శ్రీదేవీ స్థానాలు

“తల్లీ, అతిరహస్యమైన భక్తి యోగం గూర్చి, ధ్యానయోగం గూర్చి వివరించావు. నీ స్థానాల గూర్చి చెప్పి మమ్మల్ని చరితార్థులని చేయుము.”
“లక్ష్మీ నివాసము కొల్లాపూర్.
రేణుకా నివాసము మాతృపురమూ
 హింగుళాదేవి నివాసం తుళజాపురమూ
జ్వాలాముఖి నివాసం సప్తశృంగమూ
 శాకంభరీ, భ్రామరీ, రక్తదంతికా దుర్గాదేవి స్థానాలు.
వింధ్యాచల నివాసినీ స్థానమూ, గుహకాళి నివాసస్థామైన నేపాలూ, నీలాంబాదేవి నివాసస్థానమైన నీలాచలమూ, జాంబూనదేశ్వరీ స్థానమైన శ్రీనగరమూ, చిదంబరమున మరియు భీమాదేవి, విమలా, శ్రీ చంద్రలా, కౌశికా నివాసాలూ, వేదారణ్యము సుందరీ స్థానము, వైద్యనాథంలోని భగళాస్థానమూ, మణిద్వీపంలో భువనేశ్వరి, త్రిపుర భైరవీ స్థానమైన కామాఖ్య క్షేత్రం, కాశీ విశాలాక్షి ఇవి నా ముఖ్య స్థానాలు..
నాకు ఇష్టమైన వ్రతాలు… అనంతతృతీయా వ్రతము, శుక్రవార వ్రతము, భానువార వ్రతము, ప్రదోష వ్రతము, రసకళ్యాణీ వ్రతము మరియు ఆర్జానందకర వ్రతములు.