సగ్గుబియ్యం వలన కలిగే ప్రయోజనాలు, పోషక విలువలు, మోతాదు మరియు దుష్ప్రభావాలు
మీరు ఆహారప్రియులైతే, వంటగదులలో కేవలం పండ్లు, కూరగాయలు మరియు మసాలా దినుసులు మాత్రమే ఉండవని మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. వాస్తవానికి వంట గదులలో ప్రపంచం నలుమూలల నుండి లభించే వివిధ ఆహార పదార్దాలు కూడా ఉంటాయి.
సగ్గుబియ్యం అనేది చాలా భారతీయ ఇళ్లలో వినిపించే ఒక సాధారణ పేరు. ఇది చెట్లకు పెరగదని మీకు తెలుసా? ఇది మొక్క యొక్క విత్తనం లేదా పండు కాదు. ఇది కర్రపెండలం దుంపల నుండి వచ్చే ఒక రకమైన పిండి పదార్ధం . సగ్గుబియ్యంలో కొవ్వులు మరియు ప్రోటీన్లు ఉండవు. అవి మాత్రమే కాదు, దీనిలో గ్లూటెన్ కూడా ఉండదు మరియు గ్లూటెన్ అసహనం ఉన్నవారికి సురక్షితమైనది. ఈ రోజుల్లో సగ్గుబియ్యం ఇంత ప్రముఖంగా మారడానికి ఇది కూడా ఒక కారణం.
ఇది ఫైబర్ మరియు కేలరీలతో సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి మీరు దానిని ఏ విధంగా తీసుకోవాలనుకుంటున్నారో అనే దాన్ని బట్టి, బరువు పెరగడానికి లేదా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. సగ్గుబియ్యంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మరియు మలబద్దకాన్ని నివారించడానికి బాగా సహాయపడుతుంది . ఇందులో ఖనిజాలు మరియు విటమిన్లు కూడా ఉంటాయి, అవి వివిధ శరీరం జీవ ప్రక్రియలకు బాగా సహాయపడతాయి.
కర్రపెండలం మొక్క ఉష్ణమండల వాతావరణంలో పెరిగే ఒక శాశ్వత మొక్క. ఇది పాక్షికంగా కలప కాండం కలిగి ఉంటుంది . ముదురు ఆకుపచ్చ ఆకులు కూడా ఉంటాయి. అవి ఒకదానికొకటి ఎదురెదురుగా పెరుగుతాయి. ఆకు కాడ మరియు కొమ్మ రెండూ ప్రత్యేకమైన ఎరుపు నీడను (రంగును) కలిగి ఉంటాయి. ఇది కర్రపెండలం మొక్కను గుర్తించే లక్షణాలలో ఒకటిగా ఉంటుంది. కర్రపెండలం మొక్క 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది మరియు దాని దుంపలు కాండం యొక్క అడుగున నుండి పెరుగుతాయి. ఈ దుంపలు కర్రపెండలం మొక్క యొక్క తినదగిన భాగాలు, వీటి నుండి స్టార్చ్ (పిండి) తీయబడుతుంది.
మీకు తెలుసా?
కర్రపెండలం కొన్ని ఆఫ్రికన్ దేశాలలో ప్రధానమైన ఆహారాలలో ఒకటి.
ఈ వ్యాసం, కర్రపెండలం ఎలా ఉపయోగించబడుతుందో మరియు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలియజేయబడుతుంది.
అయితే మొదట, కర్రపెండలం మొక్క యొక్క కొన్ని ప్రాథమిక విషయాలను తెలుసుకుందాము
- శాస్త్రీయ నామం: మనిహోట్ ఎస్కులెంటా (Manihot esculenta)
- కుటుంబం: యుఫోర్బియాసి (Euphorbiaceae)
- సాధారణ నామం: కాసావా, యుకా, కర్రపెండలం, బ్రెజిల్ ఆరోరూట్
- సంస్కృత నామం: తరుకాండ
- ఉపయోగించే భాగాలు: వేర్లు (దుంపలు)
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: వాస్తవానికి, అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాలకు చెందినది, బ్రెజిల్, వెస్టిండీస్ మరియు ఆఫ్రికాలో విస్తృతంగా పెరుగుతుంది. భారతదేశంలో, కర్రపెండలం మొక్క ప్రధానంగా కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో బాగా పండిస్తారు.
సగ్గుబియ్యం పోషక వాస్తవాలు
సగ్గుబియ్యం ఆరోగ్య ప్రయోజనాలు
- బరువు తగ్గడానికి సగ్గుబియ్యం
- మధుమేహులకు సగ్గుబియ్యం
- చంటి పిల్లలకు మరియు శిశువులకు సగ్గుబియ్యం ప్రయోజనాలు
- జీర్ణక్రియ కోసం కర్రపెండలం
- అధిక కొలెస్ట్రాల్ కోసం సగ్గుబియ్యం
- కాల్షియం మూలంగా కర్రపెండలం
- అధిక రక్తపోటు కోసం కర్రపెండలం
- ఇనుము వనరుగా కర్రపెండలం
- గర్భధారణ సమయంలో కర్రపెండలం
సగ్గుబియ్యం వంటకం మరియు ఉపయోగాలు
సగ్గుబియ్యం దుష్ప్రభావాలు
ఉపసంహారం
సగ్గుబియ్యం పోషక వాస్తవాలు
పిండి పదార్ధం (స్టార్చ్) కావడంతో, కర్రపెండలంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి, అయితే ఇందులో కొంత మొత్తంలో ఇనుము మరియు కాల్షియం కూడా ఉంటుంది.
యుఎస్‌డిఎ (USDA) ప్రకారం, 100 గ్రాముల ఎండు కర్రపెండలం ఈ కింది పోషక విలువలను కలిగి ఉంటుంది:
పోషకాలు :100 గ్రాములకు
శక్తి :358 కిలో కేలరీలు
కార్భోహైడ్రేట్లు :88.7 గ్రా
నీరు :11 గ్రా
ఫ్యాట్స్ :0.02 గ్రా
ప్రోటీన్ :0.19 గ్రా
మినరల్స్ :
ఐరన్:1.58 గ్రా
కాల్షియం:20 గ్రా
పొటాషియం:11 గ్రా
ఫాస్ఫరస్:7 గ్రా
సోడియం:1 గ్రా
సగ్గుబియ్యం ఆరోగ్య ప్రయోజనాలు
కర్రపెండలం దుంపకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, కానీ వాటిలో ముఖ్యమైనది దాని అధిక శక్తి మరియు తక్కువ కొవ్వు శాతం, ఇది ఉపవాసం మరియు డైటింగ్ చేసేవారికి ఒక అద్భుతమైన ఆహారంగా కూడా మారుతుంది. అలాగే, దీనిలో మంచి మొత్తంలో కాల్షియం మరియు పొటాషియం ఉంటుంది, ఇది ఎముకలను నిర్మించడానికి మరియు రక్తపోటును నిర్వహించడానికి అద్భుతమైన ఆహార వనరుగా పనిచేస్తుంది. సగ్గుబియ్యం యొక్క కొన్ని పోషక మరియు ఆరోగ్య ప్రయోజనాలు .
బరువుకు: సగ్గుబియ్యంలో కొవ్వు ఉండదు మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ లక్షణాలు బరువు తగ్గేందుకు బాగా సహాయం చేస్తాయి. అలాగే వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అతి వినియోగం బరువు పెరిగేందుకు కూడా కారణమవుతుంది.
మధుమేహం కోసం: ఫోర్టిఫె చేసిన సగ్గుబియ్యం ఇన్సులిన్ సెన్సటివిటీని బాగా పెంచుతాయని తద్వారా రక్తంలో అదనపు చక్కెరను తొలగిస్తామని కనుగొనబడింది. అలాగే ఇవి జీర్ణ క్రియ నెమ్మదిగా జరిగే చేస్తాయి అందువల్ల రక్తంలోకి ఒకేసారి అధికమొత్తంలో చక్కెర కూడా చేరదు.
శిశువులకు: కర్రపెండలం జీర్ణ ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా శిశువులకు అవసరమైన శక్తిలో దాదాపు 50% అందిస్తుందని అధ్యయనాలు కూడా తెలిపాయి. వీటిలో ప్రోటీన్లు మరియు ఇతర పోషకలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల ఇతర ప్రోటీన్ వనరులతో కలిపి దీనిని తీసుకోవడం చాల మంచిది.
జీర్ణక్రియకు: కర్రపెండలంలో ఉండే అధిక ఫైబర్ శాతం జీర్ణాశయ ఆరోగ్యానికి ఇది మంచి వనరుగా చేస్తుంది. ప్రేగులలో కర్రపెండలం జెల్ లా మారి మలాన్ని మెత్తగా చేసి మలబద్దకాన్ని తగ్గించడంలో బాగా సహాయం చేస్తుంది.
కాల్షియం వనరు: 100గ్రాముల కర్రపెండలంలో దాదాపు 20 mg ల కాల్షియం ఉంటుంది. ఇది మన రోజువారీ కాల్షియం అవసరాలు వేగంగా అందేలా చేస్తుంది. క్రమంగా కర్రపెండలం తీసుకోవడం అనేది ఆస్టియోపోరోసిస్ మరియు ఎముక ఫ్రాక్చర్స్ ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది.
ఐరన్ వనరు: సగ్గుబియ్యంతో కాల్షియం మాత్రమే కాక ఐరన్ కూడా ఉంటుంది.ఐరన్ శరీరంలో ఆక్సిజన్ సరఫరా చెయ్యడం, ఎర్రరక్త కణాలు మరియు హీమోగ్లోబిన్ నిర్మాణం వంటి అనేక ముఖ్య చర్యలలో బాగా పాత్రపోషిస్తుంది.
సగ్గుబియ్యం మరియు కర్రపెండలం రక్తపోటును నిర్వహించడం, ఫోలేట్ అనే ఖనిజాన్ని అందించడం వంటి చర్యలలో కూడా సహాయం చేస్తాయి.
బరువు తగ్గడానికి సగ్గుబియ్యం
సగ్గుబియ్యంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. మరియు దాదాపుగా కొవ్వు ఉండదు కాబట్టి ఇది ఒక అద్భుతమైన బరువు తగ్గించే ఏజెంట్ అనికూడా భావిస్తారు. ఇది ఆహారానికి ఎక్కువ మొత్తాన్ని జోడిస్తుంది మరియు జీర్ణక్రియ ప్రక్రియ వేగాన్ని కూడా తగ్గిస్తుంది . తద్వారా పేగులు పోషకాలను అధికంగా శోషించేలా/గ్రహించేలా చేస్తుంది. కాబట్టి, సగ్గుబియ్యం తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కూడా కలుగుతుంది. ఇది క్రమంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ, సగ్గుబియ్యంలో పోషక విలువలు అధికంగా ఉండవు. కాబట్టి, పోషకాలు సమృద్ధిగా ఉండే పండ్లతో దీన్ని కలిపి తినడం లేదా ఫోర్టిఫైడ్ సగ్గుబియ్యం తీసుకోవడం చాల మంచిది.
అయినప్పటికీ, సగ్గుబియ్యం/ కర్రపెండలం కేలరీల దట్టముగా ఉండే ఆహారం మరియు అధిక వినియోగం బరువు పెరగడానికి కూడా దారితీస్తుంది.
మధుమేహులకు సగ్గుబియ్యం
మధుమేహం అనేది ఒక ఎండోక్రైన్ రుగ్మత. దీనిలో ఇన్సులిన్ పనితీరులో లోపం కారణంగా శరీరం గ్లూకోజ్ జీవక్రియకు లోపం కూడా ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే సగ్గుబియ్యం, మధుమేహ రోగులకు మంచి ఎంపిక కాదని అనిపిస్తుంది. కర్రపెండలం మధుమేహంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని జంతు అధ్యయనాలు కూడా సూచిస్తున్నాయి. అయితే, ఫోర్టిఫైడ్ సగ్గుబియ్యం ఇన్సులిన్ సెన్సిటివిటీ ని మెరుగుపరుస్తుందని తద్వారా రక్తంలోని అదనపు చక్కెరను తీసుకుంటుందని కూడా కనుగొనబడింది.
అలాగే, జీర్ణక్రియను నెమ్మది చేయడం ద్వారా, రక్తప్రవాహంలోకి అకస్మాత్తుగా అధిక చక్కెరను రానివ్వకుండా చూస్తుంది.
అయినప్పటికీ, కర్రపెండలం యొక్క హైపర్ గ్లైసీమియాలో చర్య పై ఖచ్చితమైన ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి. మధుమేహ వ్యక్తుల కోసం సగ్గుబియ్యం యొక్క భద్రత మరియు వాడకాన్ని నిర్ధారించడానికి వైద్యుడిని ఒకసారి సంప్రదించడం చాలా మంచిది.
చంటి పిల్లలకు మరియు శిశువులకు సగ్గుబియ్యం ప్రయోజనాలు
కర్రపెండలం శిశువుల ఆహారంలో చేర్చే ఒక సాధారణ పిండిపదార్థం మరియు శిశువులలో శక్తికి మంచి వనరుగా పరిగణించబడుతుంది. ఇది జీర్ణక్రియ యొక్క ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా శిశువు యొక్క శక్తి అవసరాలలో దాదాపు 50% అందించగలదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అయితే, దీనిలో ప్రోటీన్లు మరియు ఇతర పోషక సమ్మేళనాలు చాలా తక్కువగా ఉంటాయి.
నైజీరియా పిల్లలపై చేసిన ఒక అధ్యయనం ప్రకారం, ఆహారంలో ఎటువంటి ప్రోటీన్ వనరులని చేర్చకుండా, క్రమముగా కర్రపెండలాన్ని తీసుకోవడం వల్ల అది దీర్ఘకాలిక పోషకాహార లోపానికి దారితీస్తుందని కూడా తెలిసింది.
కాబట్టి, గరిష్ట ప్రయోజనాలను పొందటానికి, ప్రోటీన్ అధికంగా ఉండే కొన్ని వంటకాలతో కలిపి కర్రపెండలాన్ని తీసుకోవడం చాలా మంచిదని సూచించబడింది.
జీర్ణక్రియ కోసం కర్రపెండలం
కర్రపెండలంలోని ఫైబర్ పరిమాణం జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడడంలో దానిని ఒక అద్భుతమైన ఆహారంగా చేస్తుంది. మొదట, ఇది ప్రేగులలో ఒక జెల్ను ఏర్పరుస్తుంది . మలాన్ని మృదువుగా చేస్తుంది, తద్వారా మలబద్దకం నుండి ఉపశమనం బాగా కల్పిస్తుంది. రెండవది, ఇది ప్రేగుల మైక్రోఫ్లోరా యొక్క పెరుగుదలను బాగా ప్రోత్సహిస్తుంది. తద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గోధుమ మరియు బార్లీ వంటి చాలా ధాన్యాల కన్నా ఇవి జీర్ణం కావడం చాలా సులభం. గ్లూటెన్ రహితంగా ఉండటం వలన, కర్రపెండలం గ్లూటెన్ అసహనం ఉన్నవారికి మరియు సిలియాక్ రోగులకు సురక్షితమైన ఎంపిక.
అధిక కొలెస్ట్రాల్ కోసం సగ్గుబియ్యం
సగ్గుబియ్యానికి మాములు బియ్యం కంటే చాలా తక్కువ లిపెమిక్ ఇండెక్స్ ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే సగ్గుబియ్యంలో కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి . హైపర్లిపిడెమియా (శరీరంలో అధిక కొవ్వు పరిమాణం ఉండడం) మరియు అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులు వీటిని తినడం సురక్షితం. దీనిలో ఫైబర్ కూడా ఉన్నందున, రక్తప్రవాహంలో నుండి అదనపు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో అది సహాయపడుతుంది. ఇది అథెరోస్క్లెరోసిస్ మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. కర్రపెండలం యొక్క హైపోకోలెస్టెరోలెమిక్ ప్రభావాలను నిర్ధారించడానికి ఎటువంటి అధ్యయనాలు జరుగలేదు. కాబట్టి, అధిక కొలెస్ట్రాల్ నిర్వహణలో ఈ పిండిపదార్ధం యొక్క ఉపయోగాలు మరియు భద్రత గురించి మరింత తెలుసుకోవడానికి పోషకాహార నిపుణుడిని సంప్రదించడం చాలా మంచిది.
కాల్షియం మూలంగా కర్రపెండలం
యుఎస్‌డిఎ ప్రకారం, 100 గ్రాముల సగ్గుబియ్యంలో 20 మి.గ్రా కాల్షియం ఉంటుంది. ఇది చాలా ఎక్కువ కాకపోయినా, ఖచ్చితంగా మీ రోజువారీ కాల్షియం అవసరాన్ని త్వరగా తీర్చడంలో బాగా సహాయపడుతుంది. ఎముకలు మరియు దంతాల అభివృద్ధికి మాత్రమే కాల్షియం అవసరం కాక, మెదడు సంకేతాలు (సిగ్నలింగ్) మరియు రక్తం గడ్డకట్టడంలో సహాయపడటంతో పాటు గుండె లయలు మరియు కండరాల సంకోచాలను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.
కాల్షియం చాలా వరకు మన ఎముకలు మరియు దంతాలలో నిల్వ చేయబడుతుంది . కాల్షియం లోపం ఉన్న సందర్భాలలో, మన శరీరం ఈ కణజాలాల నుండి కాల్షియంను బయటకు తీయడం ప్రారంభిస్తాయి.
కర్రపెండం యొక్క క్రమమైన వినియోగం ఆహారం నుండి రోజుకి అవసరమైన కొంత కాల్షియంను పొందేలా చేస్తుంది. తద్వారా ఆస్టియోపోరోసిస్ మరియు ఎముక ఫ్రాక్చర్స్ కలిగే ప్రమాదం బాగా తగ్గుతుంది.
అధిక రక్తపోటు కోసం కర్రపెండలం
ప్రసరించే రక్తం ధమనుల మీద కలిగించే శక్తి/బలం ద్వారా రక్తపోటు గుర్తించబడుతుంది. మన రక్తపోటును సాధారణ పరిధిలో (120/80 మి.మీ హెచ్‌జీ) ఉంచే అనేక అంశాలలో, సోడియం మరియు పొటాషియం మధ్య సరైన సమతుల్యత కూడా ఒకటి మరియు అది ప్రాధమిక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మన శరీరం నుండి అదనపు టాక్సిన్లు బయటకు తొలగిపోవడానికి ఈ ఖనిజాలు అవసరం మరియు సోడియం/పొటాషియం నిష్పత్తిలో ఏదైనా అంతరాయం శరీరంలో లవణాలు (సాల్ట్స్) పేరుకుపోవడానికి మరియు రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది.
అందుకే అధిక రక్తపోటు విషయంలో అధిక సోడియం ఉండడం అనేది మంచిదిగా పరిగణించబడదు. కర్రపెండలంలో మంచి మొత్తంలో పొటాషియం మరియు తక్కువ స్థాయిలో సోడియం ఉంటాయి, అందువల్ల కర్రపెండలం అధిక రక్తపోటు ఉన్నవారికి ఉత్తమ ఆహార ఎంపికగా కూడా ఉంటుంది.
ఇనుము వనరుగా కర్రపెండలం
కాల్షియం యొక్క గొప్ప వనరుగా మాత్రమే కాకుండా, సగ్గుబియ్యంతో కొంత మొత్తంలో ఐరన్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ రవాణాకు చాలా అవసరం. అదనంగా, ఐరన్ కు కొన్ని ఇతర విధులు ఉన్నాయి, అవి:
- ఎర్ర రక్త కణాలు మరియు హిమోగ్లోబిన్ ను ఏర్పరచడం.
- శ్వాసక్రియలో అవసరమైన ప్రోటీన్ల నిర్మాణం.
- రోగనిరోధక వ్యవస్థ యొక్క సరైన పనితీరు బాగు కోసం.
- న్యూరోట్రాన్స్మిటర్లు మరియు కొల్లాజెన్ యొక్క నిర్మాణం కోసం.
- ఐరన్ మన శరీరంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. , ఇప్పుడు సగ్గుబియ్యం మరియు పిండి ఐరన్ తో ఫోర్టిఫై చేసిన రూపంలో కూడా అమ్ముడవుతుంది.
గర్భధారణ సమయంలో కర్రపెండలం
గర్భిణీ స్త్రీకి పిండం కోసం తగిన పోషణను అందించడానికి చాలా ఖనిజాలు మరియు పోషకాలు అవసరం. ఫోలేట్ అటువంటి ఒక పోషకం. ఇది ఒక రకమైన విటమిన్ బి, ఇది పిండం నెర్వ్ ట్యూబ్ యొక్క సరైన అభివృద్ధికి అవసరం. గర్భిణీ స్త్రీకి రోజుకు 400 మి.గ్రా ఫోలేట్ అవసరం, ఇది సాధారణంగా సప్లిమెంట్ల ద్వారా అందించబడుతుంది. అలాగే, సాధారణ వ్యక్తులలో ఫోలేట్ లోపం మెగాలోబ్లాస్టిక్ అనీమియాకు కూడా దారితీస్తుంది. ఇది అలసట, బలహీనత, ఏకాగ్రత లేకపోవడం, తలనొప్పి మరియు శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలతో ముడిపడి ఉంటుంది. గోరు మరియు చర్మం రంగు పాలిపోవటం మరియు నోటి పూతల రూపంలో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
కర్రపెండలం, ఫోలిక్ ఆమ్లం యొక్క మంచి వనరుగా ఉండటం వలన ఈ సమస్యలను అరికట్టడానికి బాగా సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన మహిళల్లో సారవంతమైన వయస్సులో (fertile age) తగినంత ఫోలేట్ స్థాయిలు గర్భధారణ సమయంలో ఫోలేట్ స్థాయిని నిర్వహించడాన్ని కూడా సులభతరం చేస్తుంది.
సగ్గుబియ్యం వంటకం మరియు ఉపయోగాలు
కర్రపెండలం పిండి: సగ్గుబియ్యం గురించి మాట్లాడుతున్నపుడు, మనలో చాలామంది మృదువైన తెల్లటి ముత్యాల గురించే ఆలోచిస్తాము . ఇది పిండి రూపంలో కూడా లభిస్తుంది. కర్రపెండలం దుంపలను మెత్తగా పొడి చేయడం ద్వారా పిండిని సులభంగా తయారు చేసుకోవచ్చును . సాధారణ బ్రెడ్ మరియు పాన్ కేక్ తయారీలో మైదా పిండికి బదులుగా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే, ఇది వివిధ వంటకాల్లో బైండింగ్ ఏజెంట్‌గా ఉపయోగించబడుతుంది. దానికి స్వంత రుచి లేనందువల్ల, అసలు వంటకం యొక్క రుచిని ప్రభావితం చేయ్యదు. నీరు కలిపిన కర్రపెండలం పిండి జెల్ లాగ ఉంటుంది. కాబట్టి, దీనిని సూప్ లేదా గ్రేవీలలో గట్టిపరచే ఏజెంట్‌గా కూడా ఉపయోగించవచ్చు.
సగ్గుబియ్యం: సగ్గుబియ్యం చూడడానికి చిన్న తెల్లని బంతులలా ఉంటుంది, వీటిని సగ్గుబియ్యం కిచిడి మరియు పాయసం సహా వివిధ వంటకాల్లో కూడా ఉపయోగిస్తారు. మీరు ఇప్పటికీ సగ్గుబియ్యం పుడ్డింగ్ లేదా బబుల్ టీని రుచి చూడనట్లయితే, మీరు ఖచ్చితంగా చాలా విలక్షణ రుచులను ఇంకా ఆస్వాదించలేనట్లు అర్ధం.
ఒక కప్పు బబుల్ టీ యొక్క శుభమైన తయారీ విధానం ఇక్కడ ఉంది
- కొన్ని సగ్గుబియ్యం గింజలను నీటిలో కొన్ని గంటలు నానబెట్టండి. అవి వాటి తెలుపు రంగును వదిలి మరింత పారదర్శకమైన తెల్లదనంలోకి మారడాన్ని మీరు గమనించవచ్చును .
- బ్లాక్ టీ సిద్ధం చేయండి (మీకు నచ్చితే పాలు జోడించవచ్చు).
- గది ఉష్ణోగ్రతకు దానిని చల్లబరచండి.
- మీ ఇష్టానుసారం చక్కెరను కూడా జోడించండి.
- ఒక గ్లాసు టీలో నానబెట్టిన సగ్గుబియ్యం గింజలను వెయ్యండి.
- ఐస్ క్యూబ్స్ వేసి దానిని చల్లబరచండి.
- ఇప్పుడు ఆస్వాదించండి.
మీకు నచ్చితే చక్కెర స్థానంలో తేనెను కూడా జోడించవచ్చును .
సగ్గుబియ్యం దుష్ప్రభావాలు
- పిండి పదార్థాలు అధికంగా ఉన్నప్పటికీ, కర్రపెండలంలో ప్రోటీన్లు మరియు కొవ్వులు ఉండవు. కనుక ఇది పోషకాహారానికి మంచి మూలం కాదు.
- కర్రపెండలం మొక్కలో కొన్ని టాక్సిక్ సమ్మేళనాలు ఉంటాయి, అవి తీవ్రమైన లేదా దీర్ఘకాలిక టాక్సిసిటీని కలిగిస్తుంది. కాబట్టి, గుర్తించబడిన లేదా నమ్మదగిన వనరుల నుండి మాత్రమే సగ్గుబియ్యాన్ని కొనడం చాలా మంచిది.
- కర్రపెండలం ప్రాథమికంగా పిండి పదార్ధం, అంటే ఒక రకమైన చక్కెర. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉన్నప్పటికీ, అధ్యయనాలు చాలా విరుద్ధముగా ఉన్నాయి. కాబట్టి, మధుమేహం ఉన్నవారు కర్రపెండలన్ని తీసుకునే ముందు డాక్టర్‌తో మాట్లాడమని సిఫార్సు కూడా చేయబడుతుంది.
- కర్రపెండలం అలెర్జీ కలిగించని ఆహారం అయినప్పటికీ, లేటెక్స్ కు అలెర్జీ ఉన్నవారు కర్రపెండాలనికి కూడా క్రాస్ రియాక్టివిటీని చూపించవచ్చని అధ్యయనాలు కూడా సూచిస్తున్నాయి.
ఉపసంహారం
సగ్గుబియ్యం అనేది అనేది కర్రపెండలం మొక్క నుండి పొందే ఒక పిండిపదార్థం. ఇది గోధుమ పిండికి గ్లూటెన్ లేని ఒక ప్రత్యామ్నాయంగా వాడవచ్చు మరియు ఉపయోగించవచ్చును. దీనిలో కొవ్వులు మరియు ప్రోటీన్లు చాలా తక్కువ మొత్తాలలో ఉంటాయి. ఒక విలక్షణమైన రుచి మాత్రమే కాకుండా, బరువు నిర్వహణ మరియు శరీర కొలెస్ట్రాల్ నిర్వహణతో పాటుగా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. సగ్గుబియ్యం మీద ఎక్కువ పరిశోధనలు చేయబడలేదు కాని మీరు దాని ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆహారంలో ఉపయోగించే ముందు ఒకసారి పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది.
Tags
Health Tips