సోయా బీన్‌ కర్రీ

 

కావలసినవి
సోయా బీన్‌ – పావుకిలో, ఉల్లిపాయ, టొమాటో – ఒక్కొక్కటి, పచ్చిమిర్చి – మూడు, పసుపు – పావు టేబుల్‌స్పూన్‌, ఉప్పు – తగినంత.
 
తయారీవిధానం
ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. టొమాటో ముక్కలు, పసుపు వేసి మరికాసేపు వేగినివ్వాలి. ఇప్పుడు సోయా బీన్‌, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోయాలి. పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సోయా బీన్‌ కర్రీ తయారవుతుంది. అన్నంలోకి ఈ కూర రుచిగా ఉంటుంది.