_*?అయ్యప్ప చరితం - 43 వ అధ్యాయం?*_
?☘?☘?☘?☘?☘?
పరశురాముని చేత అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ !
ఒక్కసారిగా మంగళవాద్యాల ఘోష వినవచ్చింది !
*‘‘భక్తులారా ! ఇది సూర్యుడు మకరరాశిలోకి సంక్రమణం చెందుతున్న పుణ్యకాలం. అత్యంత శుభప్రదమైనది ! గ్రహాలు , నక్షత్రాలు శుభప్రదంగా వున్న ఈ సమయంలో మణికంఠుడు భూలోకవాసులకోసం అయ్యప్పస్వామిగా అవతరించబోతున్నారు ! అందరూ చేతులు జోడించి ఆ స్వామిని ధ్యానించండి ! గంభీర స్వరంతో పలికి అగస్త్య మహర్షి ధ్యాన శ్లోకాలు పఠిస్తుంటే అందరూ శ్రద్ధగా వినసాగారు !
*అయ్యప్ప స్వామి ధ్యాన శ్లోకాలు*
1. ఓంకారమూలం జ్యోతి స్వరూపం ;
పంబా నదీ తీర శ్రీభూతనాధం శ్రీ దేవదేవం చతుర్వేదపాలం ;
శ్రీధర్మ శాస్తారం మనసా స్మరామి !!
2. వందే మహేశ హరిమోహిని భాగ్యపుత్రం
వందే మహోజ్వలకరం కమనీయ నేత్రం
వందే మహేంద్ర వరదం జగదేక మిత్రం
వందే మహోత్సవ నటనం
మణికంఠ సూత్రం !
3. భూయేత్ ఉమాపతిం
రమాపతి భాగ్యపుత్రం
నేత్రోజ్వలత్ కరతల
భాసిరామం
విశ్వైక వపుషం
మృగయా వినోదం
వాంఛానురూప ఫలదం వరభూతనాథం !
4. భూయేత్ అపార కరుణా కరుణాధివాసం
భస్మాంగ రాగ సుఘమం ప్రియభక్త వశ్యం
భూతాధిపం భువనవశ్యతరావతారం
భాగ్యోదయం హరిహరాత్మజం
ఆదిమూర్తిం !!
అంటూ శ్రావ్యంగా ధ్యానించి అందరివైపు ప్రసన్నంగా చూస్తూ *‘‘స్వామి అయ్యప్ప అవతరించే శుభ ఘడియలు దగ్గర పడుతున్నాయి !
ఆ స్వామి మూలమంత్రాన్ని పలుకుతున్నాను ! అందరూ ఆ మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో గొంతెత్తి పలకండి ! ఆ స్వామిని శరణువేడండి !’’* అంటూ స్వామి మూలమంత్రాన్ని పలికారు అగస్త్య మహర్షి !
*స్వామి మూల మంత్రం*
*‘‘ఓం స్వామియే శరణం అయ్యప్ప !’’*
అందరూ భక్త్భిరిత హృదయాలతో *‘‘ఓం స్వామియే శరణం అయ్యప్ప’’* అని గొంతెత్తి అంజలి ఘటించి పలుకుతుంటే శబరిగిరి ఆ శరణు ఘోషతో ప్రతిధ్వనించింది. దేదీప్యమానంగా దీపాలన్నీ వెలిగి కాంతులు వెదజల్లుతున్నాయి ! అందరికీ ఆ దీపాల కాంతిలో గర్భగుడి మధ్యలో స్వర్ణకాంతులు వెదజల్లుతున్న రత్న ఖచిత పీఠం కానవచ్చింది !
పరశురాములవారు పట్టువస్త్రాలతో కప్పబడ్డ విగ్రహాన్ని రెండు చేతులతో జాగ్రత్తగా పట్టుకుని వస్తుంటే ఆకాశంనుండి దేవదుందుభులు మ్రోగసాగాయి.
ఆలయంలో అగస్త్య మహర్షి కబురందుకుని అక్కడకు చేరిన నారదాది మునులు , ఋషి గణాలు వేదాలు పఠిస్తున్నారు ! పుష్పవృష్టి కురుస్తున్నది
పరశురాముడు పీఠాన్ని చేరుకుని దానిపై విగ్రహాన్ని ప్రతిష్ఠించి వస్త్రాన్ని తొలగించాడు !
అద్భుతం ! పరమాద్భుతం ! ఆ విగ్రహాన్ని చూస్తూనే అందరి నోటినుండి *‘స్వామియే శరణం అయ్యప్ప ! శరణం అయ్యప్ప’* అన్న మంత్రం వెలువడింది !
ఆ మంత్రాన్ని తన్మయత్వంతో పలుకుతూ చేతులు తడుతున్న అందరి కళ్లకు మరొక అద్భుత దృశ్యం కానవచ్చింది !
మణికంఠుని శక్తి
విగ్రహంలో లీనం చెందుట
పంబల రాజకుమారుడుగా అందరి మనస్సులలో ముద్రించుకుపోయిన రూపం మణికంఠస్వామి సుందర బాలరూపం ! పన్నెండు సంవత్సరాల బాలుడుగా ప్రజలెరిగిన ఆ రూపంలో చేతుల్లో విల్లంబులు ధరించి మెట్లలాగా పడుకున్న పద్ధెనిమిది మంది దేవతల మీదుగా నడిచి ఎక్కి వచ్చి ఆ విగ్రహంలో విలీనమైపోవటం చూసి భక్తి పారవశ్యంతో *‘మణికంఠస్వామికి జయము ! అయ్యప్పస్వామికి జయము !’’* అంటూ నినాదాలు చేశారు అందరూ !
*‘‘మహిషిని మర్దించి లోకాలకు శాంతిని ప్రసాదించిన హరిహర పుత్రుడు మణికంఠుడు తన శక్తిని ఈ విగ్రహంలో ప్రతిష్ఠ చేసి మహిమాన్వితంగా , దివ్య శక్తి సమన్వితం కావించాడు ! ఆ స్వామి ఎక్కడానికి మెట్లుగా అమరిన పద్ధెనిమిది మంది దేవతలు తమ శక్తులను మెట్లలో లీనం కావించటంతో మీకు కనిపిస్తున్న ఈ మెట్లు కూడా ఎంతో మహిమాన్వితమైనాయి ! ఇక స్వామికి శాస్త్రోక్తంగా అభిషేకం , పూజార్చనలు జరుపబడతాయి !’’* అని ప్రకటించారు అగస్త్య మహర్షి !
పంచామృతాలతో అభిషేకం , పూజా కార్యక్రమం అగస్త్య మహర్షి , మునిగణాలు పరశురాముని ఆధ్వర్యంలో నిర్వర్తించారు ! పట్టు పీతాంబరంలో , దివ్యమైన ఆభరణాలమధ్య స్వామి మణిహారం వింత వెలుగులు వెదజల్లుతుండగా భువన మోహనంగా కానవచ్చింది స్వామి విగ్రహం !
*?అయ్యప్పస్వామి విగ్రహ వర్ణన - అంతరార్థం !?*
స్వామి విగ్రహంవైపు తన్మయత్వంతో చూస్తున్న అందరివైపు ప్రసన్నంగా చూస్తూ గంభీరంగా ఆ విగ్రహంలోని అంతరార్థాన్ని వివరించారు పరశురాములవారు !
No comments
Post a Comment