సుస్వాగతం
ప్రశాంత నిలయా అయ్యప్పస్వామి //2//
నిర్మల హృదయా సుస్వాగతం //స్వాగతం//
విళ్ళాలి వీర అయ్యప్పస్వామి //2//
వీరమణికంఠ సుస్వాగతం //స్వాగతం//
ఎరుమేలి వాసా అయ్యప్పస్వామి //2//
ఏకాంతవాసా సుస్వాగతం //స్వాగతం//
అళుదావాసా అయ్యప్పస్వామి //2//
అన్నదాన ప్రభువా సుస్వాగతం //స్వాగతం//
కరిమల వాసా అయ్యప్పస్వామి //2//
కరుణామూర్తి సుస్వాగతం //స్వాగతం//
పంపావాసా అయ్యప్పస్వామి //2//
పార్వతీ పుత్ర సుస్వాగతం //స్వాగతం//
నీలిమలై వాసా అయ్యప్పస్వామి //2//
నిత్యబ్రహ్మచారి సుస్వాగతం //స్వాగతం//
శబరి గిరీశ అయ్యప్పస్వామి //2//
శాంత స్వరూపా సుస్వాగతం //స్వాగతం//
జ్యోతి స్వరూపా అయ్యప్పస్వామి //2//
మకర జ్యోతి సుస్వాగతం //స్వాగతం//
స్వాగతం సుస్వాగతం మన అయ్యప్ప స్వామికి సుస్వాగతం
No comments
Post a Comment