నల్ల బియ్యం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

 

Health benefits of black rice

నల్ల బియ్యం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

 

ఆసియా ఖండంలోని ప్రజలకు ప్రధాన ఆహారం వరి , బియ్యంలో తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్, నల్ల బియ్యం ఎర్ర బియ్యం ,బాస్మతి బియ్యం ఇలా అనేక రకాలున్నాయి

  పూర్వం రాజుల మాత్రమే నల్ల బియ్యం తినేవారు, భారతీయుల రోజు వారి ఆహారం బియ్యం . భారతదేశంలో అత్యధిక శాతం పంట భూములలో వరి ఎక్కువ గా పండిస్తున్నారు. ప్రపంచంలో అధిక జనాభా వరి ఆహారం  అన్నమే గా తీసుకుంటారు .  మాములుగా మనం తినే బియ్యం తెలుపు రంగులో ఉంటాయి .  మీరు ఎప్పుడైనా నల్ల రంగు బియ్యం గురించి విన్నారా .  తెల్ల బియ్యం కాకుండా, నల్ల కలరు బియ్యం మన దేశంలో కూడా పండిస్తున్నారు . అయితే  వాటి తినేవారు  చాలా తక్కువ..

 

 

Health benefits of black rice

నల్ల బియ్యం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

ఇక్కడ నల్ల వరి సాగు తెల్సుకుందాం 

అయితే నల్ల వరి మొదట ఎక్కడ  పుట్టినది అంనేదానికి  ఎక్కడ పెద్దగా ఆదారాలు లేవు .. ఇది ఉత్తర భారతదేశంలోని కొన్నిప్రదేశాల్లో పురాతన పంటగా ఇప్పటకీ పండిస్తున్నట్లుగా ఆధారాలున్నాయి .  పాత కాలంలో ధనవంతలు మాత్రమే ఈ నల్లటి వరిని తినేవారు ఆ తర్వాత ఇప్పుడు సామాన్యులు కూడా ఆహారం తింటున్నారు. నల్ల బియ్యం ధర ఇప్పుడు మార్కెట్లలో కిలోకు 250 రూపాల నుండి ప్రారంభమవుతుంది. అయితే, మన దేశంలో నల్ల వరి సాగు చాలా తక్కువగా ఉంది. ఇది అన్ని షాపులలో అందుబాటులో లేదు. మీరు నల్ల బియ్యం తినాలనుకుంటే Online షాప్ ల నుండి కొనుగోలు చేయొచ్చు .

?ఇప్పుడు తెలంగాణ లో నల్ల వరి సాగు …

 ?నల్ల బియ్యం (బ్లాక్ రైస్) గురించి  ఎక్కువ మంది కి తెలవదు ,  సాధారణ తెల్ల బియ్యం కన్నా నల్ల బియ్యం చాలా ఆరోగ్యకరమైనవి. నల్ల బియ్యం (బ్లాక్ రైస్) లో యాంటీ ఆక్సిడెంట్లు అధిక సంఖ్య లో ఉంటాయి . నల్ల బియ్యం (బ్లాక్ రైస్) శరీరం లోని కలుషితమైన మూలకాలను తొలగిస్తాయి .  నల్ల బియ్యం కూడా అనేక వ్యాధులకు తగ్గిస్తుంది . నల్ల బియ్యం (బ్లాక్ రైస్)  లో ఆంథోసైనిన్ ఉంది, ఇది గుండెకు యొక్క అనేక రకాల వ్యాధుల నుండి  రక్షించడంలో మంచి పాత్ర పోషిస్తుంది.  మిమ్మల్ని గుండెపోటు రాకుండా  కాపాడుతుంది.

Health benefits of black rice

నల్ల బియ్యం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

నల్ల బియ్యం అనేక రకాల వ్యాధులు రాకుండా కాపాడుతుంది 

?బరువును తగ్గించడంలో నల్ల బియ్యం (బ్లాక్ రైస్) చాలా ఉపయోగపడుతుంది . ఎందుకంటే తెల్ల బియ్యం కన్నా చాల కొవ్వు తక్కువ. నల్ల బియ్యం (బ్లాక్ రైస్) లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వలన  కాలేయం  చాలా ఆరోగ్యంగా ఉంటుంది . అలాగే కాలేయంలో ఉండే హానికరమైన వ్యర్ధాలను శుభ్రం చేస్తుంది. నల్ల బియ్యంలో ఉండే  ఆంథోసైనిన్ అనే ఎంజైమ్ రక్తంలోని ( షుగర్ ) చక్కెరను తగ్గిస్తుంది . 1 కిలో నల్ల బియ్యంలో 45 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను చక్కగా పని చేయడానికి సహాయపడుతుంది. అలాగే కంటి సమస్యకు చాలా మేలు చేస్తాయి .

Health benefits of black rice

నల్ల బియ్యం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

 ముఖ్యంగా (బ్లాక్ రైస్) నల్లబియ్యాన్ని రాజులు  తినడానికి మాత్రమే రైతులు పండించేవారని చరిత్రకారుల కథనం. మనదేశంలో తక్కువ సాగు చేస్తున్న ఈ (బ్లాక్ రైస్) నల్ల బియ్యం గురించి చాలా కొద్ది  మందికి తెలుసు.

నల్ల బియ్యం ఎంతో నల్లగా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ఇవి ఎక్కువగా పండిచరు. అందుకే వీటిని ఫర్ బిడ్డెన్ రైస్ లేదా రాజుల బియ్యం  (చక్రవర్తుల బియ్యం) అని పిలుస్తారు.

పూర్వ కాలంలో నల్ల బియ్యం ఎక్కువగా చక్రవర్తులు వారి కుటుంబ సభ్యులు తినడానికి ఇష్టపడేవారు  ఇతరులెవ్వరు దీన్ని తినరాదని నియమం ఉండేది. దీన్ని తినడం వల్ల వారి ఆరోగ్యం  మంచిగా ఉండి చాలాకాలం కాలం జీవిస్తారని నమ్మేవారట.

 నల్ల బియ్యం మణిపూర్ లో పండిస్తారు. అక్కడ ఈనల్ల బియ్యం ను చకావో అముబి అని పిలుస్తారు. మణిపురీ భాషలో చకావో అనగా నోరూరించేది అని అర్థం. అముబి అనగా నల్లనిది అని అర్థం. నలుపుగా ఉన్న ఈ బియ్యం  నోరూరించే రుచితో ఉండేది కాబట్టి దీనికి ఆ పేరును పెట్టారు.

 

 

నల్ల బియ్యంలోని రకాల వివరాలు 

?1. బ్లాక్ జపనికా రైస్

?2. బ్లాక్ గ్లుటినస్ రైస్

?3. ఇటాలియన్ బ్లాక్ రైస్

?4. థాయ్ బ్లాక్ జాస్మిన్ రైస్

?5. మణిపూర్ బ్లాక్ రైస్

 అన్ని రకాల బియ్యం తో పోల్చితే  నల్ల బియ్యం చాలా పోషకాలను కలిగి ఉంటాయి .

ప్రతి 100 గ్రాముల బియ్యంలో ఇవి ఉంటాయి 

 

 ???? పాలిష్ అయిన తెల్ల బియ్యంలో  ????

? 6.8 గ్రాముల ప్రొటీన్,

? 1.2 గ్రాముల ఐరన్,

 ? 0.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

 ????    బ్రౌన్ రైస్ లో  ????

? 7.9 గ్రాముల ప్రొటీన్,

? 2.2 గ్రాముల ఐరన్,

? 2.8 గ్రాముల ఫైబర్ ఉంటాయి.

 ????   ఇక రెడ్ రైస్ లో ????

 ? 7.0 గ్రాముల ప్రొటీన్,

? 5.5 గ్రాముల ఐరన్,

? 2.0 గ్రాముల ఫైబర్ ఉంటాయి.

???? నల్ల బియ్యంలో  ????

? 8.5 గ్రాముల ప్రొటీన్,

? 3.5 గ్రాముల ఐరన్,

? 4.9 గ్రాముల ఫైబర్ ఉంటాయి.

? నల్ల బియ్యం ప్రయోజనాలు?

* నల్ల బియ్యం లో ఇన్ని రకాల పోషకాలు ఉన్నాయి 

? 1. ఫైబర్,

? 2. 18 రకాల అమైనో యాసిడ్లు

? 3. కెరోటిన్,

? 4. యాంథో సైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్లు

? 5. విటమిన్ ఇ,

? 6. నియాసిన్,

? 7. క్యాల్షియం,

? 8. మెగ్నీషియం,

? 9. ఇనుము,

? 10. జింక్

? 11. విటమిన్‌–బి

? 12. ఐరన్

వంటివి ఎక్కువగా ఉంటాయి.

నల్ల బియ్యం తినడం వలన శరీర మార్పులు 

నల్ల బియ్యంతో ప్రయోజనాలివీ.. 

? డయాబెటిస్ (షుగరు వ్యాధి ) ని తగ్గిస్తుంది .

? మధుమేహం మరియు క్యాన్సర్, గుండె జబ్బులను తగ్గిస్తుంది .

 ?  నల్ల బియ్యంలో ఉన్న ఆంకోసైనిన్స్‌ అనే ఎంజైమ్ లు యాంటీ ఆక్సిడెంట్లు  పనిచేస్థాయి .

? రోగ నిరోధక ఎంజైములను వేగవంతం చేస్తుంది.

 ? శరీరంలో అనవసర కొవ్వును తగ్గిస్తుంది .

? శరీర బలహీనత ను తగ్గిస్తుంది .

? శరీరానికి సంభందిచిన ఖనిజ విలువలు అధికంగా చేస్తుంది .

?  ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల కణాలను శుభ్రపరుస్తుంది.

?  శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ ని ఇది కంట్రోల్లో ఉంచుతుంది.

?  ఫైబర్ ఎక్కువగా ఉంటుంది .

?  క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

?  అల్జీమర్స్ మతిమరుపు వ్యాధిని తగ్గిస్తుంది .

?  ఒబేసిటీ సమస్యను కూడా తగ్గిస్తాయి.

?  బరువు వేగంగా తగ్గే వీలుంటుంది.

?  కంటి వ్యాధులను నయం చేస్తాయి.

?  ఈ ఆంథో సైనిన్లు క్యాన్సర్ రాకుండా కాపాడతాయి.

?  ముఖ్యంగా మహిళల్లో  వచ్ఛే క్యాన్సర్ వ్యాధి తగ్గుతుంది  .

?  ఈ బియ్యం గంజిని తలకు పట్టిస్తే వెంట్రుకలు చాలా బలంగా పెరుగుతాయి.

?  ముఖానికి మాస్క్ గా వేసుకుంటే మచ్చలు మొటిమలు తగ్గిపోతాయి.

?  నరాల బలహీనత తగ్గుతుంది

?  మసాజ్ చేసేందుకు కేరళ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.

?  ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి.

?   ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

?  లివర్ డీటాక్సిఫికేషన్ లో కూడా ఈ బియ్యం తోడ్పడుతుంది.

? అధిక రక్త పోటు సమస్య నుంచి కూడా ఇది మనల్ని కాపాడుతుంది.

? ఆస్తమా మరియు జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది .

?  శాఖాహారులకు ప్రోటీన్లను ఇచ్చే మంచి ఆహారం నల్ల బియ్యం.

?  ఇందులో అనేక పోషక విలువలు, ఔషధ గుణాలు ఉంటాయి .

నల్ల బియ్యం (బ్లాక్ రైస్) తింటే చాలా లాభాలు ఉన్నాయి .

నల్ల బియ్యం పండించడానికి పెట్టుబడీ చాలా తక్కువ 

?నల్ల బియ్యం పండిచడానికి పెట్టుబడి కూడా చాలా తక్కువే అవుతుంది.

? మాములుగా రకం వరికి ఎకరానికి రూ.30 వేల రూపాయల వరకు పెట్టుబడి అవసరం కాగా నల్ల బియ్యంకు రూ.20 వేల రూపాయలు సరిపోతుంది.

?మామూలు వరికి రసాయన మందులు , క్రిమిసంహారక మందులు విధిగా వాడాలి .

? కానీ నల్ల బియ్యంకు గోఆధారిత జీవామృతం, గోమూత్రం, ఆవుపేడ, ద్విదళ గింజలతో తయారు చేసిన ఎరువును వినియోగిస్తారు.

? తెగుళ్లకు ఆస్కారం ఉండదు. పురుగుమందులను పిచికారీ చేయాల్సిన అవసరం రాదు.

?. చౌడు నేలలు తప్ప మాగాణి నేలల్లో ఈ పంటకు వీలవుతుంది.

? సాధారణ వరి 120–130 రోజుల్లో పంట చేతికి వస్తుంది

? నల్ల బియ్యం 140–150 సమయం లో పంట చేతికి వస్తుంది .

?  మామూలు వరి పంటల కంటే దీనికి చీడ పీడల బాధ చాలా తక్కువ ఉంటుంది .

?    ఈ పంట పండించడం వల్ల భూసారం కూడా దెబ్బతినదు.

వీటిలో కర్పుకవని, బర్మా బ్లాక్, కాలాభట్‌ రకాలను పండిస్తున్నారు.

బ్లాక్ రైస్ నల్ల బియ్యం ఆహారం గా తినడం వల్ల కలుగు  ప్రయోజనాలు:

 తెలంగాణల్లో జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల లో కూడా ప్రయోగాత్మకంగా నల్ల బియ్యం వరి సాగు జరుగుతోంది. పూర్వం చాలా వరకు రాజ కుటుంబాలు మాత్రమే ఈ నల్ల బియ్యం వినియోగించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది.అలాగే చైనా లో ఎక్కువగా నల్ల బియ్యం ఆహారం గా తీసుకుంటారు , నిజానికి ఈ (బ్లాక్ రైస్) నల్లబియ్యం విత్తనాలు ఇండియా నుండే బౌద్ధభిక్షువుల ద్వారా చైనాకు వెళ్ళవచ్చు .

 దంబరసాలి నల్ల బియ్యం రకం  అలాగే  నజరాబాద్ నల్ల బియ్యం రకాల ఆకులు వరి పొలాల్లో అగ్నిజ్వాలల్లా ముదురు గోధుమ రంగులో మెరుస్తూ పెరుగుతాయి . ధాన్యం బంగారు రంగులో ఉంటుంది.

 నైరెమిడా నల్ల బియ్యం చాలా నలుపు రంగులో ఉంటాయి ..

 నల్ల బియ్యం బ్లాక్ రైస్ యొక్క విశిష్టత ఏమిటనగా , వరి కాండం, ఆకులు అన్నీ నలుపు  రంగులోనే ఉంటాయి.

కాలబటి రకానికి చెందిన ఊక (బుడిద) రంగులో ఉండి , బియ్యం నల్ల రంగు లో ఉంటాయి .  చక్-హావో ఆకులు, ఉక లేత నలుపు రంగులో ఉంటాయి. ఈ  రకం బియ్యం ముదురు నలుపు రంగులో  గా ఉంటాయి.

బర్మా బ్లాక్ నల్ల బియ్యం రకం మొక్కలు ఆకుపచ్చగా కనిపిస్తాయి, బియ్యం నలుపు గా ఉంటాయి . ఈ బర్మా బ్లాక్ బియ్యం   జిగురు లా ఉండి మంచి సువాసన కలిగి ఉంటాయి . ఈ రకాల బియ్యం తో తయారు చేసిన తీపి వంటకాలు మంచి రుచిగా ఉంటాయి. ఈ రకాలు ఎంతో సుగంధమైనవి కాబట్టి వంటలలో ఏలకులు వాడవలసిన అవసరం లేదు .

నల్ల బియ్యం తో అన్నం వండేటప్పడు గంజి తీయాలి . జుట్టు కుదుళ్లకు  ఆ  గంజి ని పట్టిస్తే జుట్టు బాగా పెరుగుతుంది. తల వెంట్రుకలు ఉడి పోకుండా ఉంటాయి .  నల్ల బియ్యం గంజిని ముఖానికి పట్టించి కొద్ది సేపటి తర్వాత చల్లటి నీటి తో కడుక్కోవాలి . అలా  చేయటం వలన ముఖం పై ఉన్న మొటిమలు వాటి తాలూకు మచ్చలు పోతాయి అలాగే ముఖం ప్రకాశవంతంగా తయారు అవుతుంది .

 ?5. మణిపూర్ బ్లాక్ రైస్

 ?మణిపూర్ బ్లాక్ రైస్

?కొంచం పొడుగుగా ఉంటాయి

?120 రోజుల పంట సమయం

?  యాసంగి  మరియు రబీ  పంట పండుతుంది

?నాటు పెట్టిన పది రోజుల వరకు పింక్ కలర్ లో వరి ఉంటుంది

?10 రోజుల తరువాత గ్రీన్ మరియు బ్లాక్ కలర్ లో వరి ఉంటుంది

?వడ్లు నల్ల గా ఉంటాయి

?ఎకురానికి 8 నుండి  14 క్వింటాలు పండుతాయి

?ఎరువులు ఎకురానికి 3 ట్రాక్టర్లు పశువుల పేడ లేదా గొర్రె ఎరువు  సరిపోతుంది

?పురుగు మందు  జీవామృతం వాడవలెను

?

 ? ??పూస బాస్మతి విత్తనాలు మావద్ద ఉన్నాయి

రబీ ( వానాకాలం ) నాటు వేయటకు ఉన్నాయి కాల్ 9666046669

అడ్రస్ :- ఏడునూతుల గ్రామం

మండలం :- కొడకండ్ల

జిల్లా :- వరంగల్  506222

తెలంగాణ రాష్టం

 

 

 

Previous Post Next Post

نموذج الاتصال