దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా Lyrics – దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా
గణేష్ భక్తి పాటలు లిరిక్స్
దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా | |
దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా | |
జై వినాయక భక్తి పాటలు లిరిక్స్
దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా గణేష్ భక్తి పాటలు లిరిక్స్
జై జై జై జై గణేశ జై జై జై జై
జై జై జై జై వినాయక జై జై జై జై
జై జై జై జై గణేశ జై జై జై జై
జై జై జై జై వినాయక జై జై జై జై
దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా
నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా
తండ్రి వలే ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ..
దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా
నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ…
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా
పాపం కొండంత నీ పెనుభారం
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా
ఓ.. హో హో జన్మ ధన్యం
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా
పాపం కొండంత నీ పెనుభారం
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా
ఓ.. హో హో జన్మ ధన్యం
అంబారిగా ఉండగల ఇంతటి వరం.. అయ్యోర అయ్య
అంబాసుతా ఎందరికి లబించురా.. అయ్యోర అయ్య
ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా
దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా
నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళాకోళం
ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా
ఏమైపోయింది గర్వం
అరె శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళాకోళం
ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా
ఏమైపోయింది గర్వం
త్రిమూర్తులే నిను గని తలొంచరా.. అయ్యోర అయ్య
నిరంతరం మహిమను కీర్తించరా.. అయ్యోర అయ్యా
నువ్వెంత అనే అహం నువ్వే దండించరా
దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా
నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
అరె రె రె.. పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా
తండ్రి వలే ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ..
హే దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా
నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా Watch Video
వాతాపి గణపతిం.. బుజ్జి బుజ్జి గణపయ్య తెలుగు భక్తి పాటలు
‘మహా గణపతిం..’ బుజ్జి బుజ్జి బొజ్జ గణపయ్య పాటలు
Shiva Shiva Murthivi Gananadha | 2023 Lord Ganesh Songs Telugu | Latest Telugu Devotional Songs
Ganesh Chaturthi ( Vinayaka Chaturthi)Telugu Special Songs – Jukebox