సహజ గృహ చిట్కాలను ఉపయోగించి జుట్టు రాలడాన్ని ఆపడం ఎలా

 
ప్రతి రోజు 100 తంతువుల (వెంట్రుకలు) జుట్టును రాలిపోవడం  చాలా సాధారణం. జుట్టు యొక్క సహజ జీవిత చక్రం (natural life cycle) దీనికి కారణం. పాత జుట్టు కొత్తదానితో భర్తీ చేయబడుతుంది. కానీ, జుట్టు పలుచబడడం, జుట్టు దువ్విన ప్రతి సారి అధికంగా జుట్టు రాలిపోవడం, బట్టతల వంటి పాచెస్ (ఖాళీలు) ఏర్పడడం వంటి లక్షణాలు గమనించిన్నప్పుడు సమస్య తలెత్తుతుంది.
 
జుట్టు రాలడం మహిళల కంటే పురుషులలో ఎక్కువగా కూడా కనిపిస్తుంది.  వయస్సుతో పాటు దాని తీవ్రత క్రమంగా కూడా పెరుగుతుంది. ఇది ఒత్తిడి, ఆకస్మికంగా బరువు తగ్గడం, పోషక లోపాలు, కొన్ని మందుల వలన వస్తుంది. కానీ, ముఖ్యంగా వ్యక్తి  జన్యువుల వల్లన ఇది సంభవిస్తుంది.
 
కొంత మొత్తంలో జుట్టు రాలడం అనివార్యం, కానీ, తీవ్రమైన జుట్టు నష్టాన్ని నివారించడానికి సులువుగా  అనుసరించగల కొన్ని చిట్కాలు, నివారణలు మరియు చికిత్సలు కూడా  ఉన్నాయి. కొబ్బరి నూనె మరియు లావెండర్ నూనె వంటి కొన్ని నూనెలు మరియు విటమిన్ ఇ వంటి విటమిన్లు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిరూపించబడ్డాయి .  అవి సమర్థవంతమైన జుట్టు రాలడాన్ని తగ్గించే చిట్కాలుగా కూడా పనిచేస్తాయి.
  
 

 జుట్టు రాలడాన్ని నివారించగల అనేక ముఖ్యమైన నివారణలు/చిట్కాలు.

 
జుట్టు రాలడాన్ని ఎలా నివారించాలి
జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఆహార విధానం
 
జుట్టు తిరిగి పెరగడానికి ఉల్లిపాయ
జుట్టు రాలడాన్ని నియంత్రించడం కోసం మందార
 
 
 

జుట్టు రాలడాన్ని ఎలా నివారించాలి 

మీ జన్యువులు కాకుండా, ఆహార విధానం, పోషకాలు, వ్యాయామం మరియు ఆరోగ్యం మీ జుట్టు రాలడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జుట్టు పలుచబడడం మరియు జుట్టు రాలడాన్ని నివారించడానికి, మీరు ఈ కారకాల పట్ల జాగ్రత్త వహించవచ్చును . ఈ కింద ఇవ్వబడిన చిట్కాలను అనుసరించడం వలన జుట్టు రాలడాన్ని నివారించడంలో మీకు సహాయపడుతుంది.
 
 

జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఆహార విధానం

పోషక పదార్దాల యొక్క సరైన నిష్పత్తితో సహా సమతుల్య ఆహారం యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు. అయితే, కొన్ని విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర పదార్దాలు జుట్టు రాలడాన్ని నివారించడంలో ప్రత్యేక పాత్రను కలిగి ఉంటాయి .  వీటిని తగినంతగా తీసుకునేలా చూడాలి.
 

 

  • జుట్టు కోసం విటమిన్లు
  • జుట్టు రాలడాన్ని నియంత్రించేందుకు సూక్ష్మపోషకాలు
  • జుట్టు రాలడాన్ని నియంత్రిచే ఆహారాలు
  • జుట్టు కోసం విటమిన్లు

 

విటమిన్ ఇ
 
విటమిన్ ఇ జుట్టుకు అవసరమైన ముఖ్య పోషకాలలో ఒకటి.  ఇది ఆక్సిడేటివ్ ఒత్తిడి వల్ల కలిగే అన్ని రకాల నష్టాల నుండి మన జుట్టును రక్షించడంలో కూడా సహాయపడుతుంది. ఆండ్రోజెనిక్ అలోపేసియా కారణంగా బట్టతల రావడానికి ఆక్సీకరణ ఒత్తిడి ఒక కారణమని కూడా గుర్తించబడింది.  ఇది పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది.
 
బాదం, ఆక్రోటుకాయలు మరియు వేరుశెనగ పిక్కలు, పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు వంటి నట్స్  మరియు పొద్దుతిరుగుడు పువ్వు నూనె, సోయాబీన్ నూనె వంటి కొన్ని కూరగాయల నూనెలు విటమిన్ ఇ యొక్క గొప్ప వనరులు మరియు వీటిని మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చాలి.
 
యాంటీఆక్సిడెంట్ ఆహారాలు
 
ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పనిచేసే ఆహార పదార్దాలను యాంటీఆక్సిడెంట్లు అని అంటారు. విటమిన్ ఇ యాంటీయాక్సిడెంట్లలో ఒకటి. అయితే, యాంటీఆక్సిడెంట్ల యొక్క ఇతర ఆహార వనరులలో కమలాపండు, నిమ్మ, కివి, సాల్మన్, సీఫుడ్, బ్రోకలీ, ఆకు కూరలు మరియు గ్రీన్ టీ కూడా ఉంటాయి.
 
బయోటిన్
 
జుట్టు పెరుగుదలలో ముఖ్య పాత్రను పోషించే ఉన్న మరొక విటమిన్ బయోటిన్ లేదా విటమిన్ బి7, దీని లోపం అలోపేసియా అరేటా (అతుకులాతుకులుగా జుట్టు రాలిపోవడం) తో సంబంధం కలిగి ఉంటుంది. దీనిని నివారించడానికి, మీ ఆహారంలో బయోటిన్ యొక్క ఆహార వనరుల పరిమాణాన్ని పెంచడం చాలా మంచిది.  ఎందుకంటే అలోపేసియా నిర్వహణలో బయోటిన్ సప్లీమెంట్ల చర్య స్పష్టంగా గమనింపబడలేదు. గుడ్డు పచ్చసొన, నట్స్, విత్తనాలు మరియు అవోకాడోలు బయోటిన్ యొక్క గొప్ప వనరులు.
 
 

 

  • జుట్టు రాలడాన్ని నియంత్రించేందుకు సూక్ష్మపోషకాలు
  • సూక్ష్మపోషకాలు (మైక్రోన్యూట్రియెంట్స్) కలిగిన ఖనిజాలు, అంటే అవి శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమావుతాయి, మన జుట్టు ఆరోగ్యాన్ని నియంత్రించడంలో కూడా ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

 

 
ఐరన్
 
ఐరన్ అటువంటి ఖనిజాలలో ఒకటి.  దీని లోపం ఐరన్ లోపం రక్తహీనత (iron deficiency anaemia) కు కారణమవుతుంది. జుట్టు రాలడం దీనికి ఒక సాధారణ లక్షణం.  కాబట్టి, ఐరన్ అధికంగా ఉండే ఆహార వనరులను తీసుకోవడం చాలా ఉపయోగపడుతుంది.
 
రక్తహీనత మరియు జుట్టు రాలడానికి కారణమయ్యే ఇనుము లోపం నివారించడానికి సన్నని మాంసం, పప్పుధాన్యాలు, కాయలు, తృణధాన్యాలు మరియు పచ్చి ఆకు కూరలు వంటి ఆహారాన్ని చేర్చాలని సిఫార్సు కూడా చేయబడింది.
 
నిమ్మ, జామ, కివి, బంగాళాదుంప, టమటా వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగాన్ని కూడా పెంచాలని సలహా ఇవ్వబడుతుంది. శరీరంలో నాన్ హిమ్ ఐరన్ (non-haem iron) ను పీల్చుకోవడంలో/గ్రహించుకోవడంలో విటమిన్ సి  బాగా సహాయపడుతుంది.
 
సెలీనియం మరియు జింక్
 
మీ జుట్టు ఆరోగ్యానికి ఇతర ముఖ్యమైన ఖనిజాలు సెలీనియం మరియు జింక్. మీ జుట్టును ఆక్సీకరణ నష్టం నుండి రక్షించడం ద్వారా సెలీనియం బాగా పనిచేస్తుంది, మరియు దాని లోపం తక్కువ జుట్టు పెరుగుదలతో ముడిపడి ఉంటుంది. సీఫుడ్, పౌల్ట్రీ, గుడ్లు మరియు చిక్కుళ్ళు సెలీనియం యొక్క గొప్ప వనరులు.
 
జింక్, ప్రోటీన్ సంశ్లేషణ (synthesis)లో సహాయపడుతుంది .  తద్వారా, జుట్టు ఫోలికల్ ఏర్పడటాన్ని నిర్వహిస్తుంది (జుట్టు కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది). జింక్ లోపం సాధారణంగా అనేక రకాల అలోపేసియా మరియు బట్టతల సమస్యలలో కూడా కనిపిస్తుంది. ఈ లోపం జుట్టును పెళుసుగా చేస్తుంది, దీనివల్ల జుట్టు దెబ్బతినడం, రాలిపోవడం మరియు చిట్లడం వంటి అవకాశాలు బాగా పెరుగుతాయి.
 
దీనిని నివారించడానికి, ఓయిస్టర్లు, బీన్స్, కాలేయం, పాలు మరియు పాల ఉత్పత్తులను మీ ఆహారంలో చేర్చాలి.
 
నియాసిన్
 
నియాసిన్ మరొక సూక్ష్మపోషకం, దీని లోపం అలోపేసియాతో సంబంధం కలిగి ఉంటుంది. మాంసం, కాలేయం, సాల్మన్, ట్యూనా, ట్రౌట్ మరియు సార్డైన్ వంటి కొన్ని రకాల చేపలు నియాసిన్ యొక్క ఆహార వనరులు, వీటిని మీ ఆహారంలో చేర్చవచ్చును .
 
 

 

జుట్టు రాలడాన్ని నియంత్రిచే ఆహారాలు

 

ప్రోటీన్లు 
 
సూక్ష్మపోషకాలు కాకుండా, తీవ్రమైన జుట్టు రాలడాన్ని నివారించడంలో ప్రోటీన్లు చాలా ముఖ్య పాత్రను కలిగి ఉంటాయి.  కొత్త జుట్టు ఫోలికల్స్ యొక్క సింథసిస్ లో ఇవి  పాల్గొంటాయి.  ఇది పాత వెంట్రుకలను భర్తీ చేస్తుంది. ప్రోటీన్ల ఆహార వనరులు లీన్ మీట్, లీన్ చికెన్, పాలు, గుడ్లు, పప్పుధాన్యాలు మరియు సోయా ఉత్పత్తులు.
 
ఫ్యాటీ యాసిడ్లు (కొవ్వు ఆమ్లాలు) 
 
ఫ్యాటీ యాసిడ్లు, ముఖ్యంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా జుట్టు రాలడాన్ని నివారించడానికి చాలా అవసరం. ఫోలికల్ వ్యాప్తికి సహాయపడటం ద్వారా ఇవి జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి. వీటి లోపం వలన స్కాల్ప్ జుట్టును కోల్పోతుంది.
 
కాబట్టి, ఆక్రోటుకాయలు, సోయాబీన్, సాల్మన్, అవిసె గింజలు మరియు గుడ్లు వంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడమనేది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కాక, సాఫ్ ఫ్లవర్ (safflower) నూనె వంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే నూనెల యొక్క సమయోచిత పూత (తలకు రాసుకోవడం) కూడా జుట్టు పెరుగుదలకు  బాగా దారితీస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను ఈ రెండు రూపాల్లోనూ ఉపయోగించవచ్చు.
 
 
జుట్టు రాలడాన్ని నివారించడానికి ఒత్తిడిని తగ్గించుకోవడం
జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో ఒత్తిడి ఒకటి. తీవ్రమైన ఒత్తిడి వలన నెత్తిమీద జుట్టు సగం నుండి మూడు వంతులు రాలిపోవచ్చును . సాధారణంగా, ఇది అధిక ఒత్తిడి ఉన్న సమయాలలో సంభవిస్తుంది మరియు దీనిని నియంత్రిచవచ్చును . ఏదేమైనా, దీర్ఘకాలిక ఒత్తిడి మరియు ఆందోళన జుట్టు పలుచబడడానికి  కూడా దారితీస్తుంది.  ఇది తల దువ్విన ప్రతిసారీ జుట్టు గుత్తులు గుత్తులుగా రాలిపోవడం ద్వారా గమనింపబడుతుంది.
 
ఒత్తిడి తగ్గించడం ద్వారా దీనిని నిర్వహించవచ్చును , దీనిని యోగా, ధ్యానం, విశ్రాంతి లేదా శ్వాస ప్రక్రియల ద్వారా సాధించవచ్చు. వ్యాయామం ఎండార్ఫిన్‌ల స్థాయిని కూడా పెంచుతుంది లేదా వీటిని ‘ఫీల్ గుడ్ ’ హార్మోన్లని కూడా అంటారు, ఇది ఒత్తిడిని ఎదుర్కోవడానికి బాగా సహాయపడుతుంది. మీకు  జిమ్ లో చేరాలని లేదా యోగా ని ఎంచుకోవాలని అనిపించకపొతే, నడక, సైక్లింగ్ లేదా జాగింగ్ వంటి సాధారణ చర్యలు కూడా ఒత్తిడిని తొలగించడంలో బాగా సహాయపడతాయి.
 
 

జుట్టు రాలడాన్ని నివారించడం కోసం గృహ చిట్కాలు

జుట్టు రాలడాన్ని నివారించడంలో మరియు నిర్వహించడంలో  బాగా సహాయం చేస్తాయి. వీటిలో కొన్ని నూనెలు మరియు ఇంట్లో తయారు చేసుకుని  తలకు పట్టించే కొన్ని మిశ్రమాలు ఉంటాయి అవి ఈ విభాగంలో చర్చించబడ్డాయి.
 

 

  • జుట్టుకు కొబ్బరి నూనె మసాజ్
  • జుట్టు పెరుగుదలకు పిప్పరమెంటు నూనె
  • జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి లావెండర్ నూనె
  • పురుషులలో జుట్టు పెరుగుదలకు గుమ్మడి విత్తనాల నూనె
  • జుట్టు నష్టం చికిత్స కోసం అరోమాథెరపీ
  • జుట్టు రాలడాన్ని నియంత్రించడం కోసం నిమ్మకాయ
  • జుట్టు తిరిగి పెరగడానికి ఉల్లిపాయ
  • జుట్టు రాలడాన్ని నియంత్రించడం కోసం మందార

 

 

జుట్టుకు కొబ్బరి నూనె మసాజ్

కొన్ని నూనెలు, ముఖ్యంగా కొబ్బరి నూనె జుట్టుపై లోతైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది . జుట్టు రాలడాన్ని నివారించడంలో  బాగా సహాయపడుతుంది. కొబ్బరి నూనె జుట్టు రాలడానికి కారణమయ్యే ప్రోటీన్ నష్టాన్ని గణనీయంగా తగ్గించిందని పరిశోధన ఫలితాలు రుజువు చేశాయి. తల స్నానానికి ముందు మరియు తరువాత కొబ్బరి నూనెను ఉపయోగించినప్పుడు, అది ఇతర నూనెలతో పోలిస్తే గణనీయమైన ప్రభావాన్ని చూపిందని  కూడా తెలిసింది.
 
పరమాణు బరువు (మొలిక్యూలర్ వెయిట్) తక్కువగా ఉండడం వలన, కొబ్బరి నూనె వెంట్రుకల షాఫ్ట్ (కాండంలోకి) లోపలికి సులభంగా చొచ్చుకుపోతుంది, తద్వారా వెంట్రుకకు బలాన్ని ఇస్తుంది మరియు అది రాలిపోయే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. కొబ్బరి నూనె దెబ్బతిన్న జుట్టు మరియు దెబ్బతినని జుట్టు రెండింటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి, దీనిని చికిత్సగా మరియు నివారణ చర్యగా కూడా ఉపయోగించవచ్చు. మీ జుట్టుకు కొబ్బరి నూనెను ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ ఉంది.
 
మీ జుట్టు పొడవును బట్టి 1 నుండి 2 టీస్పూన్ల కొబ్బరి నూనె తీసుకోండి

 

  • దానిని కొంచెం వేడి చేయండి
  • మీ జుట్టు కుదుళ్ళలో రాయండి మరియు నెత్తిని సున్నితంగా మసాజ్ (మర్దన) చేయండి
  • అలా ఒక అరగంట లేదా ఒక రాత్రంతా వదిలివేయవచ్చు
  • నూనె రాసిన జుట్టుతో బయటకు వెళ్లడం సిఫారసు చేయబడదు ఎందుకంటే ఇది ధూళి మరియు దుమ్ము తలలో చిక్కుకుపోయెలా చేస్తుంది మరియు నష్టం కలిగిస్తుంది
  • మీరు బయటకు వెళ్ళవలసి వస్తే, నష్టాన్ని నివారించడానికి మీ తలను కప్పుకోవాలని  సిఫార్సు చేయబడుతుంది
  • ఉత్తమ ఫలితాల కోసం రోజు విడిచి రోజును ఉపయోగించవచ్చు.

 

 
 

జుట్టు పెరుగుదలకు పిప్పరమెంటు నూనె

పిప్పరమింట్ నూనె మెంథా పైపరిటా అనే మొక్క నుండి వస్తుంది మరియు దీనికి జుట్టు రాలడాన్ని నిరోధించే లక్షణాలను చాలా ఉంటాయి. పిప్పరమింట్ నూనె శక్తివంతమైన హెయిర్ రిగ్రోత్ ఏజెంట్ (జుట్టు తిరిగి పెరిగేలా చేసే ఏజెంట్) అని 2014 లో ఒక అధ్యయనం నిరూపించింది. ఇది జుట్టు ఫోలికల్స్ సంఖ్యను మరియు నెత్తి మీద వాటి లోతును పెంచుతుంది, అదే సమయంలో వాటి మందాన్ని కూడా పెంచుతుంది. జుట్టుకు పిప్పరమెంటు నూనెను ఎలా ఉపయోగించాలో ఇక్కడ ఉంది.
 
కొన్ని చుక్కల పిప్పరమెంటు నూనె తీసుకొని కొంచెం సహజ నూనెతో కలపండి
షాంపూతో శుభ్రం చేసే ముందు నెత్తిమీద బాగా మసాజ్ చేసి అరగంట పాటు అలానే ఉంచండి
ప్రత్యామ్నాయంగా, మీరు ఈ నూనె కొన్ని చుక్కలను షాంపూ మరియు కండీషనర్‌లో కలిపి  మాములుగా తలస్నానం చేయవచ్చు
 

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి లావెండర్ నూనె

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో లావెండర్ నూనె సామర్థ్యాన్ని ఒక తాజా అధ్యయనం ధ్రువీకరించింది. లావెండర్ నూనె యొక్క సమయోచిత పూత జుట్టు ఫాలికిల్స్ సంఖ్య మరియు దాని లోతు పెరగడానికి బాగా సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారించడానికి కూడా పని చేస్తుంది. ఈ ప్రయోజనాల కోసం లావెండర్ నూనెను ఉపయోగించడానికి, మీరు ఇలా చేయవచ్చు:
 
ఒక టీస్పూన్ లావెండర్ నూనెను తీసుకొని రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెతో కలపండి
మీ వేళ్లతో నెత్తి మీద బాగా మసాజ్ చేసి ఒక రాత్రంతా వదిలివేయండి
ఉదయం తలస్నానం చేయండి, ఉత్తమ ఫలితాల కోసం వారానికి రెండుసార్లు దీనిని చేయండి.
 

పురుషులలో జుట్టు పెరుగుదలకు గుమ్మడి విత్తనాల నూనె

గుమ్మడి విత్తనాల నూనెకు జుట్టు పెరుగుదలను మెరుగుపర్చడంలో గణనీయమైన సామర్థ్యం ఉంటుంది, అలోపేసియా రోగులలో నిర్వహించిన ఇటీవలి అధ్యయనం ద్వారా ఇది నిర్ధారించబడింది. ప్లేసిబో (చికిత్సా సామర్థ్యం లేని ఏజెంట్లు) ఇచ్చిన వారితోతో పోల్చినప్పుడు, గుమ్మడి విత్తన నూనెతో చికిత్స ఇచ్చిన బృందంలో వారి మొత్తం జుట్టు పరిమాణం పెరిగిందని చికిత్స ముందు తీసిన ఛాయాచిత్రాల (ఫొటోల) ద్వారా తేలింది. దాని ప్రయోజనాలను పొందటానికి గుమ్మడి విత్తనాల నూనెను ఈ కింది విధంగా ఉపయోగించవచ్చు:
 

 

  • ఒక కప్పు గ్రీన్ టీ తయారు చేసి, దానికి ఒక అర టీస్పూన్ గుమ్మడికాయ సీడ్ ఆయిల్ జోడించండి
  • ఒకసారి జుట్టును శుభ్రం చేసి, వెంటనే ఈ ద్రావణాన్ని తలకు పట్టించండి
  • 5 నిమిషాలు అలాగే ఉంచి తరువాత నీటితో బాగా  కడగాలి

 

 

జుట్టు నష్టం చికిత్స కోసం అరోమాథెరపీ

అరోమాథెరపీలో థైమ్ (ఒక విధమైన వామకు మొక్క) , లావెండర్, రోజ్మేరీ మరియు దేవదారు చెక్క (సెడార్వుడ్) నూనెల వంటి అనేక అరోమాటిక్  నూనెలు ఉంటాయి, ఇవి మన ఆరోగ్యంతో సహా జుట్టు పై కూడా అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
 
ఈ నూనెల పై పరిశోధనలు వాటి యొక్క యాంటీహెయిర్ ఫాల్ ప్రభావాలను ధ్రువీకరించాయి. ఇతర నూనెలతో పోల్చితే, జోజోబా మరియు గ్రేప్‌సీడ్ వంటి క్యారియర్ నూనెలతో కలిపి ఈ ఎస్సెంషియాల్ నూనెలను ఉపయోగించినప్పుడు అలోపేసియా అరేటా చికిత్సలో మరింత ప్రభావవంతంగా ఉన్నాయని తెలిసింది. ఈ నూనెల యొక్క ప్రయోజనాలను పొందటానికి, ఈ కింది దశలను అనుసరించండి:
 

 

  • ఒక సగం టీస్పూన్ లావెండర్ మరియు రోజ్మేరీ నూనెలను తీసుకోండి మరియు దీనికి రెండు చుక్కల థైమ్ మరియు దేవదారు చెక్క (సెడార్వుడ్) నూనెలతో కలపండి
  • వాటిని 6 చుక్కల గ్రేప్‌సీడ్, 4 చుక్కల జోజోబా నూనెలతో కలపండి
  • ఈ మిశ్రమాన్ని నెత్తికి పట్టించి ఒక 5 నుండి 10 నిమిషాలు మసాజ్ చేయండి
  • తరువాత, స్టీమ్ చేసిన టవల్ ను తలకు చుట్టి ఒక రాత్రంతా అలా ఉంచండి
  • మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయండి
  • ఉత్తమ ప్రయోజనాల కోసం ఈ చికిత్స 6 నెలలు చేయవచ్చు.

 

 
 

జుట్టు రాలడాన్ని నియంత్రించడం కోసం నిమ్మకాయ

నిమ్మకాయ అనేది సాధారణంగా ఉపయోగించే ఇంటి చిట్కాలలో ఒకటి. ఇది ఒక బలమైన యాంటీఆక్సిడెంట్ కావడం వల్ల స్కాల్ప్ (నెత్తి) మీద నుండి జుట్టు రాలడానికి కారణమయ్యే ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మ హెయిర్ వాష్ చేయడానికి మీరు ఈ కింది దశలను అనుసరించవచ్చు:
 
1 టేబుల్ స్పూన్ నిమ్మరసంలో  3 టేబుల్ స్పూన్ల కలబంద రసాన్ని కలపండి
ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక 5 నిమిషాలు మసాజ్ చేసి అరగంట తరువాత కడగాలి
 

జుట్టు తిరిగి పెరగడానికి ఉల్లిపాయ

ఉల్లిపాయ కూడా మరోక సాధారణ ఇంటి చిట్కా, జుట్టు తిరిగి పెరిగేలా చెయ్యడంలో ఉల్లిపాయ రసం యొక్క ప్రభావాలు క్లినికల్ అధ్యయనం ద్వారా నిరూపించబడ్డాయి.  ఈ అధ్యయనం సాధారణ నీటితో ఉల్లిపాయ రసాన్ని పోల్చి చేయబడింది. అలోపేసియాతో బాధపడుతున్న రోగులలో జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ బాగా ఉపయోగపడుతుందని ఫలితాలు వెల్లడించాయి. ఉల్లిపాయ రసం ఉపయోగించడానికి, మీరు వీటిని పాటించవచ్చు:
 

 

  • ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం తీసుకొని ఒక కాటన్ బాల్ ను దానిలో ముంచండి
  • ఈ కాటన్ బాల్ సహాయంతో మీ తల అంతా ఈ రసాన్ని రాయండి
  • వేళ్ళతో మసాజ్ చేయండి
  • సుమారు గంటసేపు అలా వదిలి వేసి, తరువాత కడగాలి
  • రోజు విడిచి రోజు ఈ చిట్కాని పాటించవచ్చు.

 

 
 

జుట్టు రాలడాన్ని నియంత్రించడం కోసం మందార

మందార సాధారణంగా అందుబాటులో ఉండే మొక్క మరియు ఇది జుట్టు రాలడాన్ని నివారించడానికి మరియు నియంత్రించడానికి ఒక అద్భుతమైన చిట్కా. జుట్టు కోసం మందారను రెండు విధాలుగా ఉపయోగించవచ్చు, అవి:
 
మందార నూనె
 

 

  • 8 నుండి 10 మందార ఆకులను తీసుకోండి
  • ఈ ఆకులను నూరి 1 కప్పు వేడిచేసిన కొబ్బరి నూనెలో కలపండి
  • అది చల్లారిన తరువాత, ఈ నూనెను మీ తలకు పట్టించి ఒక రాత్రంతా అలా వదిలివేయండి
  • మరుసటి రోజు యథావిధిగా తలస్నానం చేయండి

 

మందార హెయిర్ మాస్క్

 

  • కొన్ని మందార ఆకులను పేస్ట్‌ చేయండి
  • దీనికి 4 టేబుల్ స్పూన్ల పెరుగు కలపండి
  • దీనిని మీ తలకు పట్టించి
  • ఒక గంట ఉంచండి
  • తేలికపాటి గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేయండి
  • మీరు ఈ సుదీర్ఘ ప్రక్రియను పాటించలేకపోతే మందార నూనె కూడా వాణిజ్యపరంగా లభిస్తుంది మరియు అది ఉపయోగించడానికి సులువుగా ఉంటుంది.