మసాలా క్యాప్సికమ్ కర్రీ
కావలసిన పదార్థాలు:
క్యాప్సికమ్ – రెండు (మీడియం సైజువి)
ధనియాలు – రెండు టీస్పూన్లు
ఎండు కొబ్బరి తురుము – ఒక టేబుల్‌స్పూన్
ఎండుమిర్చి- రెండు
నువ్వులు – ఒక టీస్పూన్
వేరుసెనగలు – పావుకప్పు
జీలకర్ర – అర టీస్పూన్
ఉల్లిపాయ – ఒకటి
అల్లంవెల్లుల్లి పేస్టు – ఒక టీస్పూన్
కారం – అర టీస్పూన్
పసుపు – పావు టీస్పూన్
నూనె – సరిపడా
ఉప్పు – తగినంత.
తయారీ విధానం:
వేరుసెనగలు వేగించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో ధనియాలు, ఎండుకొబ్బరి, నువ్వులు, ఎండుమిర్చి వేగించాలి. చల్లారాక వేరుసెనగలతో పాటు మిక్సీలో వేసి మసాలా సిద్ధం చేసుకోవాలి. అదే పాన్‌లో కొంచెం నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి వేగించాలి. తరువాత క్యాప్సికమ్, తగినంత ఉప్పు వేయాలి. పసుపు, కారం వేసి మరికాసేపు ఉడికించాలి. మిక్సీలో వేసి పట్టుకున్న మసాలా పొడి వేసి కలపాలి. కాసేపయ్యాక కొన్ని నీళ్లు పోసి చిన్న మంటపై ఉడికించాలి. మిశ్రమం చిక్కబడేంత వరకు ఉడికించి దింపాలి. మసాలా క్యాప్సికమ్ చపాతీల్లోకి బాగుంటుంది.
No comments
Post a Comment