అయ్యప్పస్వామి అభిషేకాలు - వాటి ఫలితాలు
?☘️?️☘️?️☘️?️☘️?️☘️?️
*‘‘స్వామియే శరణం అయ్యప్పా !’’* అంటూ ముక్తకంఠంతో స్తుతించారు !
*‘‘అయ్యప్పా ! నీ దయవల్ల ఈ రోజు మేమందరం ఈ మహిమాన్వితమైన ఆలయాన్ని , ఇందులో వెలసి వున్న మణికంఠుని దర్శించగలిగాము ! నీకు మా కృతజ్ఞతలు ఏ విధంగా తెలుపుకోగలం ? తండ్రీ ! మా నమస్కారాలను స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చేయి !’’* అంటూ తమ వైపు చిరునవ్వుతో చూస్తూ నిలిచిన అయ్యప్పకు నమస్కరిస్తూ అన్నారందరూ .
*‘‘నిర్మల హృదయంతో చేసిన నమస్కారం చాలు నాకు ! మీ యోగక్షేమాలు సర్వదా గమనిస్తూనే వుంటాను ! మీరందరూ దీక్షాధారులై నా సన్నిధికి రావచ్చును పద్ధెనిమిది మెట్లను ఎక్కి ! మీకు సన్మార్గాన్ని చూపడానికి , కలి పురుషునీ , శనీశ్వరునీ ప్రభావానికి లోనుకాకుండా పుణ్యకార్యాలు ఆచరించి ఆత్మ సంయమనం పొందడానికి మండలదీక్ష ఎంతోగానో సహాయపడుతుంది , గుర్తుంచుకోండి ’’* అని చెప్పాడు మేఘ గంభీర స్వరంతో !
అందరూ భక్తిపూర్వకంగా తలలూపారు !
అయ్యప్ప లేచి *‘‘సెలవు భక్తులారా !’’* అని గబగబా మెట్లెక్కి వెళ్లి స్వామి విగ్రహం ముందు నిలిచాడు ! ఒక దివ్య జ్యోతి అయ్యప్ప నుండి విగ్రహంలోకి ప్రవేశించి అదృశ్యమైంది ! *‘‘అయ్యప్ప అదృశ్యమైనాడు ! చూస్తున్న వాళ్లందరూ ఒక్కసారిగా *‘స్వామియే శరణం అయ్యప్ప ! శరణం అయ్యప్పా ! మా నమ్మకం నిజమని నిరూపించావు ! మానవునిగా జన్మించి దుండగులందరినీ హతం కావించి మాకు శాంతిని ప్రసాదించిన అయ్యప్పవు ! నీకు కోటి కోటి ప్రణామాలు !’’* అంటూ నమస్కరించారు !
అయ్యప్ప విలీనం కావడంతో మరింత జాజ్వలమానంగా ప్రకాశిస్తూ దర్శనమిచ్చింది పరశురామునిచే ప్రతిష్ఠింపబడిన మణికంఠుని విగ్రహం !
స్వామి పూజా కార్యక్రమాలు నిర్వర్తించే పూజారులు విగ్రహాన్ని వివిధ ద్రవ్యాలతో పూజిస్తుంటే భక్తులందరూ మైమరచి చూడసాగారు ! అభిషేకాలు చేస్తూ అందువల్ల కలిగే ఫలితాలను కూడా తెలియచెప్పారు పూజారులు (తంత్రులు)
*?అభిషేకాలు - వాటి ఫలితాలు?*
పాలాభిషేకం - యశోవృద్ధి
పెరుగు అభిషేకం - వంశవృద్ధి కలుగుతుంది
కొబ్బరినీరు అభిషేకం - సత్సంతానం , మంచిబుద్ధి ప్రసాదిస్తుంది
తేనె అభిషేకం - సిరిసంపదలు , తరగని ఐశ్వర్యం కలుగుతాయి
చెరుకురసం - శాస్త్ర జ్ఞాన వృద్ధి కావిస్తుంది
పానకం - సంకల్ప సిద్ధి కలుగుతుంది
పంచామృత అభిషేకం (పాలు , పెరుగు , నెయ్యి , తేనె , పంచదార) - దీర్ఘాయుస్సు లభిస్తుంది.
శుద్దోదక స్నానం (మంచినీటితో అభిషేకం) - రెండూ అశ్వమేధ యాగఫలం ప్రసాదిస్తాయి
కుంభజల (కలశ జలం) - మానసిక శాంతిని అచంచలమైన భక్తిభావం మనస్సులో స్థిరమౌతాయి !
ఆవు నెయ్యితో అభిషేకం - ఇహ పర సౌఖ్యాలు లభిస్తాయి. ఐశ్వర్యభివృద్ధి కలుగుంది. అంతలో మోక్షప్రాప్తి !
గంథంతో అభిషేకం - పుత్రలాభం , స్వర్గభోగాలు లభిస్తాయి
భస్మంతో అభిషేకం - మహాపాపాలు నాశనం
పన్నీరుతో అభిషేకం - మనోబలాన్నిస్తుంది
పచ్చకర్పూరంతో అభిషేకం - ఋణబాధ విముక్తి కలుగుతుంది
శంఖం నీటితో అభిషేకం - రోగవిముక్తి , ఆరోగ్యాభివృద్ధి
సహస్రధార నీటితో అభిషేకం - ధనలాభం
ఫలాలతో అభిషేకం (ముక్కలుగా కోసి లేక రసం తీసి) - వ్యవసాయాభివృద్ధి , శతృవులపై విజయం
శుద్ధాన్నం (కొద్దిగా నెయ్యి వేసి వండిన అన్నం)తో - దేహకాంతి , సర్వ తీర్థాలలో పగటి పూట మాత్రమే అభిషేకం చేయవచ్చును. స్నానమాచరించిన పుణ్యఫలం లభిస్తాయి.
అన్ని రకాల పుష్పాలతో అభిషేకం - కుటుంబ సౌఖ్యం , పాపనివృత్తి లభిస్తాయి.
నవరత్నాలతో అభిషేకం - గ్రహదోహ నివారణ , శాంతి సౌఖ్యాలు కలుగుతాయి.
పూజారులు వచ్చినవాళ్ళకోసం స్వామి అభిషేకాలవల్ల కలిగే ఫలితాలు తెలియజేశారు ! విన్నవాళ్లందరూ భక్తి పారవశ్యంతో స్వామికి జరుగుతున్న పూజా కార్యక్రమాన్ని చూస్తూ మైమరచి భజన చేయసాగారు.
అయ్యప్పస్వామి భజన
పాలాభిషేకం స్వామికే
స్వామికే పాలాభిషేకం
నెయ్యాభిషేకం స్వామికే
స్వామికే నెయ్యాభిషేకం
పెరుగాభిషేకం స్వామికే స్వామికే పెరుగాభిషేకం
తేనే అభిషేకం స్వామికే -
స్వామికే తేనాభిషేకం
చందనాభిషేకం స్వామికే
స్వామికే చందనాభిషేకం
పూలాభిషేకం స్వామికే
స్వామికే పూలాభిషేకం
కట్టారదీపం స్వామికే
స్వామికే కర్పూర దీపం
స్వామియే శరణం అయ్యప్పా - అయ్యప్పా స్వామియే !!
భజనానంతరం కర్పూర హారతి చూపారు స్వామికి శ్రావ్యంగా జేగంటలు మ్రోగిస్తూ - మంగళ హారతి గానం చేశారు.
???????????
No comments
Post a Comment