'బి' విటమిన్ వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు

 

'బి' విటమిన్ వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు

 
 
‘విటమిన్ బి’ అనేది కొవ్వుల్లో కరిగిపోయే గుణం కల్గిన ‘8 విటమిన్ల సమూహం.’ శరీరంలోని కణాల జీవక్రియలో ఈ 8 విటమిన్ల సమూహం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి రసాయనికంగా మరియు జీవజాతి పరంగా వైవిధ్యంగా  కూడా ఉంటాయి .  అనేక ఆహార పదార్థాలలో అవన్నీ కలిసే ఉంటాయి. ఈ విటమిన్ల ప్రతి ఒక్క దాని విధులు, ప్రభావాలు మరియు దుష్ప్రభావాలు వేర్వేరుగా ఉంటాయి. అందువలన వాటి మోతాదులు మరియు లోపాలు కూడా మారుతూ ఉంటాయి. ఈ 8 విటమిన్లలో ప్రతిదాని గురించీ పరిశీలీద్దాము.
 
 
  • విటమిన్ బి రకాలు
  • విటమిన్ బి ఆహారవనరులు
  • విటమిన్ బి కాంప్లెక్స్ ప్రయోజనాలు
  • విటమిన్ బి మోతాదు
  • విటమిన్ బి దుష్ప్రభావాలు

 

 

విటమిన్ బి రకాలు

విటమిన్ బి యొక్క ప్రతి భాగం యొక్క విధులను, మరియు అది శరీరంలో లోపిస్తే కానవచ్చే రోగ లక్షణాలను పరిశీలిద్దాం
 
విటమిన్ బి  యొక్క రకం      విధులు (Functions)       లోపం (Deficiency)
 
బి 1         థియామిన్
 
నరాలు విధులను సరిగా నిర్వహించడంలో
 
మరియు DNA మరియు RNA యొక్క
 
సంశ్లేషణలోనూ విటమిన్ B  బాగా సహాయపడుతుంది.
 
 బెరి బెరి (ఉబ్బు రోగం, బరువు కోల్పోవడం, కాళ్ళు, చేతుల నొప్పి, భావోద్వేగ
 
ఆటంకాలు, క్రమం లేని హృదయ స్పందన)
 
బి 2 రిబోఫ్లావిన్    శరీరం లో శక్తి విడుదల
 
అరిబోఫ్లివినసిస్ (పగిలిన పెదవులు, నాలుకలో వాపు, గొంతు నొప్పి, నోటిలో వాపు)
 
బి 3 నియాసిన్    శరీరంలో శక్తి బదిలీలో కూడా పాల్గొంటుంది.
 
పెల్లాగ్రా (చర్మపు వాపు, నిద్ర రాక అవస్థ పడడం, బలహీనత, మానసిక గందరగోళం)
 
బి 5 పంటోథెనిక్ యాసిడ్  అమినో ఆమ్లాల సంశ్లేషణ (ప్రోటీన్లు), కొలెస్ట్రాల్/కొవ్వు మరియు హార్మోన్లు
 
మొటిమలు మరియు జలదరింపులున్న భావన, చర్మం తిమ్మిరి పట్టినట్లుండే భావన
 
బి 6 పైరిడాక్సిన్ (Pyridoxine)  న్యూరోట్రాన్స్మిటర్ల సంశ్లేషణ
 
చర్మం మంట, అంటువ్యాధి అయిన కండ్లకలక  (pink eye), మూర్ఛ వచ్చే ప్రమాదం, మరియు ఇతర నాడీ సంబంధిత రుగ్మతలు
 
బి 7 బయోటిన్ (Biotin)  నాడీ వ్యవస్థ యొక్క ఆరోగ్యకరమైన పనితీరుకు ఇది చాలా ముఖ్యం మరియు శక్తి యొక్క ఉత్పత్తి కోసం
 
కుంటుపడిన పెరుగుదల మరియు పిల్లల్లో నరాలకు సంబంధించిన రుగ్మతలు/సమస్యలు
 
బి 8 ఇనోసైటోల్ (కొన్ని మొక్కల్లో మరియు  కొన్ని జంతువుల కణాల్లో లభించే ఓ కార్బోహైడ్రేట్)
 
గర్భందాల్చిన సమయంలో మరియు శిశువు పెరుగుదల కాలంలో వేగవంతమైన విభజన మరియు పెరుగుదలలకు చాలా ముఖ్యమైనది,
 
రక్తహీనత; గర్భధారణ సమయంలో రక్తహీనతా లోపం వలన పుట్టే శిశువులకు పలు లోపాలు కూడా ఏర్పడతాయి
 
బి 12 Cobalamin
 
ఎర్ర రక్త కణాల (RBCs) ఉత్పత్తికి ముఖ్యమైనది, DNA సంశ్లేషణ మరియు నరాల కణాలు మరియు రక్త కణాల్ని నిర్వహించడం కోసం ముఖ్యమైనది.
 
రక్తహీనత; తగ్గిన శోషణ (absorption) కారణంగా వృద్ధులలో జ్ఞాపకశక్తి నశించడం మరియు అభిజ్ఞాన (తెలివి) లోపాలు కూడా ఏర్పడవచ్చు
 
 
 
 

విటమిన్ బి ఆహారవనరులు 

విటమిన్ ‘బి’ యొక్క అన్ని రకాల ఆహార వనరులను ఈ కింద విధంగా ఉన్నాయి.
 
విటమిన్ బి  యొక్క రకం
 
విటమిన్ బి  యొక్క ఆహార వనరులు
 
బి 1 థియామిన్
 
ఈస్ట్ (మధుశిలీంధ్రము), కాలేయం, చేపలు, బీన్స్, సోయాబీన్, బఠానీలు, ఉప్పుచేపలు, బంగాళదుంపలు, పుట్టగొడుగులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, టొమాటోలు, వంకాయలు
 
బి 2 రిబోఫ్లావిన్
 
గొర్రె-పొట్టేలు, గొర్రెపిల్ల మాంసం, పాలు, పాల ఉత్పత్తులు, పెరుగు, బాదం, ఆకుకూరలు, గుడ్లు, కాయలు, బియ్యం, తృణధాన్యాలు
 
బి 3 నియాసిన
 
మాంసం, కోడి మాంసం, పౌల్ట్రీ ఆహారపదార్థాలు, ‘సాల్మాన్’ రకం చేపలు మరియు ఉప్పుచేపలు  (fishes like salmon and tuna), తృణధాన్యాలు, చిక్కుళ్ళు-పప్పుధాన్యాలు, విత్తనాలు, వేరుశెనగల
 
బి 5 పాంతోతేనిక్ యాసిడ
 
గుడ్లు, చికెన్, మాంసం, టర్కీ కోడి లేక సీమ కోడి, తాజా పళ్ళు మరియు కూరగాయలు, ముఖ్యంగా పుట్టగొడుగులు, తృణధాన్యాలు, తేన
 
బి 6 పిరిడాక్సిన్ (Pyridoxine)
 
తృణధాన్యాలు, బీన్స్, కోడిమాంసం, తదితర పౌల్ట్రీ ఉత్పత్తులు, చేపలు, పండ్లు మరియు కూరగాయలు, ఆకుకూరల
 
బి 7 బయోటిన్ (Biotin)
 
గుడ్డులోని పచ్చసొన, పాలు, బ్రోకలీ, అరటిపండ్లు, బంగాళదుంపలు, అవోకాడో పండ్లు, గింజలు, సోయా, జున్ను, చిక్కుళ్ళు, కాయలు (లేక కాయగింజలు) , పంది మాంసం, ఆకుకూరలు
 
బి 8 ఇనోసిటోల్
 
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్
 
బి 12 కోబాలమిన్
 
గొడ్డు మాంసం, పంది మాంసం, పంది మాంసం, కోడిమాంసం-పౌల్ట్రీ ఉత్పత్తులు, గొర్రె మాంసం, చేపలు, పాడి ఉత్పత్తులు, గుడ్ల
 
 

విటమిన్ బి కాంప్లెక్స్ ప్రయోజనాలు 

 విటమిన్ బి కాంప్లెక్స్ యొక్క ప్రతి భాగంలోని ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలను చర్చిద్దాం.
 
 
  • థియామిన్ అనేది  బి కాంప్లెక్స్ విటమిన్లలో ఓ ముఖ్యమైన విటమిన్.  ఇది శరీరంలో వివిధ విధుల్ని నిర్వహిస్తుంది మరియు దీనివల్ల శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మైలిన్ కోశం (myelin sheath) ఏర్పడటానికి విటమిన్ బి 1 లేదా థియామిన్ బాగా సహాయం చేస్తుంది. బయటి నుండి కలిగే హాని నుండి నరాలను కూడా రక్షిస్తుంది. విటమిన్ ‘బి’ మెదడుపై రక్షణ చర్యలను కలిగివుందని వివిధ పరిశోధకుల అభిప్రాయం.
  • విటమిన్ బి2 శరీరంలో శక్తి స్థాయిల్ని నిర్వహించడంలో  సహాయపడుతుంది.పార్శ్వపు తలనొప్పిని (migrane pain) కూడా తగ్గిస్తుంది. ఈ విటమిన్ లోపం రక్తహీనతను కూడా కలిగించవచ్చు.
  •  విటమిన్ బి3 లేదా నియాసిన్ ముఖ్యంగా గుండె సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది . అలాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను  కూడా పెంచుతుంది.
  • విటమిన్ బి5 ఇది శరీరంలో సాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు నిర్వహించడంలో సహాయం చేస్తుంది అలాగే ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని నిర్వహించి తద్వారా రక్తహీనను బాగా మెరుగుపరుస్తుంది.
  • విటమిన్ బి6 ,బి కాంప్లెక్స్ విటమిన్లలో ముఖ్యమైనది, ఇది శరీరంలో ఎనర్జీ స్థాయిలను పెంచుతుంది, అలసటను తగ్గిస్తుంది, వివిధ రకాలైన  నెప్పులను తగ్గించి సహజ నొప్పి నివారిణిగా కూడా పనిచేస్తుంది.
  • విటమిన్ బి7 లేదా బయోటిన్ జుట్టు సమస్యలను అలాగే చర్మ సమస్యలను తగ్గించి వాటికీ పోషణని సమకూరుస్తుంది. బయోటిన్  జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.
  • విటమిన్ బి8 ఇది ముఖ్యంగా మహిళలకు చాలా ఉపయోగకరమైనది పిసిఓయస్ (PCOS) వంటి సమస్యలలో దీనిని ముందుగా ఇస్తారు. ఇది మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అలాగే శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా  తగ్గిస్తుంది.
  • విటమిన్ బి12 లేదా కొబాలమిన్ ముఖ్యంగా రక్తహీనత చికిత్సలో ఉపయోగిస్తారు. అంతేకాక మంచి ఆరోగ్యానికి, చర్మానికి మరియు జుట్టుకి ఈ విటమిన్ ఎంతో అవసరం. అలాగే కుంగుబాటు, ఆందోళన వంటి మానసిక రుగ్మతలను కూడా నియంత్రిస్తుంది.
  • విటమిన్ బి 1 ప్రయోజనాలు
  • విటమిన్ బి 2 ప్రయోజనాలు
  • విటమిన్ బి3 నియాసిన్ ఉపయోగాలు
  • విటమిన్ బి5 ప్రయోజనాలు
  • విటమిన్ బి6 ఉపయోగాలు
  • బయోటిన్ యొక్క ప్రయోజనాలు (విటమిన్ బి7)
  • విటమిన్ బి8 ప్రయోజనాలు
  • విటమిన్ బి12 కర్తవ్యం

 

 

విటమిన్ బి 1 ప్రయోజనాలు

విటమిన్ బి 1 లేదా థియామిన్ అనేది విటమిన్ బి  కాంప్లెక్స్ లో ఓ ముఖ్యమైన భాగం.  ఇది శరీరంలో వివిధ విధుల్ని నిర్వహిస్తుంది మరియు దీనివల్ల శరీరానికి పలు రకాల  ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నరాల చుట్టూ కప్పులు (మైలిన్ కోశం) ఏర్పడటానికి విటమిన్ బి 1 లేదా థియామిన్ కారణమవుతుంది. బయటి నుండి కలిగే హాని నుండి నరాలు తదితరాల్ని రక్షించడంలో ఇది సహాయపడుతుంది. వివిధ పరిశోధకులచే వివరించిన విధంగా విటమిన్ ‘బి’ మెదడు కు రక్షణ చర్యలను కూడా  కల్పిస్తుంది.
 
ఎన్సెఫలోపతి (మెదడుకు నష్టం కలిగించే మెదడు వ్యాధి) తో బాధపడుతున్న రోగులపై నిర్వహించిన ఒక అధ్యయనంలో, ఈ రోగులకు థయామిన్ క్రమం తప్పకుండా సూచించబడిందని మరియు రోగుల్లో విటమిన్ ‘బి1’ లోపం వ్యాధి యొక్క తీవ్రతను పెంచుతుందని పరిశోధకులు కూడా కనుగొన్నారు. అదురువాయువు (పార్కిన్సన్స్ వ్యాధి)తో బాధపడుతున్న రోగులలో మెదడు పనితీరుపై ఈ విటమిన్ యొక్క రక్షణ చర్యలు గురించిన అధ్యయనంలో కూడా ఇలాంటి విషయాన్నే పరిశోధకులు కూడా   గమనించారు.
 
అదనంగా, థయామిన్ లేదా విటమిన్ బి 1 నొప్పి జీవక్రియను ప్రభావితం చేస్తుందని కూడా తెలిసింది.  నొప్పిని తగ్గించడంలో ఇది అనుకూల ప్రభావాలను కలిగి ఉంటుంది. ఫైబ్రోమైయాల్జియా అనబడే వ్యాధి కారణంగా కండరాల నొప్పితో బాధపడుతున్న రోగులకు ఉపశమనం పొందడానికి థయామిన్ ను అధిక మోతాదుల్లో సేవింపజేయడం జరిగింది. ఫైబ్రోమైయాల్జియాతో బాధపడుతున్న ఆ రోగులకు సూచించిన మోతాదులో థయామిన్ సేవనంతో లబ్ది పొందారని పరిశోధనలో గమనించబడింది. థియామిన్ యొక్క నొప్పి తగ్గించే (అనల్జీసియా) ప్రభావాల కారణంగా, దీన్ని (థియామిన్ ను) డిస్మెనోరియా (బాధాకరమైన రుతు చక్రాలు) తో బాధపడుతున్న మహిళలకు కూడా సిఫార్సు చేయబడింది. చక్కెరవ్యాధి (డయాబెటీస్) మెల్లిటస్ 2 వ రకం వ్యాధి చికిత్సకు అనుపాన చికిత్సగా అనేకమంది పరిశోధకులు థయామిన్ ను  కూడా  ఉపయోగించారు.
 
 

విటమిన్ బి 2 ప్రయోజనాలు

ఈ విటమిన్ (విటమిన్ బి 2) యొక్క విధుల్లో చర్చించినట్లుగా, విటమిన్ బి2 శరీరంలో శక్తి స్థాయిల్ని తగినంతగా నిర్వహించడానికి బాగా సహాయపడుతుంది. విటమిన్ బి2 శరీరం యొక్క సాధారణ పనితీరులో మరియు శరీర కార్యకలాపాలకు సహాయపడుతుంది. విటమిన్ బి  యొక్క ఇతర భాగాలైన విటమిన్ బి6 మరియు విటమిన్ బి9 లను శరీరంలో నిర్వహించడంలో కూడా విటమిన్ బి2 సహాయపడుతుంది. ఇదెలా సాధ్యపడుతుందంటే వాటిని (విటమిన్ బి 6, విటమిన్ బి 9) వాటి క్రియాశీల రూపాల్లోకి మార్చడం జరుగుతుంది, అపుడే శరీరం వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది.
 
'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్' లో ప్రచురించిన ఒక అధ్యయనం రుజుపర్చిందేమంటే  రక్తంలో తగినంత ఇనుము స్థాయిల్ని కల్గి ఉండడానికి రిబోఫ్లావిన్ చాలా అవసరం అని. ఎందుకంటే ఇది శరీరంలో ఇనుము వినియోగం యొక్క ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. ఈ విటమిన్ యొక్క లోపం తరచుగా రక్తహీనత ప్రమాదానికి కారణమవుతుంది. దీనికే కాకుండా ఈ విటమిన్ బి2 విటమిన్ యొక్క ప్రత్యేక పాత్రను మైగ్రేన్ల (పార్శ్వపు తలనొప్పులు) నివారణ, నిర్వహణలో కూడా సూచించబడింది. మైగ్రైన్ తలనొప్పుల నివారణా చికిత్సలో ఇతర మందులతో బాటు విటమిన్ బి2 ని కూడా ఉపయోగించడం జరుగుతోంది. ఈ పార్శ్వపు తలనొప్పి దాడుల తరచుదనాన్ని (freequency) మరియు ఆ తలనొప్పిని నివారించడంలో విటమిన్ బి2  విజయవంతమైంది. దాని విజయం కారణంగా, రిబోఫ్లావిన్ ను చిన్నారి (పిల్లల) రోగులలో వచ్చే పార్శ్వపు తలనొప్పుల (మైగ్రేన్లు) నివారణకు వాడడంలో ప్రయత్నాలు కూడా  జరుగుతున్నాయి.
 
 

విటమిన్ బి3 నియాసిన్ ఉపయోగాలు

చర్మం మీద వచ్చే మచ్చల (పెల్లాగ్రా) చికిత్సకు విటమిన్ బి 3 లేదా నియాసిన్ ను వాడతారు. ఇదొక్కటే కాక విటమిన్ బి 3 (లేదా నియాసిన్) ఇంకా వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది హృదయనాళ వ్యవస్థ (గుండె మరియు దాని నాళాలు) యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది .  ఇది గుండె వ్యాధుల నివారణకు బాగా సహాయపడుతుంది. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL)లు  మరియు ట్రైగ్లిజెరైడ్స్ స్థాయిల్ని తగ్గించడం మరియు అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) స్థాయిలను పెంచడం ద్వారా ఇది జరుగుతుంది.
 
ఆక్సీకరణ ఒత్తిడి మరియు వాపు కారణంగానే గుండె సంబంధ వ్యాధులు వస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి మరియు వాపును తగ్గించడం ద్వారా  విటమిన్ బి3 గుండె ఆరోగ్యాన్నిబాగా  మెరుగుపరచడం జరుగుతుంది.విటమిన్ బి 3 వల్ల కలిగే ఈ ప్రయోజనాల కారణంగానే గత  40 సంవత్సరాలుగా గుండె సంబంధమైన వ్యాధులను నివారించడానికి దీన్ని (విటమిన్ బి 3 లేదా నియాసిన్)  వాడుతున్నారు మరియు ఇటీవలనే ఇది ఆయా చికిత్సల్లో కూడా ఉపయోగించబడింది.
 
 

విటమిన్ బి5 ప్రయోజనాలు

ప్రోటీన్లు మరియు కొలెస్ట్రాల్ సంశ్లేషణ (మిశ్రణ) లో విటమిన్ బి5 పాల్గొంటుంది . ఇది సాధారణ స్థాయిలో రక్తంలోని కొలెస్ట్రాల్ (కొవ్వు) ను నిర్వహించడానికి బాగా సహాయపడుతుంది .  తన చర్యలతో గుండెను సంరక్షిస్తూ (కార్డియోప్రొటెక్టివ్) ఉంటుంది. ఎర్ర రక్త కణాలు (RBCs) రక్తాన్ని ఏర్పరుస్తాయి. విటమిన్ బి5 ఎర్ర రక్త కణాల ఉత్పత్తి మరియు నియంత్రణలో పాల్గొంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయికే. అందువలన రక్తహీనత చికిత్సలో కూడా విటమిన్ బి5 ని కూడా ఉపయోగిస్తారు.
 
 
ఇంతే కాకుండా, విటమిన్ బి5 లేదా ప్యాంతోతేనిక్ ఆమ్లం కార్టిసాల్ వంటి కొన్ని హార్మోన్ల ఉత్పత్తి మరియు విడుదలపై ప్రభావాన్ని కలిగి ఉంటుంది. విటమిన్ బి5 శరీరంలో కార్టిసాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. కార్టిసాల్ హార్మోన్ అలసట, కండరాల నొప్పి మరియు కీళ్ళ నొప్పికి, ఇంకా బరువు తగ్గడానికి కూడా కారణమవుతుంది. ఈ విటమిన్ బి5 లోపించడానికి, ఆర్థిరిక్ నొప్పి పెరుగుదల లేదా అధిక రక్తపోటు ప్రమాదం, స్ట్రోక్ మరియు గుండె వ్యాధులకు పరస్పర సంబంధం కలిగి ఉంటుంది.
 
 

విటమిన్ బి6 ఉపయోగాలు

విటమిన్ బి కాంప్లెక్స్ కుటుంబంలో ‘విటమిన్ బి6’ లేదా ‘పిరైడొక్సిన్’ ఓ ముఖ్యమైన భాగంగా ఉంది. శరీర సాధారణ జీవక్రియను నిర్వహించడంతో బాటు నరాల పనితీరును మరియు ఇతర అవయవాల యొక్క పనితీరును సక్రమంగా నిర్వహించడంలో విటమిన్ బి6 ప్రభావశాలి. విటమిన్ బి6 ని వ్యక్తిగత శక్తి స్థాయిలను పెంచడానికి  బాగా ఉపయోగించబడుతోంది.  కనుకనే దీన్ని దీర్ఘకాలిక అలసటకు చేసే చికిత్సలోనూ  కూడా ఉపయోగిస్తారు. అనేక రకాల నొప్పులకు చేసే చికిత్సల్లో విటమిన్ బి6 ని సహజ నొప్పి నివారిణిగా  కూడా ఉపయోగించబడుతోంది.
 
ఈ విటమిన్ యొక్క నొప్పి-తగ్గించే ప్రభావాలను అంచనా వేసేందుకు ఇటీవల ఓ అధ్యయనం నిర్వహించబడింది. ఈ అధ్యయణంలో, తీవ్రమైన దిగువ వెన్ను నొప్పితో బాధపడుతున్న రోగులకు ఇతర విటమిన్లు మరియు బాధనాశక ఔషధాలతో (అనాల్జెసిక్లతో) పాటు, పిరిడోక్సిన్ ను కూడా సేవింపజేశారు. నొప్పి తీవ్రత తగ్గి రోగులలో ముందున్న చైతన్యం పునరుద్ధరింపబడిందని ఈ అధ్యయనం యొక్క ఫలితాల్లో వెల్లడయింది. దీన్ని బట్టి, ఈ విటమిన్ ను నొప్పి తగ్గించేందుకు సాధ్యమైనంతగా ఉపయోగించవచ్చని ఈ అధ్యయనం సిఫారసు చేస్తోంది.
 

బయోటిన్ యొక్క ప్రయోజనాలు (విటమిన్ బి7)

ఆశించిన ఆరోగ్య ప్రయోజనాల్ని సాధించుకునేందుకు బయోటిన్ విస్తృతంగా ఉపయోగించబడుతున్నందున జుట్టు మరియు చర్మంపై బోయోటిన్ ప్రయోజనాలు బాగా ప్రసిద్ధి చెందాయి. ఇది చర్మం మరియు జుట్టు నిర్మాణాన్ని బాగా మెరుగుపరుస్తుంది మరియు జుట్టు ఊడడాన్ని నివారించడంలో మరియు తత్సంబంధ చికిత్సలో ఒక ప్రత్యేక పాత్రను కలిగి ఉంది. సాధారణంగా బయోటిన్ ను పెళుసుగా లేదా చిట్లిపోయిన (అనారోగ్యకరమైన) గోర్ల చికిత్సకు అనుబంధ ఆహారంగా (suppliment food)  కూడా ఉపయోగిస్తారు.
 
ఇటీవల ఓ అధ్యయనం జుట్టుకు సంబంధించిన రుగ్మతపై బయోటిన్ యొక్క ప్రభావాల్ని పరీక్షించింది. అతి నెమ్మది పెరుగుదల కల్గిన ఆ రోగి జుట్టు దువ్వడానికి వీల్లేకుండా గడ్డి పీచులా రేగిపోయి చాలా అసౌకర్యంగా తయారైంది. ఇలాంటి లక్షణాలు గల జుట్టు రుగ్మతపై బయోటిన్ యొక్క ప్రభావాలను ఈ అధ్యయనం పరీక్షించింది. ఈ రకం జుట్టు రుగ్మత కల్గిన రోగులచేత బయోటిన్ ను సేవింపజేయగా వారి జుట్టు రుగ్మత పరిస్థితిలో సానుకూల స్పందన వెల్లడైంది. రోజుకు మూడు సార్ల చొప్పున 0.3 mg బయోటిన్ మోతాదును 4 నెలల పాటు సేవింపజేయగా ఈ రోగులలో గణనీయమైన మెరుగుదల కానవచ్చింది. ఈ మందుసేవనం వల్ల జుట్టు పెరుగుదల రేటు కూడా వారిలో మెరుగుపడింది. ఇంకా, వారి జుట్టు బలాన్ని పుంజుకుంది మరియు జుట్టు దువ్వకం చాలా మెరుగుపడాటాన్ని గమనించడం జరిగింది. ఒకప్పుడు దువ్వేటందుకు వీల్లేని స్థితిలో ఉండే జుట్టును సాఫీగా దువ్వగలిగే స్థాయిని చేరుకునేందుకు ఈ బయోటిన్ సేవనం సహాయపడింది.
 
అదేవిధంగా, గోర్ల ఆరోగ్యాన్ని బాగు చేయడంలో బయోటిన్ యొక్క ప్రభావాల్ని గమనించేందుకు చేపట్టిన వివిధ అధ్యయనాలు బయోటిన్ పనితనాన్ని నిరూపించాయి.  అలాంటి ఒక అధ్యయనంలో బయోటిన్ ను రోగికి కడుపుకు ఔషధంగా (అంటే oral medicine గా) ఇవ్వడం జరగ్గా పెళుసుగా ఉండే ఆ రోగి గోళ్ళ పరిస్థితిలో 25% గుణం గోచరించింది. ఈ అధ్యయనాలు బయోటిన్ (biotin) సేవనం జుట్టు, గోర్లు మరియు చర్మం జబ్బులకు ఒక అద్భుతమైన సప్లిమెంట్ అని రుజువు చేశాయి. కాబట్టి ఈ ‘బి’ విటమిన్ ని సమృద్ధిగా కల్గిన ఆహారాల్ని మీరు దిననిత్య ఆహారంతో బాటు తీసుకోవాల్సిందిగా మీకు మేము సిఫార్సు చేస్తున్నాము. అయితే వైద్యుడి సూచన లేకుండా ఈ విటమిన్ సప్లిమెంట్లను ఉపయోగించకూడదని మీకు సూచించడమైంది.
 
 

విటమిన్ బి8 ప్రయోజనాలు

విటమిన్ బి8 లేదా ఇనోసిటోల్ కు ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.  మరీ ముఖ్యంగా పునరుత్పత్తి వయసులో ఉన్న మహిళలకు ఇది ప్రయోజనకారి.  పోలిసిస్టిక్ ఒవేరియన్ వ్యాధి లేదా PCOs (అంటే అండాశయ గడ్డల వ్యాధి) చికిత్స మరియు నిర్వహణలో ఇది విస్తృతంగా ఉపయోగించబడుతోంది. మరియు ఈ రోగులలో బరువు కోల్పోవడానికి విటమిన్ బి8 సహాయపడుతుంది. ఈ రోగుల్లో ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి చక్కెరవ్యాధి (మధుమేహం) ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది మరియు ఇతర వ్యాధి లక్షణాలను నివారించడంలో కూడా సహాయపడుతుంది.
 
అండాశయ తిత్తుల వ్యాధితో వ్యథ చెందే మహిళలపై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, రోగికి ఇనోసిటాల్ ను సేవింపజేయటం ద్వారా స్త్రీ మాతృజీవకణాల పరిమాణాన్ని పెంచడం ద్వారా వంధ్యత్వాన్ని తగ్గించే అవకాశం ఉందని వెల్లడయ్యింది. ఇనోసిటాల్ అనుబంధసేవనం అండ సంయోగస్థానమండలి నాళికా వ్యవస్థ (ప్లాసిటల్ వాస్కులారైజేషన్ను) మెరుగుదలకు తోడ్పడిందని, తద్వారా పిండానికి రక్త ప్రవాహాన్ని బాగా మెరుగుపరుస్తుందని నిరూపించబడింది. ఈ అండాశయ గడ్డల సమస్య గల్గిన మహిళలకు చేపట్టిన పునరుత్పత్తి సహాయక పద్ధతుల ఫలితాలను మెరుగుపరచడంలో వారిచేత ఇనోసిటాల్ (suppliment) సేవనం కూడా  సహాయపడుతుంది.
 
గర్భాశయ మధుమేహ ప్రమాదం (గర్భధారణ సమయంలో డయాబెటిక్ స్థితి) ఈ అండాశయ గడ్డల వ్యాధి (PCOS)కి గురైన మహిళల్లో ఎక్కువగా ఉందని గుర్తించబడింది. ఈ వ్యాధికల్గిన మహిళలు గర్భవతులైనపుడు వారిలో చక్కెరవ్యాధిని (మధుమేహం) నివారించడానికి చేసే చికిత్సలో ఇనోసిటోల్తో కూడా  చికిత్స చేయడం జరుగుతుంది. కేవలం మహిళలకు మాత్రమే లాభదాయకం కాకుండా, జీవక్రియ రుగ్మతలు కలిగిన వ్యక్తులలో రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను విటమిన్ బి8 బాగా తగ్గిస్తుంది.
 
ట్రైగ్లిజరైడ్స్ మరియు తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ల మొత్తం స్థాయిలు ఇనోసిటోల్ సేవనం కారణంగా తగ్గాయని అధ్యయనాలు వెల్లడించాయి. లిపోప్రొటీన్లు రక్తపోటుతో సంబంధం కలిగి ఉంటాయి. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ పెరుగుదల చాలా  సురక్షితమే.
 
 

విటమిన్ బి12 కర్తవ్యం

విటమిన్ బి 12 లేదా కోబలామిన్  అనేది విటమిన్ బి కాంప్లెక్స్ కు చెందిన అత్యంత సుపరిచితమైన విటమిన్. విటమిన్ బి 12 వల్ల లెక్కలేనన్ని ఉపయోగాలున్నాయి. రక్తహీనత నివారణా చికిత్సలో దీని పాత్ర చాలా స్పష్టంగా గోచరిస్తుంది. విటమిన్ బి12 లోపానికి, హానికారక రక్తహీనత మరింత విపరీతమవటానికి చాలా దగ్గర సంబంధం  ఉంటుంది. ఎందుకంటే ఎర్రరక్త కణాలు (RBCs) ఏర్పడటానికి ఈ విటమిన్ బి 12 చాలా అవసరం. చర్మం, గోర్లు మరియు జుట్టు యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ బాగా నిర్వహించడానికి కూడా విటమిన్ బి12 కారణమవుతుంది.
 
విటమిన్ బి 12 యొక్క లోపం ముఖం, చర్మం మీద అధిక నల్ల మచ్చలేర్పడడానికి (హైపర్పిగ్మెంటేషన్), జుట్టు మరియు గోర్ల ఆకృతిలో వచ్చే మార్పులకు, నాలుక వాపుకు లేదా నోటిభాగాల్లో వాపుకు సంబంధం కలిగి ఉంటుంది. దుఃఖం (కుంగుబాటు), మరియు ఆందోళన స్థాయిల్ని తగ్గించడానికి కూడా విటమిన్ బి 12 బాగా పని చేస్తుందని ప్రసిద్ధి. ఇంకా, చిత్తవైకల్యం (డిమెన్షియా) నివారణకు కూడా ఈ విటమిన్ ఉపయోగపడుతుంది. ఇది మెదడు యొక్క అభిజ్ఞా క్షీణత రేటును  తగ్గిస్తుందని ప్రతీతి గనుక దీని (విటమిన్ బి 12) ద్వారా మెదడు అభిజ్ఞా బలహీనత మెరుగవుతుంది.
 
 
 

విటమిన్ బి మోతాదు 

విటమిన్ బి యొక్క దిననిత్య మోతాదు క్రింద ఇవ్వబడింది. అయితే, సూచించిన ఈ విలువలు ఉజ్జాయింపువి మాత్రమేనని మీరు తప్పకుండా గ్రహించాలి. విటమిన్ బి యొక్క వాస్తవ మోతాదు మీ వయస్సు, లింగం, మరియు ఇతర శారీరక లక్షణాలపై ఆధారపడి ఉంటుందని మీరు గమనించాలి. ఈ విటమిన్ కు సంబంధించిన ఏ బాహ్య మందులనైనా సేవించేందుకు ముందు మీరు మీ వైద్యుడ్ని సంప్రదించమని మీకు  సిఫార్సు చేయడమైంది. విటమిన్ బి ని దాని సహజరూపంలో గాని లేదా ఆహార రూపాల్లో గాని సేవించేటపుడు మీరు (RDA-recommended daily allowance)-రోజువారీ మోతాదు విలువలను మించకూడదని మిమ్మల్ని కోరుతున్నాము.
 
విటమిన్ బి రకం                             RDA మగ     RDA ఆడ
 
B1 థియామిన్/B1Thiamine                     1.2 mg       1.1 mg
 
B2 రిబోఫ్లావిన్/B2 Riboflavin                  1.3 mg        1.1 mg
 
B3 నియాసిన్/B3 Niacin                        16 mg        14 mg
 
B5 పాంటోథెనిక్ ఆమ్లం/B5 Pantothenic Acid      5 mg          5 mg
 
B6 పిరిడాక్సిన్/B6 Pyridoxine                1.3 mg        1.3 mg
 
B7 బయోటిన్/B7 Biotin                    30 mg      30 mg
 
B8 ఐనోసిటాల్/ B8 Inositol             400 mg   400 mg
 
B12 కొబలమిన్/ B12 Cobalamin     2.4 mg    2.4 mg
 
 
 

విటమిన్ బి దుష్ప్రభావాలు  

విటమిన్ బి నీటిలో కరుగుతుంది కాబట్టి, దీన్ని ఆహారంగా తీసుకున్నా లేదా బి కాంప్లెక్స్ తో సప్లిమెంట్ గా సేవించినా దుష్ప్రభావాలు ఏర్పడడానికి చాలా తక్కువ ఆష్కారముంది.  అయినప్పటికీ, సిఫార్సు చేసిన రోజువారీ మోతాదు కంటే ఎక్కువగా ఏ విటమిన్ ను అయినా లేదా విటమిన్ అంశాలను అయినా సేవిస్తే కొంత హానిని కలిగిస్తుంది.
 
 
  • విటమిన్ బి1 ని లేదా థియామిన్కు సేవించాక శరీరం వేగవంతంగా విసర్జిస్తుంది కాబట్టి దీని వలన ఎటువంటి దుష్ప్రభావాలు లేవు. అరుదుగా, ఇది చర్మం పై మంటకు లేదా అలెర్జీ వంటి ప్రతిచర్యలకు  కూడా కారణమవుతుంది.
  • విటమిన్ బి3 లేదా నియాసిన్ లను అధిక మోతాదులో సేవిస్తే వాంతులు, చర్మం వేడెక్కడం (చర్మపు వెచ్చదనం, చర్మం  ఎర్రబడడం) లేక రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలకు దారితీయవచ్చు. నియాసిన్ ను చాలా అధిక మోతాదుల్లో సేవిస్తే దాని వలన నియాసిన్ విషపూరితం అవుతుంది, ఇది హెపాటిక్ (కాలేయం) వైఫల్యం లేదా వివిధ అవయవాల స్తంభన కల్గి ప్రాణాపాయ స్థితికి దారి తీస్తుంది, అంటే ఇది ప్రాణాంతకమవుతుంది. అందువలన విటమిన్ బి3 ని  వైద్యుడి పర్యవేక్షణ లేకుండా సేవించకూడదు.
  • విటమిన్ బి5 యొక్క అధిక మోతాదులు జీర్ణనాళం (gastrointestinal tract-GIT) తో కూడిన జీర్ణ సమస్యలు వంటి అవాంతరాలు కలిగే అవకాశం ఉంది.
  • విటమిన్ బి6 యొక్క అధిక మోతాదుసేవనం కారణంగా చర్మం పైన,  కళ్ళులో లేదా శ్వాసనాళం పర్యంతం మంట కలగవచ్చు. విటమిన్ బి8 కూడా మంటను కలిగించగలదు.
  • విటమిన్ బి12 ని దాని సింథటిక్ రూపంలో సేవించినపుడు అతిసారాలు (డయేరియా), కండరాల నొప్పి లేదా కండరాల తిమ్మిరి, అలసట, తలనొప్పి లేదా మైకము వంటి అనేక దుష్ప్రభావాలకు కారణమవుతుంది. గురక, దురద, మ్రింగడంలో కష్టం, వేగవంతమైన హృదయ స్పందన లేదా చర్మంపై దద్దుర్లు (రాషెస్)వంటి మరింత తీవ్రతరమైన దుష్ప్రభావాలు (ప్రతిచర్యలు) విటమిన్ బి12 ని సూదిమందు రూపంలో తీసుకుంటే కూడా సంభవిస్తాయి.
Previous Post Next Post

نموذج الاتصال