మానవ జన్మ అద్భుతమైనది *పునర్విత్తం పునర్మిత్రం*
*పునర్భార్య పునర్మహి*
*ఏతత్సర్వంపునర్లభ్యం*
*న శరీరం పునఃపునః ।।*
* పోయిన *ధనం* మళ్లీ చేరుతుంది.
** *దూరమైన మిత్రుడు* మళ్లీ చేరువఅవుతాడు.
*** *భార్య* గతిస్తే మరొక భార్య లభిస్తుంది.
**** *భూసంపద* మళ్లీ ప్రాప్తిస్తుంది.
పోయినవన్నీ మళ్లీ తిరిగి రాబట్టుకోవచ్చు!
కాని *మానవ శరీరం* మాత్రం మళ్లీ మళ్లీ రాదు.
అందుకే *శరీరం ఖలు ధర్మసాధనం* అన్నారు.
కేవలం *శరీరం* ఉంటేనే ధార్మికపనులు చేయవచ్చు.
*శరీరం* ఉంటేనే నాలుగు మంచి పనులు చేసే అవకాశం వస్తుంది.
*శరీరం* ఉంటేనే హితవాక్యాలు చెప్పవచ్చు.
ఏ పని చేయడానికైనా *శరీరం* కావాలి.
కనుక *శరీరము* ను రక్షించుకోవాల్సింది మానవ జన్మ ఎత్తినవాళ్లే.
జంతువులకు *శరీరం* ఉంటుంది కాని వాటికి ఆలోచన ఉండదు.
పైగా ఆలోచన కలిగినా దాన్ని అమలు చేయడానికి *శరీరం* సహకరించదు.
*బుద్ధి , ఆలోచన , మాట్లాడే శక్తి , కావలసినది సంపాదించుకొని జ్ఞానం*తగిన అవయవ నిర్మాణం*
ఉండేది ఒక్క మనుష్యులకే.
వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది.
కనుక మనం అందరూ శరీరాన్ని కాపాడుకోవాలి.
*అతిగా తిన్నా*,
*అతిగా ఆలోచించినా*,
*అతిగా సుఖం కలిగించినా*,
*అతిగా దుఃఖం కలిగించినా*
*ఏదైనా అతిగా చేస్తే ఈ “శరీరం”* *కాస్త పుటుక్కుమంటుంది*.
ఇక *శరీరం* చేజారిపోయాక చేసేది ఏమీ ఉండదు.
కనుక ముందు *శరీరము* ను జాగ్రత్తగా చూసుకోవాలి.
*దీనికి*
*సత్యం,* *ధర్మం*,
*శాంతి*, *ప్రేమ,*
*అహింసలను*
*పాటించడమే “మహా ఔషధంగా” పనికి వస్తుంది.*
*విస్తరాకు*
విస్తరి ఆకుని ఎంతో శుబ్రoగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటాము ,
బోజనము తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము,
తినిన మరుక్షణం ఆ విస్తరి ఆకును మడిచి، దూరంగా పడేసి వస్తాము. ఎంగిలి ఆకును కూడా ముట్టుకోము.
*మనిషి జీవితం కూడ అంతే*
*’ఊపిరి”* *పోగానే ఊరిబయట పారేసి వస్తారు*,
విస్తరి ఆకు పారేసినప్పుడు సంతోష పడుతుంది, ఎందుకంటే పొయే ముందు *ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయోగ పడినాను అన్న తృప్తి ఆకుకు ఉంటుంది*
విస్తరి ఆకుకు ఉన్న ముందు ఆలోచన భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ !
*”” సేవ చేసే అవకాశము* *వచ్చినపుడు సేవ చేయండి””* *జారవిడుచుకోకూడదు*
మల్లీ , ఇంకొకసారి,
ఎప్పుడో చేయవచ్చు
అనుకొని వాయిదా వేయకండి,
ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే, కుండ ఎప్పుడైనా పగలవచ్చు అప్పుడు విస్తరికి ఉన్న తృప్తి కూడ మనకి ఉండదు.
*ఎంత సంపాదించి ఏమి లాభం?*
*ఒక్క పైసా కూడా తీసుకు పోగలమా?*
*మన చేత* *ప్రత్యక్షంగా,పరోక్షంగా ఓ 10 మందికి*
*మంచి జరిగితే,*
*మన మానవ జన్మ సార్థకమయినట్లే ……..*. ?
(సేకరణ )
No comments
Post a Comment