మలాయ్‌ కోఫ్తా కూర వండటం తెలుగులో

మలాయ్‌ కోఫ్తా

కావలసినవి

బంగాళదుంపలు – నాలుగు, పనీర్‌ – పావుకేజీ, పచ్చిమిర్చి – రెండు, కొత్తిమీర – ఒకకట్ట, ఉప్పు – రెండు టీస్పూన్లు, కోవా – ఒకటిన్నరకప్పు, డ్రై ఫ్రూట్స్‌ – కొన్ని, మైదా – కొద్దిగా, ఉల్లిపాయలు – రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు – ఒకటీస్పూన్‌, కారం – ఒక టీస్పూన్‌, టొమాటో ప్యూరీ – ఒకకప్పు, మెంతి – ఒకకట్ట, జీడిపప్పు పలుకులు – నాలుగు, పాలు – అరకప్పు, క్రీమ్‌ – మూడు టీస్పూన్‌లు.

తయారీవిధానం

బంగాళదుంపలను ఉడికించుకొని, పొట్టు తీసిపెట్టుకోవాలి. అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కప్పు కోవా వేసి కలపాలి. ఈ మిశ్రమంలో డ్రై ఫ్రూట్స్‌ పెట్టుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను మైదా పిండిపై దొర్లించి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉండలను వేసుకుంటూ గోధుమరంగు వచ్చే వరకు వేగించుకుంటూ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్‌లో నూనె వేసి ఉల్లిపాయలు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం వేసి కలపాలి. టొమాటో ప్యూరీ వేసి చిన్న మంటపై వేగించాలి. ఇప్పుడు జీడిపప్పు పేస్టు వేయాలి. మెంతి, మిగిలిన కోవా వేసి కలుపుకోవాలి. చివరగా పాలు, క్రీమ్‌ వేసి మరికాసేపు చిన్న మంటపై ఉడికించాలి.