ఆయుర్వేద చిట్కాలు

నీరసము :

» తియ్యటి అరటిపండును గాని, ఉసిరికాయలను కానీ మరియు  నల్లద్రాక్ష పండ్లను కానీ తీసుకుంటే నీరసం తగ్గిపోయి బలం కూడా  వస్తుంది.

» మూడు వంతుల తేనెను , ఒక వంతు నీరుల్లిపాయ రసంలో కలిపి రోజూ ఉదయం తీసుకుంటే నీరసం తగ్గిపోతుంది.

» ఉప్పు, మిరియాలపొడి మరియు  పచ్చిద్రక్షను  ఈ మూడింటిని కలిపి తీసుకుంటే నీరసం తగ్గుతుంది.

గాయాలు :

» రెండు లేదా  మూడు చుక్కల తమలపాకుల రసాన్ని గాయం పైన వేస్తె గాయం చీము పట్టకుండా త్వరగా తగ్గిపోతుంది.

» మామిడి చెట్టు బెరడు రసాన్ని తెగిన గాయాలపై రాస్తే రక్తం ఆగి గాయం తొందరగా కూడా  మానుతుంది.

» లేత కొబ్బరి నీటిలో కొద్దిగా పసుపు మరియు కొద్దిగా సున్నపు తేటను కలిపి గాయాలపై రాస్తే త్వరగా తగ్గుతాయి.

అజీర్ణము :

» ద్రాక్ష పళ్ళు మరియు కరక్కాయ పెచ్చులు రెండింటిని సమానంగా కలిపి తేనెతో బాగా నూరాలి, ఈ మిశ్రమాన్ని చిన్న  ఉసిరికాయ సైజులో మాత్రలుగా చేసి రోజూ రెండు పూటలు వేడి నీటితో తీసుకుంటే అజీర్ణము తగ్గుతుంది.

» శొంఠి మరియు బెల్లాన్ని కలిపి నూరిన చూర్ణాన్ని ఉప్పు నీటిలో కలిపి తాగితే అజీర్ణము తొందరగా  తగ్గుతుంది.

» జీలకర్ర, వాము మరియు  పిప్పళ్లు, శొంఠి వీటిని అన్నింటినీ ఒకే పరిమాణంలో తీసుకొని పొడిగా చేసుకోవాలి . ఈ మిశ్రమానికి అంతే పరిమాణంలో బెల్లాన్ని కలిపి రోజూ రెండు పూటలు తీసుకుంటే అజీర్ణము తగ్గుతుంది.

తల నొప్పి :

» హారతి కర్పూరము మరియు  మంచి గంధము రెండింటినీ సమ భాగాలుగా కలిపి నూరి నుదుటిపై రాస్తే తలనొప్పి తగ్గిపోతుంది.

» చిన్న యాలకుల చూర్ణం ముక్కుపొడుములా పీల్చడం వల్ల కూడా  తలనొప్పి తగ్గుతుంది.

» నిమ్మకాయ రసంలో బెల్లం మరియు ఉప్పు కలిపి నూరి పట్టువేస్తే తలనొప్పి తొందరగా  తగ్గిపోతుంది.

కాలు, చేతి పగుళ్లు :

» ఆవనూనె మరియు  గుగ్గిలము లను సమానంగా తీసుకొని కొద్దిగా ఆ మిశ్రమానికి నీటిని కలిపి ముద్దలా చేసి పగుళ్ళకు రాసినట్లయితే పగుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి.

» కొంచెం గ్లిజరిన్ ను కొబ్బరి పాలలో కలిపి రాస్తే పగుళ్లు తగ్గిపోతాయి.

» నెయ్యి, బెల్లం మరియు  గుగ్గిలము లను సమానంగా కలిపి రాస్తే కాళ్ళ పగుళ్లు తగ్గిపోతాయి.

ఎక్కిళ్ళు :

» వాము, మిరియాలను సమానంగా తీసుకొని ఆ మిశ్రమాన్ని బాగా కలిపి నిప్పుల మీద వేసి ఆ పొగను పీలిస్తే ఎక్కిళ్ళు  తొందరగా పోతాయి.

» తమలపాకులో కుంకుమ పువ్వు వేసి నమిలి మింగితే ఎక్కిళ్ళు రావడం  తగ్గిపోతాయి.

» చేరుకురసం లేదా వేడి ఆవు పాలు తాగటం వల్ల  కూడా ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.

బలం పొందటానికి :

» ప్రతీ రోజూ ఉదయాన్నే నల్ల నువ్వులు లేదా మర్రి పండు గింజలను లేదా అప్పుడే తీసిన వెన్నను తినటం ద్వారా బలాన్ని పెంచుకోవచ్చును .

» తుమ్మ చెట్టు పట్ట చూర్ణమును రోజూ రెండు పూటలు నెయ్యిలో కలుపుకొని తినటం ద్వారా శరీరానికి బలం చేకూరుతుంది  .

» ఖర్జురపు పండ్లను నీటిలో నానబెట్టి బాగా నలిపి ఆ నీటిని తాగటం వల్ల శారీరక బలాన్ని పెంచుకోవచ్చును .

పంటి నొప్పి :

» పసుపు కొమ్మును కాల్చి, బూడిదగా మార్చి ఆ పొడితో పళ్ళు తరచూ  తోమితే పంటి నొప్పులు తగ్గిపోతాయి.

» పుచ్చు పళ్ళ మీద మర్రిపాలను చుక్కలుగా వేస్తే క్రిములు నశించి నొప్పి  కూడా తగ్గుతుంది.

» కర్పూర తైలంలో దూదిని ముంచి  పుప్పి పంటి పైన పెడితే  పన్ను నొప్పి తొందరగా  తగ్గుతుంది.

» నిమ్మ రసంలో ఇంగువను కలిపి కొద్దిగా వేడిచేసి దూదితో పంటి పైన పెడితే నొప్పి కూడా  తగ్గిపోతుంది.

దురదలు :

» కొబ్బరి నూనెలో వేపాకు రసం వేసి వేడిచేసి రాస్తే దురద తగ్గిపోతుంది.

» వేప చిగురు మరియు పసుపు లను మంచిగా నూరి దురద ఉన్న చోటున రాస్తే దురద తొందరగా తగ్గుతుంది.

» మిరియాలు మరియు  వేపాకు లను కలిపి నూరి ఆ మిశ్రమాన్ని తింటే దురద తగ్గిపోతుంది.

జలుబు :

» ఒక చెంచా పసుపు పొడిని  ఒక కప్పు పాలలో  కలిపి, తీసుకుంటే జలుబు మరియు  పడిసెము తగ్గుతాయి.

» ఒక గ్లాసు అనాసపండు రసంలో మిరియాలపొడి మరియు  ఉప్పు కలిపి తీసుకుంటే జలుబు తగ్గుతుంది.

» తులసి ఆకుల రసంలో తేనెను కలిపి తీసుకుంటే  దగ్గు   జలుబు తగ్గిపోతాయి.

» మిరియాలపొడి మరియు  పెరుగును కలిపి తింటే జలుబు తగ్గుతుంది.

దగ్గు :

»వామును  నిప్పుల మీద వేసి దాని నుంచి వచ్చే పొగను పిలిస్తే దగ్గు తగ్గుతుంది.

» అరటిపండు మధ్యలో మిరియాల పొడిని వేసి తింటే దగ్గు తొందరగా  తగ్గుతుంది.

» పసుపు కొమ్ములను వేయించి చిన్న ముక్కలుగా కొట్టాలి. అలా  వచ్చిన   రెండు ముక్కలను దవడలో పెట్టుకొని రసాన్ని తరచూ  మింగటం వల్ల దగ్గు తగ్గిపోతుంది.

» లవంగంను కాల్చి పొడి చేసి కొద్దికొద్దిగా తీసుకుంటే దగ్గు నిదానముగా తగ్గుతుంది.

నిద్ర :

» కొద్దిగా వేడి చేసిన గసగసాలను బట్టలో మూట కట్టి వాసన చూస్తే నిద్ర వస్తుంది.

» నిప్పులపై కురాసాని వామును వేసి పొగను పీలిస్తే నిద్ర బాగా వస్తుంది.

» ప్రతీ రోజు ఉదయం మరియు సాయంత్రం ఒక నిమ్మకాయ రసాన్ని క్రమం తప్పకుండా తాగితే మంచి నిద్ర పడుతుంది.

» పడుకునేటప్పుడు వేడి పాలలో కొంచెం తేనే  కలుపుకొని  తాగితే మంచి నిద్ర పడుతుంది.

 మలబద్ధకం :

» ఖర్జూరం, మేడి పండ్లు మరియు  క్యాబేజీలను బాగా తినడం వల్ల మలబద్దకం తగ్గిపోతుంది.

» వెన్న మరియు  నెయ్యిలను అన్నంలో కలుపుకొని క్రమంగా తినటం వల్ల మలబద్దకం తగ్గిపోతుంది.

» శొంఠి, కరక్కాయ మరియు  పిప్పళ్ళను సమానంగా కలిపి పొడిగా చేసి బెల్లంతో కలిపి తీసుకోవటం ద్వారా మలబద్దకం తగ్గుతుంది.

వాంతులు :

» నిమ్మరసం తాగటం వల్ల చిన్న పిల్లలకు మరియు  పెద్దవారికీ  ప్రయాణాలలో తరుచుగా అయ్యే వాంతులు ఆగిపోతాయి.

» తినే సోడా ఉప్పు కలిపిన నీటిలో వామును కలిపి త్రాగితే వాంతులు  తొందరగా తగ్గిపోతాయి.

» దానిమ్మ గింజలు తినడం మరియు  నీరుల్లి వాసన చూడటం ద్వారా కూడా వాంతులు తగ్గుతాయి.

లావు :

» బార్లీ యొక్క పిండితో చేసిన రొట్టెలను రోజూ తీసుకునే ఆహారానికి బదులుగా తీసుకుంటే లావు తగ్గుతారు.

» ఉదయాన్నే ప్రతీ రోజు నీటిలో ఒకటి రెండు స్పూనుల తేనెను కలిపి క్రమంగా తీసుకుంటే లావు తగ్గవచ్చును .