అనంతపద్మనాభుని నోము పూర్తి కథ,The Complete Story of Anantha Padmanabha Nomu

 

 

              పూర్వకాలంలో ఒక గ్రామంలో నిరుపేద దంపతులుండేవారు.  వారికొక కుమార్తె వుండేది ఆమెను అల్లారుముద్దుగా పెంచి చదువు సంధ్యలు నేర్పించారు.  యుక్త వయస్సు వచ్చిన కుమార్తెకు వివాహం చెయ్యాలని కాలినడకన దూర తీర గ్రామాలకు వెళ్లి చక్కని వరుణ్ణి నిశ్చయించారు.  వివాహం చేసి ఆమెను అత్తా వారింటికి సాగనంపారు.  కుమార్తెకు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు వుల్లది ఏదైనా ఇచ్చి పంపించమని భార్యకు చెప్పాడు.  ఆ ఇల్లాలు ఇంట్లో వున్న కాస్త వరిపిందిని మూటగట్టి కూతురుకిచ్చింది.

 

 

 

అనంతపద్మనాభుని నోము పూర్తి కథ,The Complete Story of Anantha Padmanabha Nomu

 

            నవవదూవరులిద్దరూ వారి స్వగ్రామమునకు కాళీ నడకన బయలుదేరారు.  వెళ్తూ మార్గ మధ్యలో సంధ్య వార్చుకోవడానికి ఆమె భర్త చెరువుకు వెళ్ళాడు.  ఈ లోపున నవవధువు ఆ చుట్టూ పక్కల తిరుగుతూ కొందరు పూజచేసుకుంటూ వుండడం చూసింది.  వారి దగ్గరకు వెళ్లి ఆ పూజ వివరాలను అడిగి తెలుసుకుంది.  తన దగ్గర వున్న పిండితో పద్మనాభుని బొమ్మను చేసి చెట్టు మొదలు దగ్గర ప్రతిష్టించుకుని భక్తితో పూజ చేసింది.  సంధ్య వార్చుకుని భర్త వచ్చే సరికి ఆమె పూజ ముగించుకుంది.  భర్త తోపాటు గ్రామానికి బయలు దేరింది మార్గ మధ్యలో వారికి ఆకలికాగా ఆమె భర్త తన అత్తా గారిచ్చిన పిండితో తినడానికి ఏమైనా చెయ్యమని అడిగాడు.  అందుకామె పిండిలేదని బొమ్మను చేసి పూజచేసుకున్న వైనాన్ని చెప్పి చేతిని గల తోరాలను సాక్ష్యంగా చూపింది.  అతడు విసుగుకొని ఆతోరంతీసిపారేయ్యమన్నాడు.  ఎదురు చెప్పలేక చేతికున్న దారపు పోగులను తీసివేసింది.

                అందుమీదట నోము వుల్లన్ఘిన్చినట్లయింది.  వారి ప్రయాణము కాదు  దుర్భరమైంది.    ఆకలి ఎక్కువైపోయింది. జవసత్వాలు సన్నగిల్లి పోయాయి.  యేమిటిదని ఆ వరుడు పరిపరి విధాల పరితపించాడు.  ఇదంతా తోరం తీసి పారేసి పద్మనాబుని వ్రత ఉల్లంఘన చేయడం వల్లనే జరిగి ఉంటుందని అనుకుని అనుమతిస్తే మళ్ళీ ఆ వ్రతం మొదలు పెట్టి భక్తి శ్రద్దలతో పూర్తి చేస్తాను మన బాధలు తొలగి పోతాయి అన్నది.  అందుకు అతడు అంగీకరించగా ఆ వధూవరులు మరింత భక్తి శ్రద్దలతో స్వామికి నివేదించవలసిన పూజాద్రవ్యాలను పూజా విధి విధానాలను అనుసరించి మనసున తలచు కుంటూ అనంత పద్మనాభుని వ్రతం చేసారు.  స్వామీ అనుగ్రహం కలిగి ఆ వ్రత మహిమ వల్ల ప్రయాణం సుఖంగా సాగింది.  చెట్లు ఫలాలు లభించగా వాటిని తిని ఆకలి తీర్చుకున్నారు.  ఇంటికి చేరుకునేసరికి రాజుగారి ఆస్థానము నుండి రాజ పురోహితునిగా రావసిందని ఆహ్వానము వచ్చింది.  అటుపై ఆ దంపతులకు జీవితం ఆనందంగా సాగింది.

ఉద్యాపన:-

వార్షికంగా ఈ నోముకన్యాలు, వివాహిత వనితలు స్సుసుకోదగినది.  పిండితో దామోదరుని బొమ్మను చేసి ప్రీతితో పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ధూప దీప నైవేద్యాలతో పూజించాలి.  ఆ రోజున ఒక సద్బ్రాహ్మనునికి భోజం పెట్టి దక్షిణ తాంబూలాలివ్వాలి.

Tags: anantha padmanabha swamy,anantha padmanabha vratham,doubts of anantha padmanabha swamy vratam,anantha padmanabha swamy vratham,anantha padmanabha swamy vratham telugu,anantha padmanabha swamy vratha vidhanam,anantha padmanabha sesha sarpam,anantha padmanabha swamy vratha katha,anantha padmanabha swamy vratham vidhanam,making of anantha koti padmanabha vathhulu,anantha padmanabha swamy temple history,anantha padmanabha swamy temple