తెలంగాణ ఆసార పెన్షన్ స్కీమ్ (పాతం) స్థితి
(తెలంగాణ రాష్ట్రానికి ముందు ఏర్పడింది) సంయుక్త ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణ ప్రాంతంలోని పెన్షన్ల మంజూరు చేసింది.
తెలంగాణ లో
VRUDULU (పదవీ విరమణ) కోసం, చెనేతా కర్మీకులు (వెబెర్), కల్లు గీతకర్మిక (తోడి), వితంతువులు (వితంతువు) ప్రస్తుత సిఎం అనుమతి పొందిన బిల్లులు లేదా నెల నెల పెన్షన్ల ఇస్తున్నారు
తెలంగాణ ఆసార పెన్షన్ స్కీమ్ (పాతం) స్థితి
Telangana Aasara Pension Scheme (Pathakam) Status |
ఫింఛనుకు అర్హులు:
ఈ క్రింద పేర్కొన బడినవారు ఆసరా ఫింఛను పథకానికి అర్హులు:
ఆది వాసి మరియు అసహాయ గిరిజన గ్రూపుల వారు
మహిళల నేతృత్వంలోని కుటుంబాలు, కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేనివారు
వికలాంగుల కుటుంబాలవారు
వికలాంగులు మరియు వితంతువులు తప్ప అన్ని రకాల ఆసరా ఫింఛనుకు కుటుంబములో ఒక్కరు మాత్రమే అర్హులు
భూమి లేని వ్యవసాయ కార్మికులు, గ్రామీణ కళాకారులు (కుమ్మరి, చేనేత, వడ్రంగి, కమ్మరి) మురికి వాడల ప్రజలకు, రోజు వారీ వేతనం మీద ఆధార పడే వారు, పూలు, పండ్ల వ్యాపారులు, రిక్షా కార్మికులు, పాము మంత్రం వేయువారు, చెప్పులు కుట్టేవారు, నిరాశ్రయులు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు చెందినవారు.
ఇళ్ళు లేని వారు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో తాత్కాలిక గృహ నివాసాలను ఏర్పాటు చేసుకున్నవారు
వృధ్ధులు, వితంతువులు, వికలాంగులు, జీవనాధారం లేని వ్యక్తుల నేతృత్వంలోని కుటుంబాలు మొదలైన వారు
ఆసరా ఫింఛను పథకానికి అర్హులు.
దరఖాస్తుల స్వీకరణ
గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతి సెక్రెటరి/విలేజి రెవెన్యూ అధికారి, పట్టణ ప్రాంతాలలో బిల్ కలెక్టరు దరఖాస్తులను పరిశీలిస్తారు.
మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ/జోనల్ అధికారి, దరఖాస్తులను పరిశీలించి వారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందించే మార్గదర్శకాల ఆధారంగా ఫింఛను మంజూరు చేస్తారు.
లబ్ధిదారులను గుర్తించే క్రమంలో గృహ సర్వే సమాచారాన్ని, జనాభా లెక్కలను, వికలాంగులు, వితంతువులు, వృధ్ధులు మరియు కమ్యూనిటీలకు చెందిన వివిధ వర్గాలను పరిగణలోనికి తీసుకుంటారు.
దరఖాస్తు పరిశీలనలో లేదా ఆకస్మిక తనిఖీలో ఏదైనా తప్పుడు సమాచారం ఉన్నచో, అటువంటి వారిపై క్రమశిక్షణా చర్య తీసుకుంటారు లేదా చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేస్తారు.
సామాజిక-ఆర్ధిక అనర్హతలు:
వృధ్ధులు, వికలాంగులు, మరియు వితంతువులు, కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేని వారి కోసం ఆసరా ఫింఛను పథకాన్ని ప్రారంభించారు. మిగతావారు ఈ ఆసరా ఫింఛను పథకానికి అనర్హులు. ఈ క్రింద పేర్కొన బడినవారు ఆసరా ఫింఛను పథకానికి అనర్హులు:
3 ఎకరాల సాగునీటి సదుపాయం ఉన్న భూమి/ 7.5 ఎకరాల బీడు భూమి ఉన్నవారు
ప్రభుత్వ/ప్రభుత్వ రంగ / ప్రైవేటు రంగ /కాంట్రాక్టరు ఉద్యోగం ఉన్న పిల్లలు కలవారు
వైద్యులు, కాంట్రాక్టర్లు, స్వయం ఉపాధి కలిగిన పిల్లలు కలవారు
పెద్దవ్యాపార సంస్థలు (నూనె మిల్లులు, బియ్యం మిల్లులు, పెట్రోలుపంపులు, షాపు యజమానులు) ఉన్న వారు
ఇప్పటికే ప్రభుత్వం నుండి ఫింఛను పొందుతున్నవారు
తేలికపాటి మరియు భారీ వాహనములు కలిగినవారు
జీవన శైలి, వృత్తి మరియు ఆస్తుల ఆధారంగా అనర్హులని అధికారులచే గుర్తించబడ్డ కుటుంబాలు మొదలైన వారు ఆసరా ఫింఛను పథకానికి అర్హులు కాదు.
ఫింఛను పథకానికి అర్హతలు
- వృధ్ధులు: ది. 01.04.2019 నుండి 57 సంవత్సరాలు ( ది. 31.03.2019 వరకు 65 సంవత్సరాలు) లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న వృధ్ధులు ఆసరా ఫింఛను పథకానికి అర్హులు. జనన ధ్రువీకరణ పత్రము లేదా ఆధార్ కార్డు లేదా వయస్సుని సూచించే ఏదైనా ఇతర పత్రములు ధరఖాస్తుకు అవసరమవుతాయి. పైన తెలిపిన పత్రాలు లేకపోతే గవర్నమెంటు అధికారి లభ్ధిదారుని పిల్లల వయస్సు, మనుమలు, మనుమరాళ్ళ వివాహ వయస్సు ఆధారంగా గుర్తించవచ్చు అలా గుర్తించలేని పరిస్థితిలో మెడికల్ బోర్డుకు సూచిస్తారు.
- చేనేత కార్మికులు: 50 సంవత్సరాలు అంత కన్నా ఎక్కువ వయస్సు కలిగిన వారు అర్హులు.
- వితంతువులు: 18 సంవత్సరాలు నిండినవారై, భర్త మరణ ధ్రువీకరణ పత్రము కలిగిన వారు అర్హులు. నిర్ధారణ సమయంలో భర్త మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా చూపించాలి. మరణ ధ్రువీకరణా పత్రం లేకపొతే జనన మరణ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం మూడు నెలల్లో ధ్రువీకరణ పత్రం పొందాలి. లబ్ధిదారుని పునర్వివాహం విషయంలో విలేజి సెక్రెటరీలు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం సర్టిఫై చేయాలి.
- కల్లు గీత కార్మికులు: 50 సంవత్సరాలు నిండినవారై ఉండాలి. లబ్ధిదారుడు కల్లు గీత కార్మికుల సహాయక సంఘంలో సభ్యత్వం పొంది ఉండాలి.
- వికలాంగులు: వీరికి వయస్సుతో సంబంధం లేదు. కనీసం 40 శాతం వైకల్యం కలిగి ఉండాలి. వినికిడి లోపం ఉన్నవారైతే 51 శాతం వైకల్యం కలిగి ఉండాలి. వికలాంగులకు అందించే SADAREM సర్టిఫికెట్ లో 40 శాతం లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు.
- హెచ్.ఐ.వి - ఎయిడ్స్ ఉన్నవారు: యాంటీ రిట్రోవైరల్ థెరపీ చేయించుకుంటున్నవారు అర్హులు. వ్యాధిని నిర్ధారిస్తూ ఏదైనా ఆసుపత్రి యాజమాన్యం వారు అందించిన మెడికల్ సర్టిఫికెట్ నిర్ధారణ సమయంలో అవసరమవుతాయి.