మీ ఖాతాలో డబ్బులు పొతే వెంటనే సైబర్ సెల్‌కు కాల్ చేయండి
సైబర్ పోలీసులతో ఆన్‌లైన్‌లో సైబర్ క్రైమ్ ఫిర్యాదును ఎలా నమోదు చేయాలి
మీ ఖాతాలో అమౌంట్ పోగానే మీరు ఇలా చేయండి
సైబర్ క్రైమ్ సెల్ కాల్ చేసినచో మీ డబ్బులు మీకు వస్తాయి
ఇంటి వద్ద నుండే ఫిర్యాదు చేయవచ్చు
మీ అకౌంట్లో అమౌంట్ పోగానే 48 గంటలలో 1930 helpline కు కాల్ చేయగలరు . వారు తెలుగులో మాట్లాడుతారు
అయితే మీకు మీ డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి , వీలైనంత తొందరగా కంప్లీట్ చేయడం మంచిది .
లేకపోతే మీ అకౌంట్లో నుంచి అమౌంట్ పోగానే 1930 కి వీలైనంత తొందరగా కాల్ చేసి మీరు కంప్లైంట్ చేయగలరు . helpline పోలీస్ అధికారులు మీ పూర్తి డిటేల్స్ తీసుకొని మీకుమీ అమౌంట్ ఎంత పోయినది తెలుసుకొని మీ సమస్యను వారే కంప్లైంట్ బుక్ చేస్తా,రు అప్పుడు మీకు మీ డబ్బులు రిటన్ వచ్చే అవకాశం ఉంది.1930 కాల్ చేయగనే .........
కాల్ చేసిన వెంటనే మనకు తెలంగాణ అయితే ఒకటో నెంబరు ప్రెస్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ వారు 2 నెంబర్ ప్రెస్ చేయండి అని చెపుతుంది .
అలా ప్రెస్ చేసిన వెంటనే సైబర్ సెల్ వారు మీతో మేము సైబర్ సెల్ వాళ్ళము మీకు ఏవిధమైన సహాయం చేయాలనీ అడుగుతారు .
అప్పుడు మీ డబ్బులు ఎలా పోయాయో చెప్పవలెను ,వారు మీకు ఒక వాట్సాప్ నెంబరు ఇస్తారు, ఆ నెంబర్ కు హాయ్ అని మనము వాట్సాప్ చేయగానే వారు వెంటనే మనకు ఒక అప్లికేషన్ పంపిస్తారు.
అందులో ఇలా వివరాలు ఇవ్వాలి ;-
A.. అందులో మనము మనకు సంబంధించిన అమౌంటు ఎంత అకౌంట్ నుండి అమౌంట్ పోయినది
1 . ఫోన్ పే నుండి అమౌంట్ పోయినదా
2 .క్రెడిట్ కార్డ్ అమౌంట్ పోయినదా
3. డెబిట్ కార్డ్ అమౌంట్ పోయినదా
4 . ఫోన్ హాక్ కావడం అమౌంట్ పోయినదా
5 .నకిలీ కాల్స్ మోసాలు అమౌంట్ పోయినదా
6 . బీమా మోసాలు అమౌంట్ పోయినదా
7 .లాటరీ స్కామ్ అమౌంట్ పోయినదా
8 . బిట్‌కాయిన్ అమౌంట్ పోయినదా
9 .చీటింగ్ స్కామ్‌లు అమౌంట్ పోయినదా
10 .ఆన్‌లైన్ లావాదేవీల అమౌంట్ పోయినదా
11. ఓటిపి చెప్తే అమౌంట్ పోయినదా,
12. సోషల్ మీడియా నేరాలు
13. ఎటిఎమ్ మోసాలు
14. మెయిల్ ద్వారా మోసాలు
15. నెట్ బ్యాంకింగ్
16.మొబైల్ యాప్ సంబంధిత నేరాలు
17. డేటా థెఫ్ట్, రాన్‌సమ్‌వేర్
B. ఫోన్ నెంబర్ ఇవ్వవలెను
C. మన యొక్క ఆధార్ కార్డు
D . మన బ్యాంక్ అకౌంట్
E . మన యొక్క బ్యాంక్ పేరు
F. మనకు పోయిన అమౌంటు సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్
G. జరిగిన ట్రాన్సాక్షన్ యొక్క స్క్రీన్ షాట్
పూర్తి సమాచారాన్ని వారు అందులో అడుగుతారు, మనం మొత్తం సమాచారాన్ని ఇవ్వాలి .
అప్పుడు వారి సమాచారం తీసుకున్న తరువాత వారే పోలీస్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌ని ఉపయోగించి సైబర్ క్రైమ్ లో మన తరుపున వారే కంప్లైంట్ బుక్ చేస్తారు, ఈ కంప్లైంట్ చేసిన వెంటనే నేషనల్ నోడల్ అధికారి కి / సంబంధిత ఏరియా పోలీస్ స్టేషన్ కు / బ్యాంకు బ్రాంచ్ అధికారికి / బాధితునికి ఇన్ఫర్మేషన్ ను అందజేస్తారు.
అప్పుడు వెంటనే వారు ట్రాన్సాక్షన్ నెంబర్ తో మన యొక్క డబ్బులు ఎవరి ఖాతా కు వెళ్ళినవో చూసి వారి ఖాతాను ఫ్రిడ్జ్ / బ్లాక్ చేస్తారు.
అందువలన మన అమౌంట్ రిటర్న్ వచ్చి అవకాశం ఉంటుంది , అమౌంట్ పోయినవారు 48 గంటల్లో మాత్రమే కంప్లైంట్ చేసినచో వారికి అమౌంట్ రిటర్న్ వస్తుంది .k
గమనిక :- ఇలా మీరు సైబర్ క్రైమ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
ఆన్‌లైన్‌లో సైబర్ క్రైమ్ ఫిర్యాదు. సైబర్ క్రైమ్‌ని పోలీసు సైబర్ సెల్‌కు నివేదించండి.
ఆన్‌లైన్‌లో సైబర్ క్రైమ్ ఫిర్యాదు
దశ 1: సైబర్ సెల్ వెబ్‌సైట్ https://cybercrime.gov.in/ ని సందర్శించండి
కింది మెనూ తెరవబడుతుంది
దశ 1: సైబర్ క్రైమ్ లాగిన్ ఎంపికను తెరవండి
కింది మెనూ తెరవబడుతుంది
సైబర్ క్రైమ్ ఫిర్యాదు లాగిన్
దశ 2: అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి
రాష్ట్రం ఎంచుకోండి: జాబితా నుండి మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి
వినియోగదారు పేరు / ఫిర్యాదుదారు పేరు: వినియోగదారు పేరు లేదా ఫిర్యాదుదారు పేరును టైప్ చేయండి
మొబైల్ నంబర్: మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
దశ 3: OTP బటన్‌పై క్లిక్ చేయండి
OTPని నమోదు చేయండి
స్క్రీన్‌పై చూపిన భద్రతా కోడ్‌ను నమోదు చేయండి
దశ 4: లాగిన్ చేయండి
దశ 5: పైన తెలిపిన విధంగా Iలో వివరించిన విధంగా అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి మరియు ఫిర్యాదును నమోదు చేయండి
ఈ విషయాన్ని మిగతా మిత్రులకు కూడా తెలియజేయవలెను దయచేసి లింక్ ను షేర్ చేయగలరు
No comments
Post a Comment