_*?అయ్యప్ప చరితం - 48 వ అధ్యాయం?*_
?☘️?️☘️?️☘️?️☘️?️☘️?️
*మాలాధారనరోజు గుడికి తీసుకువెళ్ళవలసిన వస్తువులు:*
నలుపు , కావి , నీలిరంగు దుస్తులు రెండేసి జతలు , తులసి , రుద్రాక్షమాలలు  108 సంఖ్యగలవి రెండు మాలలు తీసుకోవాలి.
 
*పూజాద్రవ్యాలు*
కంకుమ , విభూది , చందనం , అరటిపండ్లు , కొబ్బరికాయ , ఆవు నెయ్యి , దీపారాధాన వస్తువులు , పుష్పాలు మొదలైనవి తీసుకుని గుడిలో గురుస్వామి వారిని కలుసుకోవాలి ! గురుస్వామి వారు దేవాలయాలలో పూజ జరిపి మెడలో మాలలు వేసి చెవిలో అయ్యప్పస్వామి మంత్రం ఉపదేశించి దీక్ష ఇవ్వటం జరుగుతుంది !
*మాలాధారణ మంత్రం:*
మాలను ధరింపజేస్తూ ఈ క్రింది శ్లోకాన్ని పఠింపచేస్తారు గురుస్వామి !
*‘‘జ్ఞానముద్రాం , శాస్తమ్రుద్రాం ,
గురుముద్రాం నమామ్యహం
వనముద్రాం , శ్రద్ధాముద్రాం ,
రుద్రముద్రాం , నమామ్యహం ,
శాంతముద్రాం , సత్యముద్రాం ,
వ్రతముద్రాం నమామ్యహం
శబర్యాశ్రమ సత్యేన ముద్రాం
పాతు సదాపిమే
గురు దక్షిణాయా ,
పూర్వ తస్మానుగ్రహకారిణే
శరణాగతముద్రాఖ్యం ,
తన్ముద్రాం ధారయామ్యహం
చిన్ముద్రాం ఖేచరీముద్రాం ,
భద్రముద్రాం నమామ్యహం
శబర్యాచలముద్రాయై ,
నమస్త్భ్యుం నమో నమః*
*‘ఓం స్వామియే శరణం అయ్యప్ప’*
అంటూ దీక్ష ముద్ర వున్న మాలను ధరింపజేస్తారు గురుస్వామి ! మండల దీక్షా స్వీకారానికి ఆశీర్వాదం , ఆమోదం తెలియజేస్తారు !
దీక్ష ముద్ర మాలను ధరించినవారు అప్పటినుండి మండలకాలంలో ఎంతో పవిత్రంగా , నియమ నిష్ఠలతో గడపవలసి వుంటుంది !
*దీక్షను స్వీకరించిన స్వాముల దినచర్య*
*ఉదయం:* 
బ్రాహ్మముహూర్తంలో (తెల్లవారు జామున గం.3.30) లేచి సూర్యోదయానికి ముందుగానే కాలకృత్యాలు పూర్తిచేసి , చల్లనీళ్ళతో తలస్నానం ఆచరించాలి ! శుభ్రమైన నల్లని వస్త్రాలు ధరించి నుదుట విభూతి , చందనము , కుంకుమ బొట్లు ధరించాలి ! మెడలో వున్న మాలలోని ముద్రకు కూడా విభూది , కుంకుమ , చందనము అద్ది కళ్లకద్దుకోవాలి ! సూర్యునికి నమస్కరించి పూజ గదిలోకి ప్రవేశించాలి.
పూజాగృహంలో అయ్యప్పస్వామి చిత్రపటాన్ని మధ్యలో అమర్చిన పీఠంమీద అరిటాకు వేసి , దానిమీద వుంచి చందనపు బొట్టు పెట్టి , కుంకుమ అద్ది పూలమాలలతో అలంకరించి రెండు వైపులా దీపపు కుందులు వుంచి దీపారాధన చేయాలి ! స్వామిని షోడశోపచారాలతో పూజించాలి ! నైవేద్యంగా అరటిపండ్లు , బెల్లం , అటుకులు మొదలైనవి సమర్పించి హారతి చూపుతూ 108 నామాల శరణు ఘోష చదివి , సాష్టాంగ నమస్కారాలు చేయాలి ! మెడలోని ముద్రమాలకు హారతి చూపించాలి ! పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత దేవాలయానికి వెళ్లి దైవదర్శనం , గురుస్వామి దర్శనం చేసుకుని ఇంటికివచ్చి అల్పాహారం (భిక్ష) స్వీకరించాలి !
*మధ్యాహ్నం:* 
రోజువారీ పనులు చేసుకుని మధ్యాహ్నం తిరిగి స్నానం చేసి సద్ది (భోజనం) స్వీకరించాలి.
*సాయంత్రం:* 
 సూర్యాస్తమయం తర్వాత తిరిగి స్నానం చేసి పూజ చేయాలి. ఉదయం చేసిన విధంగానే ! స్వామికి భజన ప్రీతికరం ! అందుచేత రాత్రి కొంతసేపు భోజన నిర్వర్తించాలి ! ఆపైన దేవాలయాన్ని , గురుస్వామిని దర్శించి ఇంటికి తిరిగి వచ్చి రాత్రి అల్పాహారం స్వీకరించాలి.
*రాత్రి:* 
 నిద్రించడానికి కొత్తచాప , దుప్పటి నేలపై పరుచుకుని నిద్రించాలి ! ఈ విధమైన దినచర్యను మండల కాలంలో పాటించాలి .
*ఆహార నియమాలు:* 
దీక్ష స్వీకరించిన స్వాములు ఆహార నియమాలను సక్రమంగాపాటించవలసి వుంటుంది ! వారికి ఆహారం తయారుచేసేవారు స్నానం చేసి శుచిగా వంట చేయాలి ! సాత్వికాహారం మాత్రమే స్వీకరించాలి ! ఎక్కువగా తీపి , ఉప్పు , పులుపు , కారం , ఉల్లి , వెల్లుల్లి , మసాలా దినుసులు కలిపిన ఆహారాన్ని భుజించకూడదు !
అపరిశుభ్రమైన పదార్థాలు అకాలంలో , అమితంగా తినకూడదు !
*పానీయాలు:*  
ఆహార పానీయాల విషయంలో శ్రద్ధ తీసుకుని , నిషిద్ధమైనవి స్వీకరించకుండా వుండటంవల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ! అప్పుడే మనస్సు ఆరోగ్యంగా ఉండి మండల దీక్ష పూర్తిచేయడానికి వీలు కలుగుతుంది !
అనారోగ్యకారణమైన మత్తు పదార్థాలతో కూడిన పానీయాలు త్రాగకూడదు ! సురాపానం చేయరాదు.
ఆరోగ్యాన్ని కలిగించే పాలు , మజ్జిగ తేట , పండ్ల రసాలు త్రాగవచ్చును ! సరైన ఆహారంవలన దేహానికి శక్తి లభిస్తుంది ! మనస్సు ప్రశాంతంగా వుంటుంది ! నిద్ర సరిగా పడుతుంది !
దీక్షాకాలంలో సాత్వికాహారం స్వీకరించాలి ! అటుకులు , కాయగూరలు , అన్నం మధ్యాహ్నం వేళ స్వీకరించి , ఉదయం , రాత్రి కాలంలో పాలు , పండ్లు స్వీకరించాలి !
*ఇతర దీక్షా నియమాలు*
దీక్ష స్వీకరించిన మొదట రోజూ మూడుసార్లు చన్నీటితో తలస్నానం ఆచరించాలి !   నుదుట విభూది , చందనం , కుంకుమధారణచేసి నల్లని వస్త్రాలు ధరించాలి .
???????????