ధనుర్మాసం యొక్క విశిష్టత గోదాదేవి జీవిత చరిత్ర ఏడునూతుల
దక్షిణ ముఖ ద్వారం గల ఏడునూతుల వేణుగోపాలస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సం ధనుర్మాసము లో ఆండాళ్ (గోదాదేవి ) కి నెల రోజుల వ్రతం చేయబడును. పెళ్లి కానీ యువతులు ఈ వ్రతం చేస్తారు . దేవాలయంలో ధనుర్మాసములో ఉదయం తెల్లవారకముందే అమ్మవారైనా గోదాదేవి ని తులసి మాల తో అలంకరించి ధనుర్మాసము మొదటి రోజు నుండి రోజుకు ఒక తిరుప్పావు అనే రచనలను పాడుతారు అలాగే ఈ ధనుర్మాసము లో నైవేద్యంగా మొదటి పదిహేను రోజుల పాటు నైవేద్యంగా పులగం లేదా చెక్కర పొంగలి (కట్టే పొంగలి ) ని తరువాత పదిహేను రోజుల పాటు దద్ధోజనం సమర్పిస్తారు . అట్టి నైవేద్యమును భక్తులకు బాల భోగం గా పంచుతారు.
ఏడునూతుల దేవాలయంలో ధనుర్మాసం మొత్తం వైష్ణవ సాంప్రదాయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే గోదాదేవి రాసిన “తిరుప్పావై” ని ఈ నెల రోజులు పాడుతారు .ధనుర్మాసము చివరి నాడు దేవాలయంలో ఆండాళ్ (గోదాదేవి ) కి శ్రీ రంగ నాధునికి అంగరంగ వైభవంగా కళ్యాణం చేస్తారు .
ఆండాళ్ (గోదాదేవి ) పూర్తి చరిత్ర
గోదాదేవి అనగా ఎవరు.?
గోదాదేవి పేర్లు - కోదై, చూడిక్కొడుత్త నాచ్చియార్, ఆండాళ్, ఆముక్త మాల్యద
గోదాదేవి జన్మస్థలం - శ్రీరంగం
గోదాదేవి జన్మ నక్షత్రము - నల సంవత్సరం, కర్కాట మాసము, పుబ్బా నక్షత్రము, ఆషాఢ శుద్ధ చతుర్దశి, కాలము క్రీ.శ.776
గోదాదేవి దైవాంశ - లక్ష్మి
గోదాదేవి రచనలు - తిరుప్పావు, నాచ్చియార్ తిరుమొళి
ధనుర్మాసం యొక్క విశిష్టత గోదా దేవి జీవిత చరిత్ర ఏడునూతుల
గోదా చరితం
తమిళనాడు రాష్ట్రం లోని శ్రీవిల్లిపుత్తూరు గ్రామం లోని తులసి వనంలో కలియుగ ఆది లో అనగా 93 సంవత్సరం లో గోదాదేవి శ్రీవిష్ణుచిత్తుల వారికీ చిన్న పాపగా ఒక తులసి చెట్టు వద్ద కనిపించింది . శ్రీవిష్ణుచిత్తుల (పెరియాళ్వార్) భక్తుడు ఆ పాపకు గోదాదేవి అను నామకరణము చేసి ముద్దుబిడ్డగా ఆమెను ప్రేమతో పెంచి పెద్ద చేశాడు .
తమిళంలో కోదై అనగా తులసి మాల అని అర్థం. శ్రీవిష్ణుచిత్తుల వారికీ తులసి చెట్టు క్రింద కనిపించింది కనుక ఆమెను కోదా అని పిలిచేవారు.ఆమె పెరిగేకొద్దీ ఆ పేరే గోదా గా మారినది . . తండ్రి పెంపకం లో గోదా అమితమైన కృష్ణ భక్తి తో పెరిగి పెద్దయినది .
ప్రతి రోజు విష్ణుచిత్తులవారు తులసి మాలను తయారు చేసి ఒక బుట్టలో పెట్టి తిరిగి తన పనులను పూర్తి చేసుకొని ఆ తులసి మాలను దేవాలయానికి తీసుకొనివెళ్ళి నారాయణుకి సమర్పించేవాడు.
గోదా ప్రతి రోజు తండ్రి గారికి తెలియకుండా ఆ మాలను తను దరించి తాను భగవంతున్ని పెళ్లి చేసుకోవడానికి సరిపోవునా అని అద్దంలో చూసుకొని మురిసిపోయేది .
ఆ కృష్ణ భగవానుని తన భర్తగా ఊహించుకుంటూ ఆ భగవంతుణ్ణి పొందడం కోసం తన ఇంటిని శుభ్రం చేసి, రంగు రంగుల ముగ్గులు వేసి పూలతో వాకిలి ని అందంగా అలంకరించి తమిళంలో పాశురాలుగా పాడి, ధనుర్మాస (శ్రీ) వ్రతాన్ని పూర్తిచేసినది .
కొంత కాలానికి విష్ణుచిత్తుల గార్కి ఆ తులసి మాలలో ఒక వెంట్రుక కనిపించింది . గోదా ఆ తులసి మాలను వేసుకున్నదని గమనించి ఆమెను కోపగించాడు. ఇన్నిరోజులు తన చేత తప్పు జరిగిందని భావించి ఆ తులసి మాలను భగవంతునికి వేయలేదు . ఆరోజు ఆశ్చర్యంగా కళలో స్వామి కనిపించి ఈ రోజు తులసి మాలని ఎందుకు వేయ లేదని అడిగినాడు .. తన కు భక్తులు తాకిన తులసి మాల అంటే ఇష్టం అని చెబుతారు.
విష్ణుచిత్తులవారు గోదా ఒక కారణ జన్మురాలని గమనించినారు . నీవు మమ్మల్ని రక్షించడానికి వచ్చావమ్మ అంటూ తనను ఆండాళ్ అని పిలవటం మోదలు పెట్టాడు. ఆండాళ్ అనగా రక్షించడానికి వచ్చినది అని అర్థం.
ధనుర్మాసం యొక్క విశిష్టత గోదా దేవి జీవిత చరిత్ర ఏడునూతుల
ఆ నాటి నుండి ప్రతి నిత్యం ఆండాళ్ దరించిన ఆ తులసి మాల నే స్వామికి వేసేవాడు . . గోదాదేవికి యుక్త వయస్సు రాగానే పెళ్ళి చేయాలనీ తండ్రి వరునికై వెతుకుచుండెను , కాని ఆమె కృష్ణున్ని మాత్రమే పెళ్లి చేసుకుంటానని పంతంతో తండ్రి చెప్పెను. కాని తండ్రి గారు కృష్ణుడు ఉండేది ద్వాపరం లోని నందగోకులమనే ప్రాంతము లో ఉంటున్నాడని అది మనకు చాల దూరము, కాలము కూడా వేరు అని చెప్పినాడు .
తండ్రి ఆమెకు కృష్ణుడిని కేవలం పూజించే దైవంగా చూడాలని చెప్పినాడు . తండ్రి గారు వివిద దివ్యక్షేత్రాలలోని ఆయా దేవతా మూర్తుల కళ్యాణ గుణగణాలను కీర్తించెను. తరువాత గోదాదేవి శ్రీరంగం కు పోయి అక్కడ ఉన్న రంగనాయకులని వరునిగా కొలిచెను . శ్రీరంగనాథున్ని కళ్యాణమాడుటకై తాను “తిరుప్పావై” మరియు “నాచియార్ తిరుమొఱ్ఱి” అనే కీర్తనలను పాడెను.
ఒక నాడు శ్రీ రంగనాథుల వారు విష్ణుచిత్తుల వారికి కళలో కనిపించి, నీ కుమర్తె గోదా ను తనకిచ్చి పెళ్లి చేయటానికి బాధపడవద్దని చెప్పెను. ఆమె మరెవరో కాదు భూదేవి అని చెప్పెను. అదే విదముగా శ్రీరంగంలోని పెద్దలకు కూడా కళలో కనిపించి తన కళ్యాణముకై శ్రీవిల్లిపుత్తుర్ నుండి గోదాదేవి వారిని పల్లకీలో తెమ్మని చెప్పినాడు . అప్పటి రాజు వల్లభ దేవుని తో పాటు పెద్దలందరూ కలిసి గోదాదేవి ని రంగనాథుని వద్దకు తెచ్చారు . ఆమె ఆ రంగనాథున్ని కళ్యాణమాడి సన్నిధిలో కలిసిపోయినది.
ధనుర్మాసం యొక్క విశిష్టత గోదా దేవి జీవిత చరిత్ర ఏడునూతుల
అలనాడు గోపికలందరు అనంత శక్తిస్వరూపుడైన వేణుమాధవుణ్ణి ‘ప్రియమైన’ చెలికాడు అను దృష్టితో ఆరాధించేవారు . అప్పుడే ఆయన్ని పొందగలిగారు. అదే దృష్టితో వేణుమాధవుణ్ణి గోదాదేవి ఆరాధించింది. ఆమె వేణుమాధవుణ్ణి ప్రియునిగా భావించినది ,
స్వచ్ఛమైన మనస్సు తో తన హృదయాన్ని రంగనాథుడికి సమర్పించుకున్నది గోదాదేవి.. పాశురంలో ఫలశృతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి కృప తప్పకుండా కలుగు తుందని చెప్పినది . ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధం లో అంటే 4000 పాశురాలలో గోదాదేవి గారు పాడిన 30 పాశురాలకు అతి విశిష్ట స్థానం కలిగినది. మార్గశిర మాసం లో ప్రతి రోజు తిరుప్పావై లో ఉన్న మొత్తం 30 పాశురాలు రోజుకొకటి చొప్పున పారాయణం చేస్తారు.
ధనుర్మాసం యొక్క విశిష్టత గోదా దేవి జీవిత చరిత్ర ఏడునూతుల
- రామేశ్వరం జ్యోతిర్లింగ ఆలయం రామనాథస్వామి ఆలయం చరిత్ర పూర్తి వివరాలు
- సోమనాథ్ జ్యోతిర్లింగ దేవాలయం గుజరాత్ పూర్తి వివరాలు
- అరకులోయ ను సందర్శించడం చూడవలసిన ప్రదేశాలు
- TTD రూ.300/- స్పెషల్ ఎంట్రీ దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేయాలి (ttd ప్రత్యేక దర్శన టిక్కెట్లు)
- శ్రీ కాళహస్తి ఆలయంలో కాల సర్ప దోష పూజ వివరాలు
- స్వర్ణ దేవాలయం అమృతసర్ ఇండియా అద్భుతమైన దేవాలయం
- Medaram Sammakka Sarakka Jatara Telangana Kumbha Mela in India
- సోమనాథ్ ఆలయం సోమనాథ్ గుజరాత్ వాటి చరిత్ర పూర్తి వివరాలు
- తెలంగాణ బాల్కంపేట యెల్లమ్మ ఆలయం చరిత్ర పూర్తి వివరాలు హైదరాబాద్
- అమ్మపల్లి సీతా రామచంద్రస్వామి దేవస్థానం తెలంగాణ రంగారెడ్డి జిల్లా
- తెలంగాణ జ్ఞాన సరస్వతి టెంపుల్ చరిత్ర పూర్తి వివరాలు
- మల్లికార్జున జ్యోతిర్లింగ దేవాలయం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ పూర్తి వివరాలు
- Medaram Sammakka Sarakka Jatara Telangana
- తిరుమల తిరుపతి 300rs దర్శనం టికెట్ ఆన్‌లైన్ బుకింగ్ సీఘ్రా దర్శన్ టిటిడి
- వాన కొండయ్య లక్ష్మీ నరసింహ స్వామి జాతర
- నాగేశ్వర్ జ్యోతిర్లింగ దేవాలయం గుజరాత్ పూర్తి వివరాలు
- పురుషుతిక దేవి టెంపుల్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర పూర్తి వివరాలు
- నైనాటివు నాగపూసాని అమ్మన్ టెంపుల్ శ్రీలంక చరిత్ర పూర్తి వివరాలు
No comments
Post a Comment