Sanagala Guggillu :శనగ గుగ్గిల్లు ఇలా చేసి తినండి ఆరోగ్యానికి ఎంతో బలం
Sanagala Guggillu: మన రోజువారీ ఆహారంలో భాగంగా తరచుగా శనగలను తినండి. శనగలను తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. శనగల తీసుకోవడం వల్ల మీరు బలంగా మరియు ఆరోగ్యంగా ఉంటారు. శనగలు మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది.
శనగలను వివిధ రకాల్లో మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనలో ఎక్కువమంది వీటిని గుగ్గిళ్లుగా చేసుకుని తింటారు. శనగ గుగ్గిళ్లు ఎంత రుచిగా ఉంటాయో మనందరికీ తెలుసు.
ఎంతో రుచిగా ఉండడంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఈ శనగ గుగ్గిళ్లను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శనగ గుగ్గిళ్ల తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-
శెనగలు -100 గ్రాములు
నూనె- అర టేబుల్ స్పూన్
పచ్చి వెల్లుల్లి రెబ్బలు- 3
శనగలు – 1 టీస్పూన్
మి నప పప్పు- 1 టీస్పూన్
మసాలా -అర టీస్పూన్
జీలకర్ర- పావు టీస్పూన్
ఎండుమిర్చి- 2, తరిగిన
ఉల్లిపాయలు – 1
కరివేపాకు – ఒక రెమ్మ
ఇంగువ- చిటికెడు
ఉప్పు -రుచికి సరిపడా
Sanagala Guggillu :శనగ గుగ్గిల్లు ఇలా చేసి తినండి ఆరోగ్యానికి ఎంతో బలం
శనగ గుగ్గిళ్ల తయారు చేసే విధానం:-
ముందుగా ఒక గిన్నెలో శనగలను వేసి, వాటిని నీటితో బాగా కడిగి, తగినంత నీరు పోసి, వాటిని 5 మరియు 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన శనగలను కుక్కర్ లో వేసి అవి మునిగే వరకు తగినంత నీటిని పోసి, ఉప్పును వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తరువాత మూత తీసి వాటిల్లో ఎక్కువగా ఉన్న నీరు అంతా పోయేలా వాటిని ఒక జల్లి గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి .
ఇప్పుడు ఒక కడా యిలో నూనె వేసి నూనె కాగిన తరువాత వెల్లుల్లి రెబ్బలను, శనగ పప్పును, మినప పప్పును, ఆవాలను, జీలకర్రను, ఎండు మిరపకాయలను వేసి వేయించుకోవాలి.ఇలా ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలతో పాటు కరివేపాకు కూడా వేసి వేయించాలి.ఈ మిశ్రమం పూర్తిగా వేగిన తరువాత ఉడికించి పెట్టుకున్న శనగలను వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించాలి.
ఇంగువ వేసి, ఈ మిశ్రమాన్ని ఒక నిమిషం ఉడికించి, ఆపై స్టవ్ ఆఫ్ చేయండి. ఈ విధంగా, మీరు రుచికరమైన శనగ గుగ్గిళ్ల తయారవుతాయి.
సాయంత్రం సమయాలలో స్పాక్స్ గా ఈ విధంగా శనగ గుగ్గిళ్లను తయారు చేసుకుని తినడం వల్ల రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చును .
No comments
Post a Comment