చిట్టిబొట్టు నోము పూర్తి కథ
పూర్వకాలములో ఒకానొక పదాతి ఇరుగుపొరుగు వారితో చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటుండేది. ఏ ఒక్కరితోను మంచిగా వుండేది కాదు అందరితోను విరోధంగా వుండేది. ఆమెకు ఎవరు చెప్పారో ఎలా ఉద్దేశం కలిగిందో చిట్టి బొట్టు నోము నోచింది నోము నియమానుసారం అయిదుగురు పేరంటాల్లకు బొట్టు పెట్టాలి. అందుకుగాను పిలవబడే పెరంటాళ్ళతో ఏ ఒక్కరితోను ఆమెకు పొట్టు కించిత్తు కూడా లేదు. ఎలాగైతేనేం నలుగురికి బొట్టు పెట్టింది. అయిదవ ఆమెకు బొట్టు పెట్టబోయే సమయంలో ఆమెలోని జగడపు బుద్ది ప్రజ్వరిల్లింది. ఆమెకు బొట్టు పెట్టకుండా కసిరి కొట్టింది. ఆవేశం ఆపుకోలేక తన బొట్టు తుదచేసుకుంది. ఆ విధముగా చిట్టి బొట్టు నోముకు ఉల్లంఘన జరిగింది.
మరుజన్మలో ఒక బ్రాహ్మణుని ఇంట జన్మించింది. ఆ దంపతులు ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కాని ఆ బిడ్డ ముఖాన బొట్టు నిలిచేది కాదు. యెంత ప్రయత్నించిన ఎలా ప్రయత్నించినా ఎన్నిసార్లు పెట్టినా ఆబిడ్డ నుదుట బొట్టు నిలిచేది కాదు. ఈ వైపరీత్యానికి ఆ దంపతులు ఎంతగానో బాధపడుతున్దేవారు. ఒకనాడు ఆ గ్రామానికి వచ్చిన త్రికాలజ్ఞానియైన ఒక యోగిని దర్శించి ఆ దంపతులు తమ బిడ్డలా విషయం చెప్పి వైధవ్య ప్రాప్తి ఉన్నదేమో అన్న భయాందోళనలను విన్న వించుకొని తరుణోపాయం చెప్పవలసినదని ప్రార్ధించారు. అంతట ఆ యోగి తన మనోనేత్రంతో విషయాని గ్రహించి దంపతుల్లారా విచారించకండి. గత జన్మలో మీ బిడ్డ పరమ గయ్యాళి ఎవరితోనూ సానిగా పొందక వుద్న్డేది కాదు. అందరితోను గొడవలు పెట్టుకునేది. ఈ గొడవలు మాని చిట్టి బొట్టు నోమును నోచి పేరంటాల్లకు బొట్టు పెట్టడంలో ఒక ముత్తిడువను వదిలివేయదమేగాక తన బొట్టును కూడా చేరుపుకుంది. ఆ కారణంగా ఆమెకు నుదుట బొట్టు నిలవడంలేదు. మీరామె చేత చిట్టి బొట్టు నోము నోయించండి పరిస్థితి చక్కబడుతుందని వైదవ్య ప్రమాదం తప్పుతుందని చెప్పారు.
ఆ ప్రకారం ఆ దంపతులు తమ బిడ్డ చేత చిట్టి బొట్టు నోమును నోయించారు. బొట్టురాలిపదకుండా నుదుట యందు అమరుకున్నది. గుణవంతుడు, రూపవంతుడైన యువకునితో ఆమెకు వివాహం జరిగింది. ఈ నోము నోచుకున్న వారి బొట్టు చెదరక మంచి దాంపత్య సౌభాగ్యం కలుగుతుంది.
ఉద్యాపన:
సంవత్సరకాలంపాటు వారం వారం అయిదుగురు పేరంటాల్లకు బొట్టు పెట్టాలి. వారిచే అక్షింతలు శిరస్సున జల్లించుకుని వారికి పాదాబివందనం చేసి వారి ఆశీర్వచనాలు పొందాలి.
No comments
Post a Comment