మేతీ మటర్ సబ్జీ తయారీ చేయడం తెలుగులో
కావలసినవి
- పచ్చి బఠాణి – పావుకప్పు
- మెంతి ఆకులు -ఒకటిన్నర కప్పు
- ఉల్లిపాయలు – రెండు
- టొమాటో – ఒకటి
- జీలకర్ర – ఒక టీస్పూన్
- అల్లం – చిన్నముక్క
- ఇంగువ – చిటికెడు,
- కారం – ఒకటిన్నర స్పూన్,
- పసుపు – పావు టీస్పూన్,
- ధనియాల పొడి – రెండు టీస్పూన్లు,
- జీలకర్రపొడి – అర టీస్పూన్,
- పెరుగు – రెండు టేబుల్‌స్పూన్లు,
- జీడిపప్పు – ఐదారు పలుకులు,
- గరం మసాలా – ఒక టేబుల్‌స్పూన్,
- ఉప్పు – తగినంత,
- నూనె – సరిపడా,
- క్రీమ్ – గార్నిష్ కోసం.
తయారీవిధానం
మెంతి ఆకులను శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేసి కొద్దిగా ఉప్పు, పంచదార వేసి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పును పాలలో నానబెట్టి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర వేగించాలి. అల్లం, ఇంగువ వేసి మరికాసేపు వేగనివ్వాలి. తరిగిన ఉల్లిపాయలు వేసి గోధుమరంగులోకి మారేంత వరకు వేగించాలి. ఇప్పుడు మెంతి ఆకులు వేసి చిన్నమంటపై మరికాసేపు వేగించాలి. ఇప్పుడు గరంమసాలా పొడి, జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. టొమాటో ముక్కలు, కారం వేసి కాసేపు ఉడికించాలి. తరువాత పచ్చిబఠాణి వేయాలి. ఒక కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. బఠాణీలు ఉడికిన తరువాత పెరుగు వేసి మరికాసేపు ఉడికించాలి. మిశ్రమం చిక్కబడుతున్న సమయంలో జీడిపప్పు పేస్టు వేసి కలియబెట్టాలి. తగినంత ఉప్పు వేయాలి. క్రీమ్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.
No comments
Post a Comment