అష్టదిక్పాలకులు వారి యొక్క సతీమణులు
అష్ట అంటే ఎనిమిది. మనకి ఉన్న ఎనిమిది దిక్కులు అంటే తూర్పు, పడమర మరియు ఉత్తరం దక్షిణం. తూర్పు-ఉత్తరంల కలిసే మూల ఉండే దిక్కు ఈశాన్యం మరియు తూర్పు-దక్షిణం కలిసే మూల ఉండేది ఆగ్నేయం. పడమర-దక్షిణం కలిసే మూల ఉండే దాన్ని నైరుతి మరియు పడమర-ఉత్తరం కలిసే మూల ఉండే దిక్కు పేరు వాయువ్యం అని అంటారు.
దిక్కులకు అధిపతలు వారి సతీమణులు
తూర్పుకి అధిపతి:ఇంద్రుడు –శచీదేవి,
పడమరకి అధిపతి:వరుణుడు —కాళికాదేవి,
ఉత్తరానికి అధిపతి:కుబేరుడు——చిత్రరేఖాదేవి,
దక్షిణానికి అధిపతి:యముడు——శ్యామలాదేవి,
ఈశాన్యానికి అధిపతి:ఈశ్వాన్యుడు—-పార్వతీదేవి
ఆగ్నేయానికి అధిపతి:అగ్ని——స్వాహాదేవి: ,
వాయువ్యానికి అధిపతి:వాయువు—-అంజనాదేవి,
నైరుతికి అధిపతి:నిరృతి—-దీర్ఘాదేవి,
శాస్త్ర గ్రంధాలలో ఈ అష్టదిక్పలకులకు వేరే వేరుగా మంత్రాలు, స్తోత్రాలు కూడా ఉన్నాయి.
No comments
Post a Comment