Home Made హెర్బల్ షాంపూ
పట్టణ ప్రాంతాలలో కాలుష్యం చాల ఎక్కువ. మన జుట్టు ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మనం వాడే షాంపూ లు ఎంతవరకు శ్రేయస్కరమో మనకు తెలియదు. అందుకే మన కేశ సంరక్షణకు మన ఇంట్లోనే అందుబాటులో ఉన్న పదార్థాలతో షాంపూ కూడా తయారుచేసుకోవచ్చును.
కావాల్సిన పదార్థాలు:
ఉల్లిపాయలు -2
కుంకుడుకాయలు-100 గ్రామ్స్
షికాయ -100 గ్రామ్స్
మెంతులు- 100 గ్రామ్స్
ఎండు ఉసిరి- 100గ్రామ్స్
కరివేపాకు రెమ్మలు 4 – 5
తయారీ విధానం: ఉల్లిపాయలను ముక్కలుగా చేసి అందులో 1 లీటర్ నీళ్లు పోసి సన్నని మంటపై బాగా మరిగించాలి. ఆ నీటిని వడ కట్టి పక్కన పెట్టాలి.
తరువాత కుంకుడుకాయలు, షికాయ మరియు ఎండు ఉసిరిని ముక్కలుగా చేసి మెంతులు కలిపి పక్కన పెట్టిన ఉల్లిపాయ నీటిలో రాత్రంతా బాగా నానబెట్టాలి.
మరుసటిరోజు ఈ మిశ్రమాన్ని 20 నుంచి 30 నిమిషాలవరకి మీడియం ఫ్లేమ్ లో బాగా మరిగించాలి. ఇది మరిగేటపుడు ఇందులో కరివేపాకు కూడా వేయాలి.
వీటిలో ఇంకా మందార ఆకులు, వేపాకు కూడా కలుపుకోవచ్చును . ఇది బాగా మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా చల్లార్చాలి.
ఆ నీటిని తరువాత వడగట్టి ఒక గాజు సీసాలో పోసి ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకోవాలి. ఇది 15 నుంచి 30 రోజులవరకు నిల్వ ఉంటుంది.
గమనిక: స్నానం చేసే ముందు దీనిని తలకు బాగా పట్టించి కాసేపు ఆగక తలస్నానం కూడా చేయాలి. ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు చేయాలి.
ప్రయోజనాలు:
జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
తలలో ఎలర్జీ, ఫుల్లు, పేళ్లు తగ్గిపోతాయి.
జుట్టు చాల మెత్తగా, సిల్కీ గ తయారవుతుంది.
చిట్లిన జుట్టును కూడా బాగుచేస్తుంది.
చుండ్రు కూడా తగ్గిపోతుంది.
Tags
Health Tips