త్రినాధుని నోము పూర్తి కథ
పూరకాలములో ఒక నిరుపేద విప్రుడు ఉండేవాడు. అతనికి లేకలేక ఒక కుమారుడు కలిగాడు ఆబిడ్డడికి తల్లి వద్ద చాలినన్ని పాలు లేక ఆకలితో అలమటించు చుదేవాడు. ఒక ఆవుని సంపాదిస్తే బిడ్డడికి పాల ఇబ్బంది ఉండదని నిర్ణయించుకున్నాడు. అందుకుగాను ఇంటిలో గల కొద్దిపాటి మంచాలు కుంచాలు అమ్మి వచ్చిన సొమ్ముతో సంతకు బయలుదేరినాడు. యెంత ధరకైన పాడి ఆవును కొనాలని ఆ బ్రాహ్మణుడు సంతలో తిరుగుతున్నాడు.
సంత జరిగే ప్రాంతానికి సమీపాన గల గ్రామంలో ఒక సంపన్నుని ఆవు ఇరుగు పొరుగు వారి పొలాలను పాడు చేస్తుండేది. నిత్యం తగువులు తీర్మానాలతో విసిగిపోయిన అతడు దానిని ఎవరికైనా ఇచ్చి వేయాలని ఎంతో ప్రయత్నిచినాడు . దానిని తీసుకోగాలన్డులకు ఎవ్వరూ ముందుకు రాలేదు. సంతకు తోలుకు వెళ్తే దీని సంగతి తెలియని వారు ఖరీదు చేస్తారని నిర్ణయించుకొని ఆ సంపన్నుడు దానిని సంతకు తోలుకు వచాడు. ఏ వెలకైనా అమాలని అతడు, ఏ వెలకైనా కొనాలని విప్రుడు సంతలో తారసపడ్డారు. వదిలిపోతే చాలని అతడు దొరికితెచాలని యితడు ఉన్నందున ఆ ఆవు బార్హమ్నునకు అమ్మబడినది.
దానిని తోలుకుని స్వగ్రామానికి బయలుదేరిని విప్రుడు ఆనంద పారవశ్యంతో ఆదమరచి వుండగా ఆ ఆవు తప్పించుకుని పారి పోయింది. అది దొరకక విప్రుడు ఒక చెట్టు నీడను కూర్చుని విచారిస్తున్నాడు. విచారించి విచారించి తిరిగి సంతకు వెళ్లి వేదకాలని దాని యజమాని వైనం తెలుసుకుని అతని ఇంటికి గాని వేల్లిందేమో తీసితెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
అలా వెళ్తున్న ఆ బ్రాహ్మణునకు త్రిమూర్తులు సాక్షాత్కరించి ఓయీ!నీవు ఎక్కడికి వెళ్ళుతున్నావు అని ప్రశ్నించారు. ఆవును వెదుకుటకు వెళ్ళుచున్నాను అని విప్రుడు సమాధానం చెప్పాడు. నువ్వు సంత దిక్కుగా గ్రామానికి వెళ్ళుతున్నావు గనుక నీవు తిరిగి వచ్చేటప్పుడు గంజాయి, ఆకు, వక్క, నూనె తెచ్చి పెట్టవలసినదిగా మూడు పైసలిచ్చారు. అలాగేనని అంగీకరించి విప్రుడు సంతలో ఆవు అగుపించక తిరిగివస్తూ తెలేకలగానుగకు వెళ్లి ఒక పైసా నూనే ఇమ్మని చెంగుచాచాడు ఇతడెవరో అమాయకుడని ఆలోచించి ఆగానుగా యజమాని సోలను తిరగేసి నూనెను అతని చెంగులోనికి కొలిచాడు. ఆ విప్రుడు కొట్టుదిగేసరికి ఆ తెలికలవాని పాత్రల్లో నూనె అంటా మటుమాయమైయ్యింది. అతడు లబూదిబూమని మొరపెట్టుకోగా చుట్టూ పక్కల వారంతా చేరి విషయాని తెలుసుకున్నారు. విప్రుడిని మోసగించిన కారణం వల్ల అలా జరిగిందని గ్రహించారు.
అతడిని వెతుక్కుంటూ వెళ్ళి కిరాణా కొట్టు మీద ఆకు వక్కలు కొనుక్కుంటున్న ఆ విప్రుడిని చూసి అయ్యా! మీకు నూనె కొత్తాయన తక్కువ కొలిచాదట రండి సరిగా కొలిచిస్తాదట అని చెప్పి తీసుకెళ్ళి నూనె ఇప్పించారు. అతడు తిరిగి వస్తుండగా త్రిమూర్తులు కనబడి అయ్యా నువ్వు మా కొరకై తెచ్చిన వస్తువులతో త్రినాధ పూజా చెయ్యి ణీ కష్టాలు తొలగుతాయి అని ఈ పూజలో నీకేమి ఖర్చు ఉండదని చెప్పి పంపించాడు. అతడు ఇంటికి వెళ్ళి త్రినాధ పూజను గురించి భార్యకు చెప్పి దంపతులు ఇద్దరుకూడా భక్తి శ్రద్దలతో పూజా చేసారు. త్రిమూర్తులు పూజా చేయడం వల్ల పోయిన ఆవు దొరికింది. ఆ ఆవు అల్లరి చిల్లరిగా తిరగడం మాని చక్కగా పాలివ్వసాగింది. బిడ్డది పాల బెడద తీరింది. ఆయవారంవల్ల తిది వార నక్షత్రాలు చెప్పడం వల్ల కొద్దో, గొప్పో దానం ముట్టి వారి ఆర్ధిక ఇబ్బందులు తొలగనారంభించాయి.
ఈ పూజా చేసిన వారికి సంసార సంభందమైన ఇబ్బందులు తొలగి జీవితం ప్రశాంతంగా సాగుతుంది.
No comments
Post a Comment