భార్యభర్తల నడుమ అన్యోన్యతను పెంచే క్షేత్రం సీతారాముల ఆలయం

 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నుండి 125 కి.మీ దూరంలో మందాకినీ నదీ తీరంలోని చిత్రకూటం అనే క్షేత్రంలోని ఆలయం ఇది. మందాకినీ, పయస్వినీ నదుల సంగమస్థలంలో శ్రీసీతారాములు వనవాససయమంలో ఎక్కువ కాలం గడిపారు.  తరద్వాజ ముని సలహా మేరకు మందాకినీ నదీతీరంలో ఆశ్రమం నిర్మించుకుని నివసించారు. అలనాడు అత్రిమహర్షి భార్య అనసూయాదేవి సీతాదేవికి పాతివ్రత్య మహత్మ్యాన్ని భోదించింది ఇక్కడే. శ్రీరాముడు తండ్రికి పిండప్రదానం చేసిన ఇక్కడి ప్రదేశం శ్రీరామఘాట్ గా పిలువబడుతుంది.

 

 

 

ఈ ఘాట్ కి పశ్చిమ దిక్కున బ్రహ్మయజ్ఞం చేసిన యజ్ఞవేదిక ఉన్నది. ఆ పక్కనే సీతారాములు నివసించిన పర్ణశాల. ఆ ప్రదేశంలో శ్రీ సీతారాముల ఆలయం నిర్మించబడింది. శ్రీరామఘాట్లో స్నానం చేసిన తర్వాత ఆలయంలో శ్రీ సీతారాములను భక్తులు దర్శించుకుంటారు. భోగభాగ్యాలకి అతీతంగా శ్రీ సీతారాములు ఎంతో అన్యోన్యంగా పర్లశాలలో నివసించిన ఈ ప్రదేశంలోని ఆలయంలోని మూర్తులకు భక్తితో పూజలు చేస్తే భార్యాభర్తల్లో లోపించిన అన్యోన్యత చేకూరుతుందని భక్తుల నమ్మకం.